ఢిల్లీ : కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివాసీ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖను అగ్రవర్ణాల నేతలే నిర్వహించాలి. ఒక బ్రాహ్మణుడు లేదా ఇతర అగ్రవర్ణాల నాయకులు బాధ్యతలు స్వీకరిస్తే గణనీయమైన మార్పు ఉంటుందని వ్యాఖ్యానించారు. దీంతో సురేష్ గోపి చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి.
గిరిజన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మాత్రమే గిరిజన వ్యవహారాల మంత్రిని చేయడం మన దేశానికి శాపమని అర్ధం వచ్చేలా వ్యాఖ్యానించారంటూ పలు జాతీయ మీడియాలో కథనాలు వెలుగులోకి వచ్చాయి. వారి సంక్షేమం కోసం గిరిజన వర్గానికి చెందిన వ్యక్తి కాకుండా అగ్రవర్ణాలకు చెందిన నేతలకు కేటాయించాలనే నా కల, నిరీక్షణ. అదేవిధంగా, గిరిజన నాయకుల సంక్షేమం కోసం పోర్ట్‌ఫోలియో ఇవ్వాలనే అభిప్రాయం వ్యక్తం చేశారని కథనాలు హైలెట్ చేశాయి.
ఢిల్లీలో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో సురేష్ గోపి మాట్లాడుతూ అగ్రవర్ణాల నాయకులకు పోర్ట్‌ఫోలియో బాధ్యతలు అప్పగిస్తేనే గిరిజన సంక్షేమంలో నిజమైన పురోగతి సాధ్యమవుతుంది. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖను నాకు అప్పగిస్తే బాధ్యతలు చేపట్టేందుకు నేను సిద్ధం. ఇప్పటికే తనకు ఆ మంత్రివర్గం కేటాయించాలని ప్రధాని మోదీని అభ్యర్థించానని, అయితే పోర్ట్‌ఫోలియో కేటాయింపుల్లో సాధ్యం కాలేదన్నారు.
సురేష్ గోపి చేసిన వ్యాఖ్యలపై కేరళలో తీవ్ర దుమారం రేపాయి. సీపీఐ రాష్ట్రకార్యదర్శి బినోయ్ విశ్వం.. సురేష్ గోపి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అతన్ని మంత్రి వర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. బినోయ్ విశ్వంతో పాటు ఇతర గిరిజన వర్గానికి చెందిన నేతలు సురేష్ గోపి వ్యాఖ్యల‍్ని తప్పుబడుతున్నారు.
కాగా, ప్రస్తుతం, ఒడిశాకు చెందిన గిరిజన సామాజిక వర్గానికి చెందిన, ప్రముఖ బీజేపీ నేత జుయల్ ఓరం కేంద్ర మంత్రివర్గంలో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు నాయకత్వం వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment