ముంబై: విశ్వక్రీడల ఆతిథ్యంపై భారత్ దృష్టి పెట్టినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. 2036లో ఒలింపిక్స్ నిర్వహించేందుకు భారత ప్రభుత్వం ఆసక్తిగా ఉందన్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సెషన్స్ ప్రారం¿ోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మోదీ మాట్లాడుతూ ‘ఒలింపిక్స్ నిర్వహణ కోసం భారతీయులంతా ఎదురుచూస్తున్నారు. 2036లో ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చే ప్రణాళికల్లో ఉన్నాం. ఇది 140 కోట్ల భారతీయుల కల. దీన్ని ఐఓసీ సహకారంతో సాకారం చేస్తాం.
దీనికంటే ముందు 2029లో యూత్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చేందుకు మేం రెడీగా ఉన్నాం’ అని మోదీ అన్నారు. క్రీడాస్ఫూర్తి అనేది విశ్వవ్యాప్తమని, ఇందులో పరాజితులెవరూ ఉండరని... కేవలం విజేతలు, నేర్చుకునేవారే ఉంటారని మోదీ చెప్పారు. 141వ ఐఓసీ సెషన్స్ శనివారం నుంచి మూడు రోజుల పాటు జరుగుతాయి. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో కొత్త క్రీడాంశాలకు చోటు కలి్పంచడం, ఓటింగ్, ఆమోదం తదితర నిర్ణయాలను ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు తీసుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment