మ్యాగ్నెటిస్ట్‌.. విపిన్‌.. | Magnetist Vipin Profession Is Ophthalmology But His Passion Is Traveling | Sakshi
Sakshi News home page

మ్యాగ్నెటిస్ట్‌.. విపిన్‌..

Published Sun, Nov 3 2024 12:07 PM | Last Updated on Sun, Nov 3 2024 12:07 PM

Magnetist Vipin Profession Is Ophthalmology But His Passion Is Traveling

వృత్తి కంటి వైద్యం.. ప్రవృత్తి ట్రావెలింగ్‌
500లకు పైగా మ్యాగ్నెట్స్‌ సేకరణ
తెలంగాణ పర్యాటక ప్రదేశాలపైనా విపిన్‌ దృష్టి 
అరౌండ్‌ ది వరల్డ్‌ పేరుతో పుస్తక రచన

సాక్షి, సిటీబ్యూరో: జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి అని నానుడి.. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక హాబీ ఉంటుంది. కొందరికి కాయిన్స్‌ సేకరించడం అలవాటు అయితే మరికొందరికి స్టాంప్స్‌ సేకరించడం అలవాటు. కానీ అందరికీ భిన్నంగా ఫ్రిడ్జ్‌ లకు అంటించే బొమ్మల మ్యాగ్నెట్స్‌ సేకరించడం ఆయనకు అలవాటు. ఆయన వృత్తి కంటి వైద్యం.. ఆయన ప్రవృత్తి ట్రావెలింగ్‌. అందరి లాగా ఏదో వెళ్లామా.. వచ్చామా అన్నట్టు కాకుండా ఆ ప్రదేశం చరిత్రను అందరికీ తెలియజేసేలా మ్యాగ్నెట్స్‌ సేకరించడం హాబీగా మలుచుకున్నాడు. అతడి పేరే డాక్టర్‌ అంథోనీ విపిన్‌ దాస్‌.

ట్రావెల్లింగ్‌ ప్రాణం..
విపిన్‌ దాస్‌ వృత్తి రీత్యా ఎంత బిజీ అయినా కూడా ఖాళీ సమయాల్లో ట్రావెలింగ్‌ చేయడం ఇష్టం. ట్రావెలింగ్‌తో ఎన్నో అనుభవాలు, సంస్కృతి, సంప్రదాయాల గురించి ఎంతో తెలుసుకున్నానని విపిన్‌ చెబుతున్నాడు. అయితే ఏదైనా విభిన్నంగా చేయాలనే తలంపుతో కొత్తగా మ్యాగ్నెట్స్‌ సేకరించడం ప్రారంభించాడు.
అలా దాదాపు ఏకంగా 500లకు పైగా మ్యాగ్నెట్స్‌ సేకరించాడు. అలా ఒక్కో ప్రదేశం చరిత్రను ఒక్కో మ్యాగ్నెట్‌ రూపంలో ఉండేలా చూసుకున్నాడు. అలా ఎన్నో దేశాలు, ప్రదేశాల చరిత్ర, సంప్రదాయాల గురించి ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశాడు. ట్రావెలర్స్‌ కోసం ప్రత్యేకంగా ట్రావెరి్నయా ఫెస్ట్‌ను నవంబర్‌ 15న హైటెక్స్‌లో అంగరంగ వైభవంగా జరుపనున్నారు.

తెలంగాణ చరిత్ర తెలుసుకునేలా..  
సాధారణంగా ఒక్కో దేశం గురించి మ్యాగ్నెట్స్‌ సేకరించడం విపిన్‌ కు అలవాటు. కానీ తెలంగాణపై మక్కువతో తెలంగాణ పర్యాటక ప్రదేశాలపై వినూత్నంగా మ్యాగ్నెట్స్‌ రూపొందించాడు విపిన్‌. అంతే కాకుండా తెలంగాణ సంస్కృతిపై మ్యాగ్నెట్స్‌ తో పాటు.. త్రీడీ బొమ్మలు కూడా రూపొందించారు. దీంతోపాటు అరౌండ్‌ ది వరల్డ్‌ పేరుతో తన అనుభవాలతో ఒక పుస్తకాన్ని కూడా రూపొందించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement