
ఉండాల్సినదాని కంటే ఎక్కువ బరువు ఉండటం ఆరోగ్యానికి మేలు చేయదని అనేక మార్లు రుజువైంది. ఇటీవల ఇరవై వేర్వేరు అధ్యయనాల్లో దాదాపు పదివేలమంది స్థూలకాయం ఉన్నవారితో పాటు సాధారణ బరువున్న మరో మూడు లక్షలమందిపై నిర్వహించిన అధ్యయనాల్లో ఇది మరో మారు వాస్తవమని తేలింది.
మామూలు బరువున్నవారితో పోలిస్తే స్థూలకాయులలో మరణాల రేటు 2.5 రెట్లు అధికమని ‘లాస్’ అనే మెడికల్ జర్నల్ పేర్కొంటోంది. బరువు పెరుగుతున్న కొద్దీ గుండెజబ్బులు, కేన్సర్లు, పక్షవాతం, డయాబెటిస్, కిడ్నీ జబ్బులు, కాలేయ సమస్యలు వచ్చి అవి మృత్యువుకు దారితీయవచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. అందుకే ఎవరి ఎత్తుకు తగినట్టు బరువును అదుపులో పెట్టుకోవడం చాలా అవసరం.
(చదవండి: డ్యూటీకి.. టిక్.. టిక్..కానీ బాడీ క్లాక్ బీట్ వినండి ప్లీజ్..!)