ఏకాగ్రత లేకుండా చదవడం లేదా ఏ పనినైనా చేయడం అంటే చిల్లికుండలో నీళ్లు నింపడం లాంటిదే.ఏకాగ్రత లేకుండా చేసే పనివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. అయితే కొందరిలో ఎంత ప్రయత్నించినా ఏకాగ్రత ఉండదు. అలా ఏకాగ్రత లేకపోవడానికి మానసిక, శారీరక సమస్యలు కారణం కావచ్చు. ఇంకొంతమందికి ఎక్కువ సమయం ఒకే విషయం మీద ఫోకస్ చేసినా ఏకాగ్రత లోపిస్తుంది. నిద్రలేమి, ఇన్ఫెక్షన్లు, డిప్రెషన్ మొదలైన ఆరోగ్య సమస్యలు కూడా కారణాలు కావచ్చు.
ఏకాగ్రత పెరగాలంటే..
ఏకాగ్రత ఉంటేనే ఏ పనినైనా సాధించగలం.అందుకే ఏకాగ్రత పెంచుకోవడం అందరికీ అవసరం. ముఖ్యంగా విద్యార్థులకు చాలా అవసరం. అందుకోసం
ఏం చేయాలో చూద్దాం.
ముందు మనం విద్యార్థుల కోసం చెప్పుకుందాం..
⇒ చదువుకునేందుకు మంచి వాతావరణాన్ని సృష్టించుకోవాలి. టీవీ, ఫోన్ , కంప్యూటర్, మ్యూజిక్ ప్లేయర్‌కి దూరంగా ఉండాలి.
⇒ ఏకాగ్రత ఉంటేనే ఏ పనినైనా సాధించగలం.
⇒ ఏ పనికి ఎంత సమయం కేటాయించాలో పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. మల్టీ టాస్కింగ్ ఎప్పుడూ చేయకూడదు.
⇒ స్టడీసెషల్స్‌కు నలభైనుంచి యాభై నిమిషాలకంటే ఎక్కువ సమయం కేటాయించొద్దు. అలసిపోకుండా ఉండేందుకు మధ్యమధ్యలో విరామం అవసరం.
⇒ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. బాధలను, ఆందోళనలను మర్చిపోవాలి.
⇒ చదువుతున్నప్పుడు ముఖ్యమైన పాయింట్స్‌ను, టాపిక్స్‌ను నోట్ చేసుకోవాలి. అవసరమైనప్పుడు వాటిని రిఫర్ చేసుకోవాలి.
యోగా, ధ్యానం మొదలైన టెక్నిక్స్ ఉపయోగపడతాయి.
ఎస్‌క్యూ3ఆర్ పద్ధతి
ఎస్ (సర్వే): చదివిన దాంట్లో ముఖ్యమైనవి ఒక సర్వే పుస్తకంలో రాసుకోవాలి. టైటిల్స్, సబ్–టైటిల్స్, క్యాప్షన్స్ లాంటివి రిఫరెన్స్‌కి బాగా తోడ్పడతాయి.
క్యూ (క్వశ్చన్): పుస్తకంలో నోట్ చేసుకోవడం, చదవడం పూర్తయ్యాక క్వశ్చన్స్ వేసుకోవడం అలవాటు చేసుకోవాలి.
ఆర్ 1 (రీడ్): చాప్టర్ పూర్తవగానే క్వశ్చన్ , దానికి సరైన జవాబును తెలుసుకొని చదువుకోవాలి. అలా చదివితే మర్చిపోవడం అంటూ జరగదు.
ఆర్ 2 (రిసైట్): చదివిన వాటిని తిరిగి ప్రశ్నించుకుంటూ వాటి జవాబులను గుర్తు చేసుకోవాలి. సొంతంగా జవాబులను తయారు చేసుకోవాలి. అవసరమైతే ముందు రాసుకున్న నోట్స్ తీసి చూడాలి.
ఆర్ 3 (రివ్యూ): చదివిన తర్వాత అవన్నీ మెదడులో తాజాగా ఉండాలంటే మళ్లీమళ్లీ చదవాలి.
మామూలుగా అందరూ కంటితో చూస్తూ చదువుతారు. ఒకటి కంటే ఎక్కువ ఇంద్రియాల ప్రమేయం చదివే ప్రక్రియలో మనం భాగం చేయగలిగితే ఏకాగ్రత మెరుగవుతుంది.
1) పైకి చదవడం– చదువుతున్నది చెప్పడమే కాకుండా వింటాం కూడా.
2) చదివేది పుస్తకంలో క్లుప్తంగా రాయడం.
3) ఇప్పుడు చాలా రకాలైన పుస్తకాలు, పిడిఎఫ్‌లు చదివి వినిపించే ఆప్స్ ఉన్నాయి. కుదిరితే ఇలా వింటూ, చూస్తూ, ఒక నోటు పుస్తకంలో ముఖ్యమైన వాటిని రాసుకుంటూ చదివితే ఏకాగ్రత కోల్పోవడం తగ్గుతుంది.
మన ఏకాగ్రతకు భంగం కలిగించే వస్తువులు (సెల్ ఫోను), వ్యక్తులను చదువుతున్నప్పుడు దూరం పెట్టాలి.
వీలయినంత వరకు చదవడానికి ఒక ప్రదేశం (లైబ్రరీ, ఇంటి లో ఒక గది) నిర్ణయించుకుని అక్కడే ప్రతిరోజు చదివితే, మన బుర్రలో అది స్థిరపడి, ఆ ప్రదేశానికి వెళ్లిన వెంటనే వేరే ఆలోచనలు తక్కువవుతాయి. కొంతమంది ఎక్కువసేపు ఒకచోట కూర్చోలేరు. అలాంటివారు 3–4 చోట్ల మధ్య మారుతూ మెల్లగా అలవాటు చేసుకోవచ్చు.
చదివే వ్యాసాలను ఫ్లో– చార్ట్స్, డయాగ్రమ్స్‌గా నోటు పుస్తకాలలో రాసుకుంటే బాగా గుర్తుంటాయి.
ఇవన్నీ చాలా చిన్న విషయాలుగా అనిపించినా తేలిగ్గా తీసుకోకుండా వాటిని పాటించడం వలన ఏకాగ్రత మెరుగుపరచుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment