
సాక్షి,ఢిల్లీ : కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కారు ప్రమాదానికి గురైంది. పార్లమెంట్ నుంచి తన కార్యాలయానికి వెళ్లే సమయంలో శ్రీనివాస వర్మ కారును ఓ ప్రైవేట్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తలకు, కాలికి గాయాలయ్యాయి. కారులో ఉన్న సిబ్బందికి సైతం గాయాలయ్యాయి.
రోడ్డు ప్రమాదంతో అప్రమత్తమైన సిబ్బంది రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసిన వైద్యులు రెస్ట్ తీసుకోవాలని సూచించారు. అయినప్పటికీ వైజాగ్‌కు పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున కాలుకు, తలకు కట్టుతోనే శ్రీనివాసవర్మ. వైజాగ్‌కు బయలు దేరారు. వైజాగ్‌కు పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున కాలుకు, తలకు కట్టు తోనే విజయవాడ బయల్దేరిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ.