గిరిజన సంక్షేమంపై దృష్టి పెట్టాలి
Published Mon, Sep 9 2013 3:10 AM | Last Updated on Fri, Sep 1 2017 10:33 PM
కొత్తగూడెం(ఖమ్మం), న్యూస్‌లైన్ : సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తితోపాటు గిరిజన సంక్షేమంపై దృష్టి సారిం చాలని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారికత శాఖ సహాయ మంత్రి పోరిక బలరామ్‌నాయక్ అన్నారు. కొత్తగూడెం లో సింగరేణి ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ సెంట్రల్ కార్యాలయాన్ని ఆదివా రం ఆయన ప్రారంభించిన అనంతరం సభలో మాట్లాడారు. కొత్తగూడెంలో సింగరేణి మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం ఇప్పటికే కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జశ్వాల్‌కు వినతిపత్రం అందించామని, సీబీఐ కేసుల కారణంగా కాస్త జాప్యమైందన్నారు. 300 పడకలతో ఉన్న సింగరేణి ప్రధాన ఆస్పత్రి మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అనుకూలంగా మా రిందన్నారు.
గని కార్మికులు రిటైర్మెంట్ అయిన తర్వాత వారికి కనీసం రూ.25 లక్షలు అందేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. కంపెనీ లోని నాల్గవ తరగతి ఉద్యోగాలను గిరిజ నులకు అందేలా చర్యలు తీసుకోవాలని, ఇది ఖమ్మం జిల్లా నుంచే ప్రారంభించాలని చెప్పారు. ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులను త్వరితగతిన భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని, గిరిజన ప్రాంతమైనందున విద్యపై ఎక్కువగా దృష్టి పెట్టాలన్నారు. ఇల్లెందులో కొత్త మైనింగ్ గనులను త్వరలో ప్రారంభిస్తున్నామని వివరించారు.
మణుగూరు ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలోనే సింగరేణి సంస్థ ఎక్కువగా ఉన్నందున అభివృద్ధి పనులు సక్రమం గా నిర్వహించేలా యాజమాన్యం చర్య లు చేపట్టాలని కోరారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని ఎస్టీ ఉద్యోగుల సంఘం నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో సింగరేణి సంస్థ డెరైక్టర్లు బి.రమేష్‌కుమార్, ఎ.మనోహర్‌రావు, విశ్వనాథరాజు, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ బి.నాగ్యా, సీఎంఓఐఏ అధ్యక్షుడు మాదాసి మల్లేష్, ఎస్టీ లైజన్ ఆఫీసర్ పి.బాలరాజు, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రమేష్, మాధవ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement