
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పూర్తికాలం తెలంగాణపై దృష్టిని కేంద్రీకరిస్తారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ చెప్పారు. జనవరిలో అమిత్‌షా, ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటిస్తారని వెల్లడించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మోదీ మార్గనిర్దేశకత్వంలో, అమిత్ షా వ్యూహరచనతో తెలంగాణలో పార్టీ బలోపేతమవుతుందన్నారు. గుజరాత్, హిమాచల్‌లో బీజేపీ గెలుస్తుందని, ఆ ప్రభావం తెలంగాణపై ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి ఈ నెల 19 నుంచి మూడు రోజులపాటు సమావేశాలను నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment