సాక్షి హైదరాబాద్: నెల 17న హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారని పార్టీవర్గాల సమాచారం.. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. రెం దేళ్ల క్రితం సెప్టెంబర్ 17న పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన అధికారిక కార్యక్రమంలో అమిత్ షా పోలీసుదళాల వందన స్వీకరణతో పాటు జాతీయపతాకాన్ని ఎగురవేసిన విషయం తెలిసిందే.
ఈ కార్యక్రమంలో, అమితీతో పాటు మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. గతేడాది కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో గోల్కొండ ఖిల్లాలో హైదరాబాద్ విమోచన వేడుకలను నిర్వహించారు. ఈ ఏడాది మళ్లీ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే కార్య క్రమానికి అమిత్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు, జనసమీకరణపై చర్చించేందుకు మంగళవారం బీజేపీ కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుంది.
ఈ సందర్భంగా.. గత మూడు రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా వివిధ జిల్లాల్లో తలెత్తిన పరిస్థితులపై చర్చించి క్షేత్రస్థాయి పర్యటనలపై నిర్ణయం తీసుకోను న్నట్లు పార్టీనేతలు చెబుతున్నారు. పార్టీపరంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో నేతల పర్యటనలు, విరిధ జిల్లాల్లో బాధిత ప్రజలకు అందించాల్సిన సహాయం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment