రాజమండ్రి : రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై నిఘా ఉంచామని, ఆయా ప్రాంతాల్లో ఎన్ని దళాలు ఉన్నాయో సమాచారం సేకరిస్తున్నామని కోస్తా జిల్లాల ఐజీ (లా అండ్ ఆర్డర్) అతుల్‌సింగ్ చెప్పారు. గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లపై ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల ఎస్పీలతో రాజమండ్రి పోలీసు అర్బన్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో బుధవారం అతుల్ సింగ్ సమీక్ష జరిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లా ప్రస్తుతం చాలా ప్రశాంతంగా ఉందన్నారు. ఖమ్మం నుంచి ఆ జిల్లాలో కొత్తగా కలిసిన చింతూరు మండల పరిధిలో కొంత మావోయిస్టుల ప్రభావం ఉందన్నారు. అక్కడ సీఆర్‌పీఎఫ్, ఇతర బలగాల నిఘా ఉందని, నిత్యం గాలింపు జరుగుతోందని చెప్పారు.
మావోయిస్టు దళాలపై ఆరా తీస్తున్నాం: ఐజీ అతుల్‌సింగ్
Published Wed, Feb 11 2015 9:44 PM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM
Advertisement