
సాక్షి, హైదరాబాద్: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీయే అధికార పీఠం దక్కించుకుంటుందని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ స్పందించారు. ఆయనిక్కడ శుక్రవారం మాట్లాడుతూ గుజరాత్‌లోనూ బీజేపీ తిరిగి అధికారం నిలబెట్టుకుంటుందన్నారు.
అంతే కాకుండా ఆ గెలుపు ప్రభావం తెలంగాణపై ఉంటుందని తెలిపారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తర్వాతి టార్గెట్ తెలంగాణే అని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతామని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా నేతృత్వంలో రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురువేస్తామని లక్ష్మణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా తెలంగాణలో విస్త్రత పర్యటనలు చేసి పార్టీ బలపేతం చేయాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో జనవరిలో మూడు రోజుల పాటు అమిత్ షా రాష్ట్ర పర్యటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment