‘డీప్‌’గా పసిగట్టి..‘ఫేక్‌’ పనిపట్టండి | Central Home Ministry focus on Deepfake | Sakshi
Sakshi News home page

‘డీప్‌’గా పసిగట్టి..‘ఫేక్‌’ పనిపట్టండి

Published Sat, Dec 16 2023 5:03 AM | Last Updated on Sat, Dec 16 2023 1:54 PM

Central Home Ministry focus on Deepfake - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డీప్‌ఫేక్‌పై కేంద్రం కొరడా ఝుళిపించింది. ఆన్‌లైన్‌లో ఫేక్‌ వీడియోలు, మార్ఫింగ్‌ ఫొటోలతో మోసాలకు పాల్పడటం, వ్యక్తిగత ప్రతిష్టను దిగజారుస్తుండటంతో ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో డీప్‌ఫేక్‌ కట్టడికి కఠిన నిబంధనలు విధిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది.

అయితే, డీప్‌ఫేక్‌తో మోసాలకు గురికాకుండా తప్పుడు సమాచారాన్ని సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ చేయకుండా ఉండేందుకు కొన్ని సూత్రాలు పాటించాలని కేంద్ర హోంశాఖ కీలక సూచనలు చేసింది. వీటిని పరిశీలించకుండా వీడియోలు, ఫొటోలను సోషల్‌ మీడియాలో ఫార్వర్డ్‌ చేయొద్దని అధికారులు సూచిస్తున్నారు. వాటిల్లో కొన్ని సూచనలు కింది విధంగా ఉన్నాయి. 

 ► ఫొటోలు, వీడియోలలో ఉన్న లైటింగ్, నీడలను నిశితంగా పరిశీలించాలి. అందులో ఏవైనా తేడాలు గమనిస్తే అది ఫేక్‌ అని ప్రాథమిక అంచనాకు రావొచ్చు.  

 ► అసహజ ముఖకవళికలు ఉన్నట్టు గమనిస్తే దానిని డీప్‌ఫేక్‌తో తయారు చేసిన వీడియోగా భావించవచ్చు.  

 ► ఆడియోలలో అసమానతలు, ఆడియో అస్పష్టంగా ఉన్నాయా అన్నది పరిశీలించాలి.  

 ► ఫొటోలు, వీడియోల బ్యాక్‌గ్రౌండ్‌లో అసమానతలు, ఏవైనా వస్తువులు సాధారణానికి భిన్నంగా ఉన్నట్టు గమనించినా అది డీప్‌ఫేక్‌ అయి ఉండొచ్చు.  

 ► ఫొటోల్లో, వీడియోల్లో వ్యక్తులు నిలబడిన, నడుస్తున్న ప్లాట్‌ఫారమ్‌లు అసాధారణంగా ఉన్నాయా? కదలికలు నిశితంగా పరిశీలిస్తే ఏవైనా అనుమానాలు ఉన్నాయా అన్నది పరిశీలించాలి.  

 ► డీప్‌ఫేక్‌ డిటెక్షన్‌ టూల్స్‌ వాడి కూడా అవి నిజమైనవా..లేదా? గుర్తించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement