`ఫోకస్` టీజర్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉంది : శ్రీకాంత్‌ | Hero Srikanth Launches Trailer Of Focus Movie | Sakshi
Sakshi News home page

`ఫోకస్` టీజర్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉంది : శ్రీకాంత్‌

Published Tue, Oct 25 2022 7:24 PM | Last Updated on Tue, Oct 25 2022 7:24 PM

Hero Srikanth Launches Trailer Of Focus Movie - Sakshi

యంగ్ హీరో విజ‌య్ శంక‌ర్, `బిగ్‌బాస్` ఫేమ్‌ అషూరెడ్డి హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్నచిత్రం `ఫోక‌స్`. సుహాసిని మ‌ణిర‌త్నం, భానుచంద‌ర్ కీల‌క పాత్ర‌ల‌లో న‌టిస్తున్నఈ చిత్రానికి జి. సూర్య‌తేజ ద‌ర్శ‌కుడు, వీర‌భ‌ద్ర‌రావు ప‌రిస‌ నిర్మాత‌. మర్డర్‌ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో ఆద్యంతం ఉత్కంఠ‌మైన క‌థ క‌థ‌నాల‌తో న్యూ ఏజ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రంలో అషురెడ్డి మొద‌టిసారిగా పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నుంది. అక్టోబ‌రు 28న ఈ మూవీ థియేట‌ర్స్‌లో గ్రాండ్‌గా విడుద‌ల‌కానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. 

ఈ సంద‌ర్భంగా శ్రీకాంత్‌ మాట్లాడుతూ..  ‘ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ద‌ర్శ‌కుడు సూర్య‌తేజ మంచి సబ్జెక్ట్‌ను ఎంచుకున్నారు. హీరో విజ‌య్ శంక‌ర్ చాలా బాగా నటించాడు. మంచి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’అన్నారు. 

‘నా కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ మూవీ ‘ఫోకస్’. క్రైమ​ థ్రిల్లర్‌ జోనర్‌ని ఇష్టపడే ప్రేక్షకులకు మా చిత్రం ఫుల్‌మీల్స్‌లా ఉంటుంది’అని హీరో విజయ్‌ శంకర్‌ అన్నాడు. ఫోక‌స్ అనేది ఒక కొత్త త‌ర‌హా క్రైమ్ థిల్ల‌ర్. తెలుగు ఆడియ‌న్స్ ఈ జోన‌ర్‌ను ఎక్కువ‌గా ఎంక‌రేజ్ చేస్తారు. కొత్త‌గా ఉంటే త‌ప్ప‌కుండా ఓన్ చేసుకుంటారు. ఊహించ‌ని మ‌లుపుల‌తో స‌రికొత్త క‌థ‌,క‌థ‌నాల‌తో ఈ సినిమా రూపొందింది’అని దర్శకుడు సూర్యతేజ్‌ అన్నారు. స్కైరా క్రియేషన్స్‌ సమర్పణలో రిలాక్స్‌ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సుహాసిని,  షియాజీ షిండే, భరత్‌ రెడ్డి, రఘు బాబు, సూర్య భగవాన్‌ తదితరులు ఇతర కీలకపాత్రల్లో నటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement