focus
-
న్యూ ఇయర్ ఎఫెక్ట్.. పబ్బులపై నిఘా..
-
మ్యాగ్నెటిస్ట్.. విపిన్..
సాక్షి, సిటీబ్యూరో: జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి అని నానుడి.. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక హాబీ ఉంటుంది. కొందరికి కాయిన్స్ సేకరించడం అలవాటు అయితే మరికొందరికి స్టాంప్స్ సేకరించడం అలవాటు. కానీ అందరికీ భిన్నంగా ఫ్రిడ్జ్ లకు అంటించే బొమ్మల మ్యాగ్నెట్స్ సేకరించడం ఆయనకు అలవాటు. ఆయన వృత్తి కంటి వైద్యం.. ఆయన ప్రవృత్తి ట్రావెలింగ్. అందరి లాగా ఏదో వెళ్లామా.. వచ్చామా అన్నట్టు కాకుండా ఆ ప్రదేశం చరిత్రను అందరికీ తెలియజేసేలా మ్యాగ్నెట్స్ సేకరించడం హాబీగా మలుచుకున్నాడు. అతడి పేరే డాక్టర్ అంథోనీ విపిన్ దాస్.ట్రావెల్లింగ్ ప్రాణం..విపిన్ దాస్ వృత్తి రీత్యా ఎంత బిజీ అయినా కూడా ఖాళీ సమయాల్లో ట్రావెలింగ్ చేయడం ఇష్టం. ట్రావెలింగ్‌తో ఎన్నో అనుభవాలు, సంస్కృతి, సంప్రదాయాల గురించి ఎంతో తెలుసుకున్నానని విపిన్ చెబుతున్నాడు. అయితే ఏదైనా విభిన్నంగా చేయాలనే తలంపుతో కొత్తగా మ్యాగ్నెట్స్ సేకరించడం ప్రారంభించాడు.అలా దాదాపు ఏకంగా 500లకు పైగా మ్యాగ్నెట్స్ సేకరించాడు. అలా ఒక్కో ప్రదేశం చరిత్రను ఒక్కో మ్యాగ్నెట్ రూపంలో ఉండేలా చూసుకున్నాడు. అలా ఎన్నో దేశాలు, ప్రదేశాల చరిత్ర, సంప్రదాయాల గురించి ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశాడు. ట్రావెలర్స్ కోసం ప్రత్యేకంగా ట్రావెరి్నయా ఫెస్ట్‌ను నవంబర్ 15న హైటెక్స్‌లో అంగరంగ వైభవంగా జరుపనున్నారు.తెలంగాణ చరిత్ర తెలుసుకునేలా.. సాధారణంగా ఒక్కో దేశం గురించి మ్యాగ్నెట్స్ సేకరించడం విపిన్ కు అలవాటు. కానీ తెలంగాణపై మక్కువతో తెలంగాణ పర్యాటక ప్రదేశాలపై వినూత్నంగా మ్యాగ్నెట్స్ రూపొందించాడు విపిన్. అంతే కాకుండా తెలంగాణ సంస్కృతిపై మ్యాగ్నెట్స్ తో పాటు.. త్రీడీ బొమ్మలు కూడా రూపొందించారు. దీంతోపాటు అరౌండ్ ది వరల్డ్ పేరుతో తన అనుభవాలతో ఒక పుస్తకాన్ని కూడా రూపొందించాడు. -
హైడ్రా మరో సంచలన నిర్ణయం
-
కేటీఆర్ ఫార్మ్ హౌస్ పై హైడ్రా నజర్
-
కేటీఆర్ ఫార్మ్ హౌస్ పై హైడ్రా నజర్
-
‘వందేభారత్‌పైనే శ్రద్ధనా?’ రైల్వే మంత్రి ఏమన్నారంటే..
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన 2024-25 బడ్జెట్లో ఉద్యోగ కల్పన, గ్రామీణాభివృద్ధిపై అధికంగా దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. ఆర్థిక మంత్రి తన 83 నిమిషాల సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగంలో రైల్వే అనే పదాన్ని ఒక్కసారి మాత్రమే ప్రస్తావించారు. దీంతో ప్రభుత్వం రైల్వేలకు ఏమి చేస్తున్నదనే ప్రశ్న పలువురి మదిలో మెదిలింది. అలాగే ప్రభుత్వం వందేభారత్‌పై పెడుతున్న శ్రద్ధ.. పేదల రైళ్ల విషయంలో పెట్టడం లేదంటూ పలు ఆరోపణలు వినవస్తున్నాయి. వీటిపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు.బడ్జెట్ వెలువడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో తక్కువ ఆదాయవర్గానికి చెందినవారు అధికంగా ఉన్నారని, వీరికి సంబంధించిన రైళ్ల విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నదన్నారు. అటు వందేభారత్పైన, ఇటు సాధారణ ప్రయాణికులు రైళ్లపైన కూడా దృష్టి పెడుతున్నదన్నారు. రైలును రూపొందించే విధానం ప్రతి రైలుకు ప్రామాణికంగా ప్రత్యేకంగా ఉంటుందని, దానికి అనుగుణంగా నిర్దిష్ట సంఖ్యలో ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లు, నాన్-ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లు ఉంటాయన్నారు. అల్ప ఆదాయ వర్గానికి చెందినవారు తక్కువ చార్జీలకే ప్రయాణించేలా చూడటమే రైల్వేల ప్రధాన లక్ష్యమన్నారు. దేశంలో కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, గేజ్ మార్పిడి, డబ్లింగ్‌లో గణనీయమైన పెట్టుబడితో సహా గత ఐదేళ్లలో రైల్వేలపై మూలధన వ్యయం 77 శాతం పెరిగిందని 2023-24 ఆర్థిక సర్వే తెలిపిందన్నారు. 2014కు ముందు రైల్వేలకు మూలధన వ్యయం సుమారు రూ. 35,000 కోట్లు అని, నేడు ఇది రూ. 2.62 లక్షల కోట్లు అని, ఈ తరహా పెట్టుబడులు పెట్టినందుకు ప్రధానికి, ఆర్థిక మంత్రికి కృతజ్ఞతలు చెబుతున్నానని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. -
సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్
-
గ్రేటర్ హైదరాబాద్ పై.. గ్రేట్ ఫోకస్
-
మోదీ 3.0: తొలి బడ్జెట్లో ఆర్థిక ఎజెండాపై దృష్టి
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు మరోసారి ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు. నూతన ప్రభుత్వం త్వరలో తన మొదటి బడ్జెట్‌ను సమర్పించనుంది. ఈ నేపధ్యంలో మంత్రి సీతారామన్‌కు అనేక సవాళ్లు ఎదురుకానున్నాయని ఆర్థికరంగ నిపుణులు అంటున్నారు. ద్రవ్యోల్బణంపై ఎలాంటి ప్రభావం చూపకుండా ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసే చర్యలను ప్రభుత్వం పరిశీలించాల్సి ఉంటుందని వారు సూచిస్తున్నారు.ఆర్థిక మంత్రిత్వ శాఖ పగ్గాలు చేపట్టిన సీతారామన్ తన ఆర్థిక ఎజెండాలో భారతదేశాన్ని ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి కృషి చేయాల్సి ఉంటుంది. అలాగే 2047 నాటికి దేశాన్ని ‘అభివృద్ధి చెందిన భారతదేశం’గా మార్చడానికి తగిన ఆర్థిక సంస్కరణలను వేగవంతం చేసేదిశగా ముందడుగు వేయాలి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రిజర్వ్ బ్యాంక్ నుండి డివిడెండ్ రూపంలో ప్రభుత్వం అందుకున్న రూ. 2.11 లక్షల కోట్లు దేశ ఆర్థిక స్థితికి మెరుగుదలకు సహాయకారిగా మారినట్లు నిరూపితమయ్యింది.మోదీ 3.0 ప్రభుత్వానికి దేశంలోని వ్యవసాయ రంగంలో ఒత్తిడిని పరిష్కరించడం, ఉపాధి కల్పన, మూలధన వ్యయాల వేగాన్ని కొనసాగించడం, ఆర్థిక ఏకీకరణ మార్గంలో ఉండటానికి ఆదాయ వృద్ధిని పెంచడం వంటివి కీలకంగా మారనున్నాయి. మరోవైపు బ్యాంకింగ్ రంగంలో సంస్కరణల విషయంలో ప్రభుత్వం ఇప్పటికీ కొంత వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు బీమా కంపెనీల ప్రైవేటీకరణకు పలు ఆటంకాలు ఏర్పడుతున్నాయనే వాదన వినిపిస్తోంది.నిర్మలా సీతారామన్ 2019లో తొలిసారిగా ఆర్థిక శాఖ బాధ్యతలు స్వీకరించారు. నాటి నుండి ఆమె ఈ బాధ్యతలను కొనసాగిస్తున్నారు. సీతారామన్ స్వతంత్ర భారతదేశంలో మొదటి పూర్తికాల మహిళా ఆర్థిక మంత్రిగా గుర్తింపు పొందారు. ఆమె ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో దేశం కోవిడ్ -19 మహమ్మారితో ఉత్పన్నమైన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని, వాటిని సమర్థవంతంగా దాటగలిగింది. -
విశాఖ, విజయవాడ ఆర్థిక వృద్ధిపై ఫోకస్
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం, విజయవాడ ఆర్థిక వృద్ధిపై ఫోకస్ పెడుతున్నట్టు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సదరన్ రీజియన్ చైర్మన్ కమల్ బాలి తెలిపారు. ఈ రెండు నగరాలు ఆదర్శ నగరాలుగా, రాష్ట్ర వృద్ధి కేంద్రాలుగా ఎదగడానికి అవసరమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయన్నారు. గురువారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2047 నాటికి దక్షిణ భారతదేశాన్ని ఆర్థిక వృద్ధిపరంగా ప్రోత్సహించేందుకు సీఐఐ తొమ్మిది ఫోకస్డ్ ట్రాక్‌లను ప్రారంభించినట్టు చెప్పారు. ప్రజలు–సంస్కృతి పునరుజ్జీవనం, సంపూర్ణ సుస్థిరత, డిజిటల్, ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్, టెక్ అడాప్షన్, స్టార్టప్ ఎకో సిస్టమ్స్, మాన్యుఫ్యాక్చరింగ్ ఎక్స్‌లెన్స్, ఇండస్ట్రీ 4.0, ఇంటర్నేషనల్ లింకేజెస్, ఎంఎస్ఎంఈ వంటివి ఇందులో ఉన్నాయని వివరించారు. 2023–24 సంవత్సరానికి వృద్ధి, సుస్థిరత, నమ్మకం, ప్రపంచీకరణ అనే అంశాలపై దృష్టి సారిస్తున్నామన్నారు. సేవల రంగానికి ప్రపంచవ్యాప్త గమ్యస్థానంగా భారత్ నిలుస్తోందని, అందువల్ల పలు ఫారచ్యన్ 500 కంపెనీలు దేశంలో తమ సాంకేతిక కేంద్రాలను ఏర్పాటు చేశాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సహకరించడానికి సీఐఐ కట్టుబడి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఐఐ జాయింట్ కన్సల్టేటివ్ ఫోరంలు అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలను బలోపేతం చేయడం, వ్యూహాత్మక ఫ్రేమ్‌వర్క్‌లను రూపొందించడం, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి నిర్దిష్ట సంస్కరణలు అమలు చేయడం, పారిశ్రామిక వృద్ధికి అనుకూల విధానాలను రూపొందించడానికి ప్రభుత్వ–పరిశ్రమల భాగస్వామ్యాలను సులభతరం చేయడంపై దృష్టి సారిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో తయారీ పెట్టుబడులను పెంచడానికి తమవంతు సహకరిస్తామని, ఎలక్ట్రానిక్ సిస్టం డిజైన్, తయారీ, డిఫెన్స్, ఏరోస్పేస్, ఫార్మా, బయోటెక్నాలజీ తదితర రంగాల్లో పెట్టుబడులకు అనుకూలంగా ఉందని వివరించారు. ప్రస్తుతం దేశంలోని మత్స్య ఎగుమతుల్లో ఏపీ అత్యధిక వాటాను కలిగి ఉందని తెలిపారు. సీఐఐ ఏపీ చైర్మన్ ఎం.లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ.. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ప్రోత్సాహం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సముద్ర ఆహార ఉత్పత్తి, ఎగుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వారివెంట సీఐఐ రీజనల్ డైరెక్టర్ ఎన్ఎంపీ జయేష్ ఉన్నారు. -
షేర్లు.. ఆస్తులు..పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్: వందల కోట్ల అక్రమార్జనతో దొరికిపోయిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో తవ్వినకొద్దీ మరిన్ని అక్రమ ఆస్తులు బయటపడుతున్నాయి. పలువురు రియల్ ఎస్టేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా కీలక నిర్ణయాలు తీసుకుని తాను పెద్ద మొత్తంలో లబ్ధి పొందినట్టు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీల్లోనూ బినామీల పేరిట షేర్లు తీసుకోవడంతో పాటు పెట్టుబడులు సైతం పెట్టినట్టు సమాచారం. శివబాలకృష్ణను ఏసీబీ కోర్టు ఎనిమిది రోజుల కస్టడీకి అనుమతించిన విషయం తెలిసిందే. ఆరో రోజు కస్టడీలో భాగంగా సోమవారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టారు. తమ సోదాల్లో గుర్తించిన ఆస్తులు, ఆభరణాలు, బ్యాంకు ఖాతాలు, కుటుంబ సభ్యులు, బినామీల పేరిట ఉన్న బ్యాంకు ఖాతాలు, లాకర్లు, కీలక ఆస్తులకు సంబంధించిన పత్రాలు.. ఇలా పలు అంశాలపై గత ఐదు రోజులుగా శివబాలకృష్ణ నుంచి సమాచారం సేకరించిన ఏసీబీ అధికారులు.. తాజాగా రియల్ ఎస్టేట్ కంపెనీలతో లింకులపై ఫోకస్ పెట్టారు. పలు రకాల అనుమతులకు సంబంధించి లోతుగా ఆరా తీస్తున్నారు. రెండు రియల్ కంపెనీలతో పలు లావాదేవీలు ప్రాథమిక ఆధారాల ప్రకారం..ప్రధానంగా రెండు రియల్ ఎస్టేట్ కంపెనీలతో శివబాలకృష్ణ పలు లావాదేవీలు జరిపినట్టు తెలిసింది. సోమవారం నాటి విచారణలో భాగంగా సంబంధిత వివరాలు ఏసీబీ అధికారులు సేకరించినట్టు తెలిసింది. అదేవిధంగా లాకర్లు ఓపెన్ చేసినప్పుడు లభించిన పలు భూ పత్రాలపైనా ప్రశ్నించినట్టు సమాచారం. ఇప్పటికే శివబాలకృష్ణ సోదరుడు సునీల్‌ను అధికారులు ప్రశ్నించారు. అతడి నుంచి సేకరించిన వివరాల ఆధారంగా మరిన్ని అంశాలపై శివబాలకృష్ణను ప్రశ్నించినట్టు తెలిసింది. ఔటర్ చుట్టూ కొన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతుల్లోనూ అవినీతికి పాల్పడిన శివబాలకృష్ణ తన బినామీల పేరిట ఆస్తులు కూడబెట్టినట్టు సమాచారం. వీటి గురించి కూడా అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. రెండు రోజుల్లో కస్టడీ ముగియనున్న నేపథ్యంలో కీలక అంశాలపై మరిన్ని వివరాలు సేకరించేలా ఏసీబీ అధికారులు ప్రశ్నావళి రూపొందించుకుంటున్నట్టు తెలిసింది. -
మెడికల్ కాలేజీలపై సీఎం రేవంత్ ఫోకస్
-
లోక్‌సభ ఎన్నికలపై దృష్టిసారించండి
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పనిచేయాలని రాష్ట్రాల బీజేపీ ప్రధాన కార్యదర్శులు, జాతీయ ప్రధాన కార్యదర్శులకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సూచించారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో గత తొమ్మిదిన్నరేళ్లుగా ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలుచేసిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. మంగళవారం సుమారు 5 గంటలపాటు ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో అమిత్ షా, జేపీ నడ్డాలు మార్గదర్శనం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో తెలంగాణ నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శులు బండి సంజయ్ కుమార్, తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్‌లతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నూతనంగా నియమితులైన చంద్రశేఖర్, ప్రేమేందర్ రెడ్డి, బంగారు శ్రుతి, దుగ్యాల ప్రదీప్ కుమార్, కాసం వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాలపై సునీల్ బన్సల్, చంద్రశేఖర్‌లు రాష్ట్ర నాయకులతో ప్రత్యేకంగా చర్చించారు. అంతేగాక క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టిసారించాలని సూచించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్‌ను బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. రాజస్తాన్‌లో బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్ 2017 సెపె్టంబర్ నుంచి పనిచేస్తున్నారు. ఆర్ఎస్ ఎస్ నేపథ్యం ఉన్న చంద్రశేఖర్ ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. 2017లో రాజస్తాన్ బాధ్యతలు తీసుకొనే ముందు చంద్రశేఖర్ పశి్చమ ఉత్తరప్రదేశ్, అంతకు ముందు వారణాశి ప్రాంతీయ సంస్థమంత్రిగా పనిచేశారు. అంతేగాక 2014లో చంద్రశేఖర్ ప్రధాని మోదీతో కలిసి వారణాశి లోక్‌సభ స్థానం కోసం క్షేత్రస్థాయిలో పనిచేశారు. నెలాఖరులో రాష్ట్రానికి అమిత్‌షా ? వచ్చేనెలలో ఐదు క్లస్టర్లలో బీజేపీ యాత్రలు సాక్షి, హైదరాబాద్: ఈ నెలాఖరులో కేంద్రమంత్రి అమిత్‌షా రాష్ట్ర పర్యటన ఉంటుందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. దేశవ్యాప్తంగా మొత్తం ఎంపీ సీట్లను 143 క్లస్టర్లుగా బీజేపీ ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణకు వచ్చేసరికి ఐదు క్లస్టర్లుగా విభజించారు. వీటికి నలుగురు రాష్ట్రప్రధానకార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్, బంగారు శ్రుతి, కాసం వెంకటేశ్వర్లుయాదవ్, ఇంకా సీనియర్‌నేత, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు ఇన్‌చార్జ్‌లుగావ్యవహరిస్తారని సమాచారం. మంగళవారం ఢిల్లీలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో క్లస్టర్ ఇన్‌చార్జ్‌లతో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పార్టీసంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్.సంతోష్ సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వచ్చేనెలలో తెలంగాణలో 10 రోజులపాటు బీజేపీ యాత్రలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఐదు పార్లమెంట్ క్లస్టర్ల వారీగా ఈ యాత్రలు ఉంటాయి. ఇందులో భాగంగా తెలంగాణ అప్పులు తీరాలన్న, తెలంగాణ అభివృద్ధి చెందాలన్న మరోసారి మోదీ అధికారంలోకి రావాలన్న అంశం విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది. -
రెండు రోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనకు రంగం సిద్ధమవుతోంది. రెండు స్థానాలూ కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశమున్న నేపథ్యంలో రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించాలని పార్టీ భావిస్తోంది. అందులో భాగంగా రాష్ట్ర పార్టీ ఇన్చార్జి దీపాదాస్మున్షీ ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయం తీసుకుని అధిష్టానానికి నివేదించారు. లోక్‌సభ సమన్వయకర్తల సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కూడా అధిష్టానం పెద్దలు ఈ విషయమై చర్చించి ఆయన అభిప్రాయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల కోసం ఎస్సీ, బీసీ, మైనార్టీ ల పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. రేవంత్ మంత్రివర్గంలో కచి్చతంగా స్థానం లభిస్తుందని భావిస్తున్న తుంగతుర్తి నాయకుడు అద్దంకి దయాకర్ అభ్యర్థిత్వాన్ని ఎమ్మెల్యే కోటాలో ప్రకటించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయనే చర్చ జరుగుతోంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన బీసీ వర్గాలకు చెందిన నాయకుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పేరు కూడా దాదాపు ఖరారైందని సమాచారం. వీరిద్దరితో పాటు మైనార్టీ కోటాలో షబ్బీర్‌అలీ, ఫిరోజ్‌ఖాన్ పేర్లను కూడా అధిష్టానం పరిశీలిస్తోందని, పటేల్ రమేశ్‌రెడ్డిని నల్లగొండ ఎంపీగా, చిన్నారెడ్డిని మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పంపించే ఆలోచనలో కాంగ్రెస్‌పెద్దలున్నట్టు సమాచారం. -
హ్యాట్రిక్‌పై బీజేపీ గురి...!
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ నెగ్గి హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలగా ఉన్న బీజేపీ ఆ దిశగా సన్నాహాలను వేగవంతం చేస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తాలూకు ఊపును కొనసాగించేలా పార్టీ నేతలను, శ్రేణులను సమాయత్తం చేస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 50 శాతానికి పైగా ఓట్ల సాధనను బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది! ఈ మేరకు రాష్ట్రాలవారీగా ముఖ్య నేతలకు అధినాయకత్వం ఇప్పటికే దిశానిర్దేశం చేసింది. ఇటీవలి బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశంలో దీనిపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితరులు నేతలందరికీ ఈ మేరకు స్పష్టం చేయడంతో పాటు ఆ దిశగా బాధ్యతలు కూడా అప్పగించినట్టు సమాచారం. 50 శాతం ఓట్ల లక్ష్యసాధన కోసం 2019తో పోలిస్తే ఈసారి వీలైనన్ని ఎక్కువ లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయాలని బీజేపీ నిర్ణయానికి వచి్చనట్టు చెబుతున్నారు. ఇందుకు ఎన్డీఏ మిత్రపక్షాలను ఒప్పించే ప్రయత్నాలకు పార్టీ ఇప్పటికే శ్రీకారం చుట్టింది. 2019తో పోలిస్తే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సంఖ్య తగ్గడం కూడా తాను ఎక్కువ చోట్ల పోటీ చేసేందుకు వీలు కలి్పస్తుందని బీజేపీ భావిస్తోంది. పంజాబ్‌లో అకాలీదళ్, బిహార్‌లో జేడీ(యూ)తో బీజేపీకి ఇప్పటికే తెగదెంపులవడం తెలిసిందే. తమిళనాడులో అన్నాడీఎంకే, రాజస్థాన్‌లో ఆరెలీ్పలతోనూ అటూ ఇటుగా అదే పరిస్థితి. ఇక మహారాష్ట్రలో శివసేన చీలికలో ఏక్నాథ్ షిండే వర్గానికి బీజేపీ మద్దతుగా నిలిచి ప్రభుత్వ ఏర్పాటుకు దోహదపడింది. కనుక షిండే సేనకు వీలైనన్ని తక్కువ లోక్‌సభ సీట్లిచ్చి అత్యధిక స్థానాల్లో తానే పోటీ చేసేలా కన్పిస్తోంది. నెలాఖరు నుంచి జాబితాలు...! జనవరి నెలాఖరు, లేదా ఫిబ్రవరి తొలి వారం నుంచి బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల జాబితాలు విడుదలయ్యే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ‘‘తొలి జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వంటి దిగ్గజాల పేర్లుంటాయి. తద్వారా ఎన్నికల వాతావరణానికి దేశవ్యాప్తంగా ఊపు తేవాలన్నది లక్ష్యం’’ అని వివరించాయి. 2019 లోక్‌సభ ఎన్నికలప్పుడు కూడా మోదీ, షా, రాజ్‌నాథ్ పేర్లు తొలి జాబితాలోనే చోటుచేసుకోవడం తెలిసిందే. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువ స్థానాలు నెగ్గేందుకు బీజేపీ పలు చర్యలు చేపడుతోంది... 1. తొలి జాబితాలో వీలైనన్ని ఎక్కువ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది. ముఖ్యంగా 2019లో పార్టీ ఇబ్బందులను ఎదుర్కొన్న, తక్కువ మెజారిటీతో నెగ్గిన స్థానాలపై ఈ జాబితాలో బీజేపీ ప్రధానంగా దృష్టి పెట్టనుంది. నిజానికి వీటిని ‘సవాలు స్థానాలు’గా ఎప్పుడో గుర్తించింది. గత ఎన్నికల ఫలితాలు రాగానే వాటిపై గట్టిగా దృష్టి పెట్టింది. ఆయా స్థానాల్లో పరిస్థితిని మెరుగు పరుచుకునేందుకు ప్రయతి్నస్తూ వస్తోంది. 2. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు గాను 2019 ఎన్నికల్లో బీజేపీ 436 చోట్ల పోటీ చేసింది. 303 స్థానాలు నెగ్గి 133 చోట్ల ఓటమి చవిచూసింది. వాటితో పాటు బాగా బలహీనంగా మరో 31 స్థానాలపై బీజేపీ ఈసారి బాగా ఫోకస్ చేస్తోంది. వీటిని తొలి జాబితాలో చేర్చనుంది. 3. ఈ 164 ‘టార్గెటెడ్’ స్థానాల్లో గెలుపు బాధ్యతలను అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, సీనియర్ నేతలకు అప్పగించనుంది. వీటినిప్పటికే రెండు గ్రూపులుగా బీజేపీ విభజించింది. 45 మంది కేంద్ర మంత్రులు ఒక్కొక్కరు రెండు నుంచి నాలుగు స్థానాల చొప్పున బాధ్యతలను భుజాలకెత్తుకుంటారు. 4. ఢిల్లీ పీఠానికి రాచబాటగా పరిగణించే కీలకమైన ఉత్తరప్రదేశ్‌పై ఈసారి బీజేపీ మరింతగా ఫోకస్ చేస్తోంది. రాష్ట్రంలో 80 లోక్‌సభ సీట్లకు గాను 2019 ఎన్నికల్లో 16 చోట్ల బీజేపీ ఓటమి చవిచూసింది. అనంతరం రాయ్‌బరేలీ, మెయిన్‌పురి స్థానాలను ఉప ఎన్నికల్లో చేజిక్కించుకుంది. మిగతా 14 లోక్‌సభ స్థానాల్లో పార్టీ బాగా బలహీనంగా ఉందన్న అంచనాతో వాటిపై బాగా దృష్టి పెడుతోంది. రాయ్‌బరేలీ, మెయిన్‌పురితో పాటు ఈ 14 స్థానాలకూ అభ్యర్థులను తొలి జాబితాలోనే ప్రకటించే యోచనలో ఉంది. వీటిలో సమాజ్‌వాదీ పార్టీ కంచుకోటలుగా చెప్పే పలు స్థానాలున్నాయి. 5. ఇలాగే బిహార్‌లో కూడా క్షేత్రస్థాయిలో బలహీనంగా ఉన్నట్టు భావిస్తున్న నవడా, సుపౌల్, కిషన్‌గంజ్, కతీహార్, ముంగేర్, గయ వంటి స్థానాలు కూడా బీజేపీ తొలి జాబితాలోనే ఉంటాయని భావిస్తున్నారు. 6. మధ్యప్రదేశ్‌లో పీసీసీ మాజీ చీఫ్, కాంగ్రెస్ కురువృద్ధుడు కమల్‌నాథ్ కంచుకోటైన ఛింద్వారాతో పాటు ఆ పార్టీకి పట్టున్న పలు స్థానాలపై బీజేపీ గట్టిగా దృష్టి పెట్టింది. ఛింద్వారా బాధ్యతలను కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్‌కు అప్పగించారు. 7. కేరళలో కూడా త్రిసూర్, తిరువనంతపురం, పథినంతిట్ట వంటి స్థానాల్లో విజయవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు బీజేపీ అంచనా వేస్తోంది. త్రిసూర్ నుంచి సినీ హీరో సురేశ్ గోపిని బరిలో దించుతుందన్న అంచనాలున్నాయి. 8. మహారాష్ట్రలో ఎన్సీపీ చీఫ్ వరద్ పవార్ కంచుకోటైన బారామతితో పాటు బుల్దానా, ఔరంగాబాద్ వంటి లోక్‌సభ స్థానాల్లో ఈసారి ఎలాగైనా పాగా వేసి తీరాలని బీజేపీ పట్టుదలగా ఉంది. ఇక పంజాబ్‌లో అమృత్సర్, ఆనంద్‌పూర్ సాహిబ్, భటిండా, గురుదాస్‌పూర్ తదితర లోక్‌సభ సీట్లపై కూడా పార్టీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. 9. పంజాబ్, మహారాష్ట్ర, బిహార్లలో స్థానిక పారీ్టలతో బీజేపీ పొత్తు చర్చలు ఇప్పటికే ముమ్మరంగా సాగుతున్నాయి. పరిస్థితులు, అవసరాలను బట్టి ఈ రాష్ట్రాల్లో ఇచి్చపుచ్చుకునే ధోరణితో వెళ్లాలన్న యోచనలో అధినాయకత్వం ఉంది. 10. 70 ఏళ్లు పైబడ్డ నేతలకు ఈసారి టికెట్లు ఇవ్వొద్దన్న యోచన కూడా బీజేపీ అధినాయకత్వం పరిశీలనలో ఉందని విశ్వసనీయ సమాచారం! మూడుసార్లకు మించి నెగ్గిన వారిని కూడా పక్కన పెట్టనుందని చెబుతున్నారు. వారికి బదులు కొత్త ముఖాలకు చాన్సివ్వాలని మోదీ–షా ద్వయం సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చారని బీజేపీ వర్గాల్లో గట్టిగానే వినిపిస్తోంది. ఇది నిజమే అయితే అందరికీ వర్తింపజేస్తారా, మినహాయింపులుంటాయా అన్నది చూడాలి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సోషల్ మీడియాపై ఫోకస్ పెంచాలి
సాక్షి, హైదరాబాద్: చీకటి వస్తేనే వెలుగు విలువ తెలుస్తుందని, ఓటమి నుంచి విజయ తీరాలకు చేరేందుకు పట్టుదలతో పనిచేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. అధికారంలో ఉండగా పొరపాట్లు, లోటు పాట్లు చోటు చేసుకున్న మాట వాస్తవమేనని, ప్రభు త్వ పనులపై దృష్టి పెట్టి పార్టీని కొంతనిర్లక్ష్యం చేశామని అన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కా దని, పది పదిహేనేళ్లు కాకపోతే 20 ఏళ్లకైనా పదవి నుంచి దిగాల్సిందేనని, అదే జీవితమని వ్యాఖ్యా నించారు. శాసనసభ ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రభావం బాగా కనిపించిందని, మన పార్టీ యంత్రాంగం కూడా సోషల్ మీడియాపై ఫోకస్ పెంచాలని సూచించారు. లోక్‌సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశాల్లో భాగంగా గురువారం తెలంగాణ భవన్లో కరీంనగర్ సమావేశం జరిగింది. మాజీ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కేటీఆర్ హాజరై పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీకి పునర్జన్మనిచ్చింది కరీంనగరే ‘గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ప్రతి నాయకుడు, కార్యకర్త ముందుకు సాగాలి. ప్రత్యర్థి పార్టీలు సాగించే దుష్ప్రచారాలను ఎప్పటి కప్పుడు దీటుగా తిప్పికొట్టాలి. విద్యార్థి, యువ జన, మైనార్టీ సమ్మేళనాలతో పాటు సోషల్ మీడియా టీం సమావేశం నిర్వహించాలి. వారిని ఎన్నికలకు సన్నద్ధం చేయాలి. ప్రతి ఓటు కీలకం. కాబట్టి ఓట్లు చీలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలకు కష్టం వస్తే ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీనే. బీజేపీ నేతలపై ప్రజలకు విశ్వాసం లేదు. కరీంనగర్ ప్రజల ఆశీర్వాదమే 23 ఏళ్ల పార్టీ రాజకీయ ప్రస్థానం. పార్టీకి జన్మనిచ్చి, కష్టకాలంలో పునర్జన్మ నిచ్చింది కూడా కరీంనగరే. కేసీఆర్‌ను ఉద్యమ సమయంలో కాపాడుకుని, తెలంగాణను సగర్వంగా నిలిపింది కూడా కరీంనగరే..’ అని కేటీఆర్ కొనియాడారు. ప్రజలకు కృతజ్ఞత చెప్పాలి ‘కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావడంతో పదేళ్లు అకుంఠిత దీక్షతో పనిచేశాం. అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టాం. రెండుసార్లు అవకాశం కల్పించిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పాలి. పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు తలెత్తుకునే పనులే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చేశారు తప్ప తలదించుకునే పని చేయలేదు. ప్రభుత్వం, పార్టీ వేరు కాదనే ఉద్దేశంతో పనిచేశాం. సంస్థాగత నిర్మాణంపై అంతగా దృష్టి పెట్టలేదు. వివిధ స్థాయిల్లో పార్టీ కమిటీలకు జిల్లా అధ్యక్షులను నియమించినా, పూర్తి కమిటీలు వేయలేదు. అనుబంధ కమిటీల నిర్మాణం చేయలేకపోయాం. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని కార్యకర్తలకు పనులు ఇవ్వలేదు. పనులిస్తే దుష్ప్రచారం చేస్తారని భావించామే తప్ప, చిన్న చూపుతో కాదు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు సర్పంచ్ మొదలుకొని అన్ని పదవుల్లో బీఆర్ఎస్ వాళ్లే ఉన్నప్పటికీ, మనోడు గెలవాలనే కసితో పని చేయలేదు. ఇతర పార్టీల్లో నలుగురైదుగురే ఉన్నా కసితో పని చేశారు. అందుకే వారు విజయం సాధించారు..’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఎవరికీ భయపడొద్దు ‘నిన్నగాక మొన్న అధికారంలోకి వచ్చిన వాళ్లు గర్వంతో విర్రవీగుతారు. కొత్త బిచ్చగాళ్ల తీరుగా పట్టించుకోవద్దు. కేసుల పేరుతో బెదిరించినా భయపడొద్దు. మేము అండగా ఉంటాం. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు పోలింగ్ ఏజెంట్లను కూడా ప్రభావితం చేస్తారు. అప్రమత్తంగా ఉండాలి. కరీంనగర్‌లోని ఏడు అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లను చూస్తే ఇతర పార్టీల కన్నా బీఆర్ఎస్కే అధిక్యం ఉంది. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క బూత్‌లో 50 ఓట్లు ఎక్కువ వేయిస్తే లక్ష ఓట్లతో విజయం సాధిస్తాం. ప్రశ్నించే గొంతుక వినోద్‌కుమార్‌ను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది..’ అని కేటీఆర్ చెప్పారు. మాజీమంత్రి హరీశ్‌రావు ఈ సమావేశాన్ని ప్రారంభించారు. ఎంపీ కె.కేశవరావు, మాజీ మంత్రులు కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికల సన్నద్ధత విషయంలో పార్టీ వ్యూహాన్ని వివరించారు. -
సన్నద్ధతపై సుదీర్ఘంగా
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల దిశగా సన్నద్ధ తను వేగవంతం చేసేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కసరత్తు ముమ్మరం చేసింది. శస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటున్న పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావుతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రి హరీశ్‌రావు గురువారం నందినగర్‌లోని నివాసంలో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు జరిగిన ఈ సమావేశంలో.. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, కాంగ్రెస్, బీజేపీల సన్నద్ధత, ఎత్తుగడలు, వాటిపై పైచేయి సాధించడం, ఆయా పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులు తదితర అంశాలపై చర్చించారు. కాగా ఆయా అంశాలపై కేసీఆర్ పలు సూచనలు చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఆర్థిక, అంగబలంతో పాటు బలమైన సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను రెండు పార్టీలు బరిలోకి దించుతాయని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ సిట్టింగ్ ఎంపీలతో పాటు గత ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థులకు మళ్లీ అవకాశం ఇస్తే ఎంత మేరకు పోటీ ఇవ్వగలరనే అంశంపైనా చర్చ జరిగినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల తరహాలో ముందస్తుగా అభ్యర్థులను ప్రకటిస్తే ఎదురయ్యే లాభ, నష్టాలపైనా మదింపు జరుగుతోంది. టికెట్‌పై కొందరికి సంకేతాలు చేవెళ్ల, జహీరాబాద్, ఖమ్మం సిట్టింగ్ ఎంపీలు క్షేత్ర స్థాయిలో పని చేసుకునేందుకు కేసీఆర్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లోక్‌సభ స్థానాల్లో గతంలో పోటీ చేసిన ఓటమి పాలైన బోయినపల్లి వినోద్ కుమార్, కల్వకుంట్ల కవిత, గెడాం నగేశ్‌కు కూడా టికెట్ దాదాపు ఖాయం కావడంతో వారు ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. ఇలా కచ్చితంగా టికెట్ ఇవ్వాలని భావించిన నేతలకు మాత్రమే సంకేతాలు ఇచ్చి పార్టీ కేడర్‌ను సమన్వయ పరుచుకోవాల్సిందిగా సమాచారం ఇస్తున్నారు. మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక, పార్టీ స్థితిగతులపై సర్వే సంస్థల నివేదికలతో పాటు వివిధ మార్గాల్లో సేకరించిన సమాచారాన్ని క్రోడీకరిస్తున్నట్లు తెలిసింది. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యేగా గెలుపొందడంతో కొత్త అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉంది. అక్కడి నుంచి కేసీఆర్ బరిలోకి దిగుతారా లేక గతంలో ఇచ్చిన హామీ మేరకు నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డికి టికెట్ ఇస్తారా అనే అంశంపై చర్చ జరుగుతోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఆధిక్యం కనబరిచిన మల్కాజిగిరి, సికింద్రాబాద్ లోక్‌సభ స్థానాలకు ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేయాలని కేటీఆర్, హరీశ్‌తో జరిగిన భేటీలో కేసీఆర్ అభిప్రాయపడినట్లు తెలిసింది. జనవరి 3 నుంచి జనంలోకి పార్టీ కేడర్‌తో అసెంబ్లీ నియోజకవర్గాలు లేదా నియోజకవర్గంలోని మండలాల వారీగా ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఇప్పటికే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జనవరి 3వ తేదీ నుంచి క్షేత్ర స్థాయి కార్యకలాపాలు ప్రారంభించాలని కేసీఆర్ ఆదేశించారు. సుమారు నెల రోజుల పాటు క్షేత్ర స్థాయిలో సమావేశాలు ముమ్మరంగా జరిగేలా పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. కాగా ఫిబ్రవరి రెండో వారం నుంచి కేసీఆర్ స్వయంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశముందని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. -
Indian general election 2024: కాషాయ ప్ర‘దక్షిణం’..!
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజ యాన్ని నమోదు చేయాలన్న గట్టిపట్టుదలతో ఉన్న బీజేపీ తన దృష్టినంతా దక్షిణా ది రాష్ట్రాలపై కేంద్రీకరించింది. ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. కొరకరాని కొయ్యలా ఉన్న దక్షిణాది రాష్ట్రా లపై పట్టు సాధిస్తే కేంద్రంలో వరుస గా మూడోసారి అధికారం దక్కించుకోవడం ఆ పార్టీకి నల్లేరుపై నడకే. ఉత్తరాదితో పోలిస్తే ముందునుంచీ సవాలుగానే ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని బీజేపీ పట్టుదలగా ఉంది... ఆరునూరైనా 60 దాటాల్సిందే...! కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పుదుచ్చేరిలలో కలిపి మొత్తం 130 లోక్‌సభ స్థానాలున్నాయి. 2024 సాధారణ ఎన్నికల్లో వాటిలో 80 సీట్ల సాధనే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే వాటిలో కర్ణాటక మినహా మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో కమలదళం పోటీ పడలేకపోతోంది. గత ఎన్నికల్లో కాషాయపార్టీ ఈ 130 సీట్లలో కేవలం 29 చోట్ల గెలిచింది. కర్ణాటకలో 28 సీట్లకు ఏకంగా 25 నెగ్గగా తెలంగాణలో 17 స్థానాలకుగాను నాలుగు చోట్ల గెలిచింది. ఆంధ్రప్రదేశ్‌లో 25, తమిళనాడులో 39, కేరళలో 20 స్థానాలకు గాను ఒక్కటంటే ఒక్కటి కూడా గెలవలేక చతికిలపడింది. ఈసారి మాత్రం దక్షిణాదిన ఎలాగైనా కనీసం 60 సీట్లలో గెలుపే లక్ష్యంగా పెట్టుకుంది. తాజాగా జరిగిన బీజేపీ పదాధికారుల భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఇదే విషయాన్ని నొక్కిచెప్పారు. బీజేపీ ఎత్తుగడలను ఇటీవలి కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దెబ్బ తీశాయనే చెప్పాలి. కర్ణాటక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌కు 42.88 శాతం ఓట్లు రాగా, బీజేపీ 36 శాతం ఓట్లకు పరిమితం కావడమే గాక రాష్ట్రంలో అధికారం కూడా కోల్పోయింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో 13 శాతం ఓట్లు సాధించిన జేడీ(ఎస్)తో కలిసి లోక్‌సభ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. కాంగ్రెస్‌ను ఎలాగైనా సింగిల్ డిజిట్‌కే పరిమితం చేసేలా వ్యూహాలు రచిస్తోంది. అయితే సీట్ల పంపకాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. జేడీ(ఎస్) నేత కుమారస్వామి ఇటీవలే ప్రధాని మోదీతో ఈ అంశమై చర్చలు జరిపారు. ఇక 2019లో నాలుగు లోక్‌సభ సీట్లు సాధించిన తెలంగాణలో ఈసారి కనీసం రెట్టింపు చోట్ల గెలవాలని బీజేపీ యోచిస్తోంది. తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 7 శాతం ఓట్లు సాధించిన బీజేపీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో దాన్ని రెట్టింపునకు పెంచుకుని 14 శాతం ఓట్లు రాబట్టింది. ఈ లెక్కన ఎంపీ సీట్లను కూడా డబుల్ చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదనే ఆశపడుతోంది. పదాధికారుల భేటీలో మోదీ, షా ద్వయం ఇదే విషయాన్ని తెలంగాణ బీజేపీ నేతలకు నూరిపోశారు. కేరళలో... కేరళలో వామపక్ష సంకీర్ణ కూటమితో తలపడటం బీజేపీకి పెద్ద సవాల్‌గా మారింది. వరుసగా 2104, 2019 ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయిన బీజేపీ ఈసారి కనీసం ఎనిమిది సీట్లు సాధించాలని చూస్తోంది. గత ఎన్నికల్లో 12 శాతం ఓట్లను రాబట్టుకున్న పార్టీ ఈసారి 25 శాతం ఓట్లు లక్ష్యంగా కార్యాచరణను రూపొందిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో తన పట్టు పెంచుకునేందుకు బీజేపీ ఎక్కువగా పొత్తులపైనే ఆధారపడుతోంది. జనసేనతో పొత్తు కొనసాగినా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి 24 సీట్ల దాకా ఖాయమన్న వస్తాయన్న సర్వే సంస్థల వెల్లడి నేపథ్యంలో బీజేపీ ఇక్కడ ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితే కనిపిస్తోంది. ఉత్తరాది నేతలకు బాధ్యతలు దక్షిణాది రాష్ట్రాల్లో పాగా దిశగా వ్యూహ రచనకు బీజేపీ ఇప్పటికే టాస్‌్కఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి, ఉపాధ్యక్షులు బైజయంత్ పాండా, దిలీప్ ఘోష్, లాల్‌సింగ్ ఆర్య ఇందులో ఉన్నారు. రాష్ట్రాలవారీగా పార్టీ పరిస్థితులను అంచనా వేసి, తదనుగుణంగా గెలుపు వ్యూహాలను అధిష్టానం సిద్ధం చేసింది. వాటి అమలు బాధ్యతను గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కీలక నేతలకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. యూపీ నేతలు కేశవ్ ప్రసాద్ మౌర్య, సునీల్ బన్సల్, స్వతంత్ర దేవ్ సింగ్, గుజరాత్‌కు చెందిన పర్ణేశ్ మోదీ, విజయ్ రూపానీ సేవలను కూడా వినియోగించుకోనుంది. – సాక్షి, న్యూఢిల్లీ -
చేరికలపై హస్తం ఫోకస్..!
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కువ సీట్లు దక్కించుకునే లక్ష్యంతో కాంగ్రెస్ పావులు కదుపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు వచ్చి, అధికారం చేపట్టిన నేపథ్యంలో.. పార్టీని మరింత బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టింది. లోక్‌సభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలో దింపాలని భావిస్తోంది. ఈ క్రమంలో గతంలో కాంగ్రెస్‌లో పనిచేసి వెళ్లిన నేతలను, బీజేపీలోని కీలక నేతలను చేర్చుకోవాలని యోచిస్తోంది. ఏఐసీసీ పర్యవేక్షణలో ఇప్పటికే పలువురు బీజేపీ ముఖ్య నాయకులతో కాంగ్రెస్ నేతలు చర్చలు కూడా జరిపినట్టు గాందీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల నేతలపై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. మొత్తమ్మీద 15 ఎంపీ స్థానాలు గెలుపొందడమే లక్ష్యంగా ముందుకెళ్లాలన్నది కాంగ్రెస్ ఆలోచనగా కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో ప్రయోజనం కోసం.. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 స్థానాలకు గాను పదింట బీజేపీతోనే పోటీ ఉంటుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ శివారు స్థానాలు, ఉత్తర తెలంగాణలోని లోక్‌సభ సీట్లలో కమలనాథుల నుంచి గట్టిపోటీ ఉంటుందని భావిస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీకి చెందిన లోక్‌సభ అభ్యర్థుల స్థాయి నేతలను చేర్చుకోవడం ద్వారా.. ఆదిలోనే బీజేపీకి చెక్ పెట్టవచ్చనే ఆలోచనతో కాంగ్రెస్ ఉన్నట్టు చర్చ జరుగుతోంది. ఇప్పటికే మంతనాలు షురూ.. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ బీజేపీ కీలక నేతను చేర్చుకునే విషయంలో టీపీసీసీ నేతలు ఇప్పటికే చర్చలు జరిపినట్టు తెలిసింది. ఆయనకు కరీంనగర్ లోక్‌సభ స్థానాన్ని ఆఫర్ చేయడంతోపాటు ప్రభుత్వంలో మంచి ప్రాధాన్యత కలి్పస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. ఆదిలాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన మాజీ ఎంపీలతోపాటు మెదక్ జిల్లాకు చెందిన ఓ కీలక నేతతోనూ టచ్‌లోకి వెళ్లినట్టు తెలిసింది. మరో ఐదేళ్లదాకా తెలంగాణలో బీజేపీ నిలదొక్కుకోవడం కష్టమని.. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అండగా నిలిస్తే, రాష్ట్రంలో బీఆర్ఎస్ను పక్కాగా నిలువరించవచ్చని సదరు నేతలకు స్పష్టం చేసినట్టు సమాచారం. ఇక హైదరాబాద్ శివారు నియోజకవర్గాలకు చెందిన ఇద్దరు బీసీ నేతలు గతంలో కాంగ్రెస్‌లో పనిచేసి ఉన్న నేపథ్యంలో.. వారిని కూడా పార్టీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరమైనట్టు తెలిసింది. మొత్తమ్మీద లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందే బీజేపీ కీలక నేతలను చేర్చుకోవడం ద్వారా.. పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగవచ్చని భావిస్తున్నట్టు సమాచారం. -
2024 లోక్ సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్
-
వైద్య రంగంపై సీఎం ప్రత్యేక దృష్టి
-
హైదరాబాద్ పబ్స్‌పై పోలీసుల ఫుల్ ఫోకస్
-
‘డీప్’గా పసిగట్టి..‘ఫేక్’ పనిపట్టండి
సాక్షి, హైదరాబాద్: డీప్‌ఫేక్‌పై కేంద్రం కొరడా ఝుళిపించింది. ఆన్లైన్లో ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫొటోలతో మోసాలకు పాల్పడటం, వ్యక్తిగత ప్రతిష్టను దిగజారుస్తుండటంతో ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో డీప్‌ఫేక్ కట్టడికి కఠిన నిబంధనలు విధిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. అయితే, డీప్‌ఫేక్‌తో మోసాలకు గురికాకుండా తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయకుండా ఉండేందుకు కొన్ని సూత్రాలు పాటించాలని కేంద్ర హోంశాఖ కీలక సూచనలు చేసింది. వీటిని పరిశీలించకుండా వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయొద్దని అధికారులు సూచిస్తున్నారు. వాటిల్లో కొన్ని సూచనలు కింది విధంగా ఉన్నాయి. ► ఫొటోలు, వీడియోలలో ఉన్న లైటింగ్, నీడలను నిశితంగా పరిశీలించాలి. అందులో ఏవైనా తేడాలు గమనిస్తే అది ఫేక్ అని ప్రాథమిక అంచనాకు రావొచ్చు. ► అసహజ ముఖకవళికలు ఉన్నట్టు గమనిస్తే దానిని డీప్‌ఫేక్‌తో తయారు చేసిన వీడియోగా భావించవచ్చు. ► ఆడియోలలో అసమానతలు, ఆడియో అస్పష్టంగా ఉన్నాయా అన్నది పరిశీలించాలి. ► ఫొటోలు, వీడియోల బ్యాక్‌గ్రౌండ్‌లో అసమానతలు, ఏవైనా వస్తువులు సాధారణానికి భిన్నంగా ఉన్నట్టు గమనించినా అది డీప్‌ఫేక్ అయి ఉండొచ్చు. ► ఫొటోల్లో, వీడియోల్లో వ్యక్తులు నిలబడిన, నడుస్తున్న ప్లాట్‌ఫారమ్‌లు అసాధారణంగా ఉన్నాయా? కదలికలు నిశితంగా పరిశీలిస్తే ఏవైనా అనుమానాలు ఉన్నాయా అన్నది పరిశీలించాలి. ► డీప్‌ఫేక్ డిటెక్షన్ టూల్స్ వాడి కూడా అవి నిజమైనవా..లేదా? గుర్తించవచ్చు. -
విద్యార్థులు చేరని కాలేజీలు ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు పెద్దగా చేరని డిగ్రీ కాలేజీలపై ఉన్నత విద్యా మండలి దృష్టి పెట్టింది. ఏ కోర్సులో ఎంత మంది చేరారనే వివరాలు పరిశీలిస్తోంది. 15 శాతం కన్నా తక్కువమంది విద్యార్థులుంటే వారు.. సమీపంలోని కాలేజీల్లో చేరాలని సూచించింది. అన్ని కోర్సుల్లోనూ 15 శాతం కూడా చేరని కాలేజీలు దాదాపు 10 వరకూ ఉన్నాయి. వీటిని కొనసాగించే అవకాశం లేదని తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల్లో విద్యార్థులు అరకొరగా చేరడంపై ఉన్నత విద్యామండలి అధికారులు ఆరా తీస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని కాలేజీలనే విద్యార్థులు ఎంచుకోవడానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. కొత్త కోర్సులను ప్రవేశపెడితే తప్ప ఆయా కాలేజీల మనుగడ కష్టమని అధికారులు భావిస్తున్నారు. 1.84 లక్షల సీట్లు ఖాళీ ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున డిగ్రీ సీట్లు మిగిలిపోయాయి. రాష్ట్రంలో 1064 కాలేజీలుంటే, వీటిల్లో 3,89,049 డిగ్రీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సంవత్సరం అన్ని కోర్సుల్లో చేరిన వారి సంఖ్య 2,04,674 మాత్రమే. ఇంకా 1,84,375 సీట్లు మిగిలిపోయాయి. వాస్తవానికి రాష్ట్రంలో 4.6 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో దాదాపు 80 సీట్లను ఫ్రీజ్ చేశారు. విద్యార్థులు చేరని కోర్సులు, కాలేజీలకు ఈసారి దోస్త్‌లో అనుమతించలేదు. దీంతో కొన్ని సీట్లు తగ్గాయి. అయినప్పటికీ భారీగా సీట్లు మిగిలిపోవడంపై మండలి ఆరా తీస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 1.25 లక్షలకుపైగా సీట్లు భర్తీ అయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల్లో కంప్యూటర్ అనుసంధాన కోర్సులు లేకపోవడం, సంప్రదాయ డిగ్రీ కోర్సులను విద్యార్థులు ఇష్టపడకపోవడంతో సీట్లు మిగిలిపోయాయి. ఆదరణలేని స్కిల్ కోర్సులు డిగ్రీ చేస్తూనే పలు రకాల నైపుణ్యం సంపాదించే స్కిల్ కోర్సుల వైపు విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపలేదు. రాష్ట్రం మొత్తం మీద కేవలం 1398 మంది మాత్రమే చేరారు. దీంతో 10 వేలకుపైగా సీట్లు మిగిలిపోయాయి. కార్పొరేట్ మార్కెటింగ్, వివిధ అంశాల్లో సాంకేతిక నైపుణ్యం, పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా కొన్ని కోర్సులను డిగ్రీలో ప్రవేశపెట్టారు. విద్యార్థులు పరిశ్రమల్లో ప్రాక్టికల్‌గా నేర్చుకోవడమే కాకుండా, కొంత స్టైఫండ్ లభించేందుకు ఇవి దోహదపడుతున్నాయి. అయితే, అనుబంధ పరిశ్రమలు, ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చే వ్యవస్థ లేదంటూ విద్యార్థులు వీటిని ఇష్టపడటం లేదని తెలుస్తోంది. విద్యార్థులు ఎక్కువగా బీకాం, లైఫ్‌సైన్స్ కోర్సుల వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆదరణ లేని కోర్సులు కాకుండా, విద్యార్థులు కోరుకునే కోర్సులే అందించే విధంగా కాలేజీలను అప్‌గ్రేడ్ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ దిశగా వచ్చే ఏడాది భారీ మార్పులు తెస్తామని, మార్కెట్ డిమాండ్ ఉండే కోర్సులను అందించే కాలేజీలకే అనుమతి ఇస్తామని అధికారులు అంటున్నారు. మార్పులు అనివార్యం.. రాష్ట్రంలో 50 శాతం కన్నా తక్కువగా విద్యార్థులు చేరిన కాలేజీలు వంద వరకూ ఉంటాయి. వీటిల్లో కొత్త కోర్సులు ప్రవేశపెడితేనే విద్యార్థులు చేరతారు. 15 శాతం కన్నా తక్కువ చేరిన కాలేజీల్లో బోధన కొనసాగించడం సాధ్యం కాదు. అందుకే ఈ కాలేజీల్లో విద్యార్థులను వేరే కాలేజీకి పంపుతున్నాం. గ్రామీణ ప్రాంతాల్లోని డిగ్రీ కాలేజీల్లో మార్పులు తేవాలి. కొత్త కోర్సులు ప్రవేశపెట్టేలా ప్రోత్సహించాలి. ఈ కసరత్తు మొదలైంది. వచ్చే ఏడాది భారీ మార్పులకు శ్రీకారం చుడతాం. - ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి (ఉన్నత విద్యా మండలి చైర్మన్) -
ఎగుమతులపై దృష్టి పెడుతున్న భారత్.. కేంద్ర వాణిజ్య శాఖ కసరత్తు
న్యూఢిల్లీ: నైజీరియా, ఇథియోపియా, ఘనా వంటి సహారా ప్రాంత ఆఫ్రికా దేశాలు, ఇతరత్రా గల్ఫ్ దేశాలకు ఎగుమతులను పెంచుకోవడంపై భారత్ మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా టారిఫ్యేతర అవరోధాలను తొలగించడంపై కేంద్ర వాణిజ్య శాఖ కసరత్తు చేస్తోంది. దీనికోసం గణనీయ స్థాయిలో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలున్న సహారా ప్రాంత దేశాలు, గల్ఫ్ దేశాల్లోని భారతీయ మిషన్లతో వర్చువల్ సమావేశాలు నిర్వహింనట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఆయా దేశాలతో ఆర్థిక, వ్యాపార సంబంధాలు, ఎగుమతుల స్థితిగతులు, టారిఫ్యేతర అడ్డంకులు మొదలైన వాటి గురిం చర్చింనట్లు వివరించారు. సహారా ప్రాంత దేశాలకు సంబంధిం దక్షిణాఫ్రికా .. భారత్‌కు అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2022–23లో దక్షిణాఫ్రికాతో మొత్తం 18.9 బిలియన్ డాలర్ల వాణిజ్యం నమోదైంది. ఇందులో 8.5 బిలియన్ డాలర్ల ఎగుమతులు ఉన్నాయి. ఆ తర్వాత స్థానాల్లో నైజీరియా (11.85 బిలియన్ డాలర్ల వాణిజ్యం, 5.15 బిలియన్ డాలర్ల ఎగుమతులు), టోగో (6.6 బిలియన్ డాలర్ల వాణిజ్యం, 6 బిలియన్ డాలర్ల ఎగుమతులు), టాంజానియా (6.5 బిలియన్ డాలర్ల వాణిజ్యం, 3.93 బిలియన్ డాలర్ల ఎగుమతులు) ఉన్నాయి. మిగతా ఆఫ్రికన్ దేశాల్లో మొజాంబిక్, అంగోలా, కెన్యా ఉన్నాయి. గల్ఫ్‌లో సౌదీ అరేబియా (52.76 బిలియన్ డాలర్లు), ఖతర్ (18.77 బిలియన్ డాలర్లు) తదితర దేశాలతో అత్యధికంగా వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. ఎగుమతులకు ఊతమిచ్చే క్రమంలో ప్రధానంగా ఆహారం, ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్ వంటి రంగాలు, ప్రధాన మార్కెట్లపై దృష్టి పెట్టాలంటూ ఎగుమతిదార్లకు వాణిజ్య శాఖ సూంంది. అలాగే, అంతర్జాతీయంగా మరిన్ని ఎగ్జిబిషన్స్ వంటివి నిర్వహించవచ్చని పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో (ఏప్రిల్–అక్టోబర్) ఎగుమతులు 7 శాతం తగ్గి సుమారు 245 బిలియన్ డాలర్లకు, దిగుమతులు దాదాపు 9 శాతం క్షీణించి 392 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.