Atul Singh
-
19న కానిస్టేబుల్ పోస్టులకు తుది పరీక్ష
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పోలీస్ కానిస్టేబుల్ మెకానికల్ 25, డ్రైవర్ 134 పోస్టులకు మార్చి 19వ తేదీన తుది రాతపరీక్ష నిర్వహించనున్నట్టు ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ అతుల్‌సింగ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఈ పోస్టులకు నిర్వహించిన డ్రైవింగ్, ట్రేడ్ పరీక్షల్లో 6,922 మంది అర్హత సాధించారని వెల్లడించారు. వీరికి కాకినాడలో మార్చి 19న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు. కాగా మార్చి 9వ తేదీ నుంచి అభ్యర్థుల హాల్‌టికెట్లు జారీ చేస్తామని తెలిపారు. -
కానిస్టేబుల్ పరీక్షలో 63,718 మంది అర్హత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 4,548 కానిస్టేబుల్ పోస్టులకు నిర్వహించిన తుది రాతపరీక్షల్లో 63,718 మంది అర్హత సాధించినట్లు ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ అతుల్‌సింగ్ సోమవారం ప్రకటించారు. దీనిప్రకారం ఒక్కో కానిస్టేబుల్ పోస్టుకు సగటున 14 మంది అర్హత సాధించినట్టు అయ్యింది. వారిలో మెరిట్ ఆధారంగా పోస్టులు భర్తీ చేపడతారు. ఈ నెల 7 నుంచి అభ్యర్థులు "recruitment. appolice. gov. in' వెబ్సైట్లో ఓఎంఆర్ షీట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 8 నుంచి 10వ తేదీలోపు వెబ్సైట్లో నిర్దేశించిన ఫార్మాట్లో అభ్యంతరాలను పంపించాల్సి ఉంటుంది. ఈ నెల 13న అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షల ఫలితాలు, విద్యార్హతలు, ఇతర సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. ఓఎంఆర్ షీట్స్, అభ్యంతరాల పరిశీలన అనంతరం తుది ఫలితాలు ప్రకటించి మెరిట్ ఆధారంగా కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపడతారు. అభ్యర్థులు అవసరమైన సమాచారం కోసం 94414 50639, 0884–2340535, 0884–2356255 హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు. లేదా ‘apslprb. pc@ gmail. com’కు మెయిల్ చేయవచ్చు. -
కానిస్టేబుల్ తుది పరీక్షలకు 72,045 మంది
సాక్షి, అమరావతి: కానిస్టేబుల్ పోస్టులకు ఆదివారం నిర్వహించిన తుది రాత పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 72,324 మందికి హాల్‌టికెట్లు జారీ చేయగా 72,045 మంది హాజరయ్యారు. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, తిరుపతి, కర్నూలుల్లోని కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. 99.61 శాతం మంది పరీక్షకు హాజరైనట్టు ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ అతుల్ సింగ్ ప్రకటనలో తెలిపారు. ఏ,బీ,సీ,డీ ప్రశ్నాపత్రాలకు సంబంధించిన కీ విడుదల చేశారు. కీ విషయంలో ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా ఈ నెల 25వ తేదీ సాయంత్రం లోపు మెయిల్ చేయాలని సూచించారు. 3,216 సివిల్ కానిస్టేబుల్స్, 1,067 ఏఆర్ కానిస్టేబుల్స్, వార్డెన్లు 240(పురుషులు), 25(మహిళలు) పోస్టులకు సంబంధించిన తుది ఫలి తాలను పదిహేను రోజుల్లో ప్రకటించ నున్నట్టు తెలిపారు. -
11 మంది ఐపీఎస్‌ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు విభాగంలో పని చేస్తున్న 11 మంది ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అదనపు డీజీ స్థాయి అధికారులు 12 మంది ఉండగా... ఆ హోదాతో ఉండే పోస్టుల సంఖ్య 26గా ఉంది. దీం తో ఎనిమిది పోస్టుల హోదాల్ని కుదించి ఎక్స్ కేడర్‌లో ఐజీ, అదనపు డీజీస్థాయి అధికారుల్ని నియమించింది. అతుల్ సింగ్ బదిలీలో ఖాళీ అయిన కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్, నార్త్ కోస్టల్ ఐజీ పోస్టుల్లో ఎవరినీ నియమించలేదు. -
మావోయిస్టు దళాలపై ఆరా తీస్తున్నాం: ఐజీ అతుల్‌సింగ్
రాజమండ్రి : రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై నిఘా ఉంచామని, ఆయా ప్రాంతాల్లో ఎన్ని దళాలు ఉన్నాయో సమాచారం సేకరిస్తున్నామని కోస్తా జిల్లాల ఐజీ (లా అండ్ ఆర్డర్) అతుల్‌సింగ్ చెప్పారు. గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లపై ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల ఎస్పీలతో రాజమండ్రి పోలీసు అర్బన్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో బుధవారం అతుల్ సింగ్ సమీక్ష జరిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లా ప్రస్తుతం చాలా ప్రశాంతంగా ఉందన్నారు. ఖమ్మం నుంచి ఆ జిల్లాలో కొత్తగా కలిసిన చింతూరు మండల పరిధిలో కొంత మావోయిస్టుల ప్రభావం ఉందన్నారు. అక్కడ సీఆర్పీఎఫ్, ఇతర బలగాల నిఘా ఉందని, నిత్యం గాలింపు జరుగుతోందని చెప్పారు. -
కాసులిస్తే నో కేస్!
పోలీస్ స్టేషన్‌కొస్తే మామూళ్లు ఇవ్వాల్సిందే ఏ కేసైనా సెటిల్ చేసేస్తారు చెలరేగిపోతున్న కొందరు ఎస్ఐలు, సీఐలు ప్రక్షాళనకు నడుంకట్టిన ఇన్చార్జి సీపీ నలుగురిపై వేటుతో శ్రీకారం కేసులొస్తే కాసులు రాలాల్సిందే. స్టేషన్‌కు వస్తే మామూళ్లు ఇవ్వాల్సిందే. ఎంత పెద్ద కేసైనా స్టేషన్లోనే సెటిల్ చేసేస్తారు. సివిల్ తగాదాల్లో తలదూర్చొద్దని ఉన్నతాధికారులు ఆదేశించినా ఖాతరు చేయరు. ఆక్రమణదారులు, రౌడీ షీటర్లకు కొమ్ముకాస్తున్నారు.. ఇదీ నగర పరిధిలోని స్టేషన్లలో కొందరు ఎస్ఐలు, సీఐల తీరు. పోలీసుశాఖకు అప్రతిష్ట తెస్తున్న ఇటువంటి వారిపై చర్యలకు ఇన్చార్జి సీపీ అతుల్ సింగ్ ఉపక్రమించారు. ఇప్పటికే నలుగురిపై వేటు వేశారు. సాక్షి, విశాఖపట్నం : కొద్ది నెలల క్రితం ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి, మరో వ్యక్తికి మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. దీంతో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. కొంత కాలానికి ఇద్దరూ రాజీ పడ్డారు. తామిచ్చి న ఫిర్యాదులు వెనక్కి తీసుకుంటామని, కేసులు కొట్టేయమని స్టేషన్ చుట్టూ తిరి గారు. కానీ అక్కడి అధికారి దానికి అంగీకరించలేదు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారి నగర డీసీపీని కలిసి జరిగిందంతా చెప్పారు. ఫిర్యాదుదారులే కేసు వద్దంటుంటే కొట్టివేయడానికి ఆ స్టేషన్ అధికారికి ఉన్న ఇబ్బందిపై డీసీపీ ఆరా తీశారు. వెంటనే లోక్ అదాలత్ ద్వారా కేసు క్లోజ్ చేయమని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోమని ఆ అధికారిని ఫోన్లో మందలించారు. ఇదే కాదు..ఇటువంటి సంఘటనలు కోకొల్లలు. నాల్గో పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఇలాంటి వ్యవహారంలోనే ఏసీబీకి చిక్కారు. నగర శివార్లలోని పోలీస్ స్టేషన్లయితే కొందరు భూ కబ్జాదారులు, రౌడీ షీటర్ల కనుసన్నల్లోనే నడుస్తున్నాయని బాధితులు చెబుతున్నారు. ఖాళీ స్థలాలు ఆక్రమించి, నకిలీ ధ్రువపత్రాలతో స్థల యజమానులను బెదించే వారికి కొమ్ముకాస్తూ బాధితుల నుంచి సొమ్ములు గుంజుతున్న ఉదంతాలు అక్కడ నిత్యకృత్యమైపోయాయి. కలిసొస్తున్న స్టేషన్ బెయిల్: సెక్షన్ సీఆర్పీసీ 41ఎ ప్రకారం నిందితుల్ని అరెస్ట్ చేయడానికి 48 గంటల ముందు వారికి నోటీసు ఇవ్వాలి. అదే విధంగా 7ఏళ్ల లోపు శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్ల ప్రకారం కేసు నమోదైతే నిందితులకు స్టేషన్లోనే బెయిల్ ఇవ్వవచ్చని సుప్రీం కోర్టు చెప్పింది. ప్రజల ప్రాథమిక హక్కును, వారి శ్రేయస్సును కాపాడేందుకు అత్యున్నత న్యాయస్థానం చేసిన సూచనలను తమకు అనుకూలంగా మలుచుకుని పోలీసులు అవినీతికి పాల్పడుతున్నారు. కేసు పెడతామని నిందితుడ్ని బెదిరిస్తూ, సెటిల్ చేసుకోకపోతే బెయిల్‌పై వెళ్లిపోతారని బాధితుల్ని భయపెడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. నలుగురిపై వేటుతో శ్రీకారం: అవినీతి ఆరోపణలున్న అధికారులపై వేటు వేయాలని ఇన్చార్జి సీపీ అతుల్‌సింగ్ నిర్ణయించుకున్నారు. ఆ దిశగా తొలి అడుగు వేశారు. గత నెల 30వ తేదీన రూ.20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్ఐ రమేష్‌బాబును, ఈ నెల 25న లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మూడో పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రామారావు, కానిస్టేబుల్ లక్ష్మణరావులతో పాటు ఈ నేరంలో భాగస్వామ్యం, విధుల్లో నిర్లక్ష్యం వహించారనే కారణాలతో సీఐ జి.వి.రమణలను ఇన్చార్జి సీపీ సస్పెండ్ చేశారు. లంచం తీసుకుంటూ దొరికిపోయిన వారిపై వేటు సహజంగా జరిగే ప్రక్రియే అయినా ఆ దాడిలో పట్టుబడని సీఐను సస్పెండ్ చేయడంతో అవినీతిని ప్రోత్సహించేవారికి దండన తప్పదనే సంకేతాలను ఇచ్చారు. గత సంఘటనలు గతేడాది ప్రథమార్ధంలో పెందుర్తి సీఐ జి.రాజశేఖర్ ఆదాయానికి మించిన ఆస్తులు కూడగట్టారనే ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. దీంతో ఆయన సస్పెన్షన్‌కు గురయ్యారు. నవంబర్ 27న రైల్వే రక్షక దళం(ఆర్పీఎఫ్) ఇన్స్పెక్టర్ భగీరథ్ విశ్వాస్ రూ.5వేలు లంచం డిమాండ్ చేసి ఏసీబీ వలకు చిక్కారు. నవంబర్ 30న నాల్గో పట్టణ పోలీస్ స్టేషన్ లా అండ్ ఆర్డర్ ఎస్ఐ రమేష్‌బాబు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. డిసెంబర్ 25న నాల్గో పట్టణ పోలీస్ స్టేషన్ వాల్తేరు జోన్ ఎస్ఐ రామారావు, కానిస్టేబుల్ లక్ష్మణరావు రూ.లక్ష డిమాండ్ చేసి అవినీతి నిరోధక శాఖకు దొరికారు. ఇదే కేసులో వీరితో పాటు సీఐ జి.వి.రమణ సస్పెండయ్యారు. డిసెంబర్ 2న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎన్.రమేష్‌కుమార్ రూ.5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికారు. ఇక రోజూ పర్యవేక్షణ పోలీస్ స్టేషన్లలో అవినీతిపై అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ అవినీతికి పాల్పడుతున్నవారి గురించి ఆరా తీస్తున్నాం. ఇక మీదట డీసీపీ, ఏసీసీలు రోజూ స్టేషన్లతో మీడియో, టెలీ కాన్ఫరెన్స్‌లు జరుపుతారు. స్టేషన్‌కు వచ్చే ప్రజల నుంచి కూడా ఫీడ్‌బ్యాక్ తీసుకుంటాం. ఎవరి పనితీరు సరిగ్గా లేకపోయినా కఠిన చర్యలు తీసుకుంటాం. అవి నీతి నిరోధానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నాం. - అతుల్‌సింగ్, ఇన్చార్జి సీపీ -
ఒడిశా సరిహద్దుల్లో మావోల కదలికలపై నిఘా: అతుల్‌సింగ్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలు పెరిగిన నేపథ్యంలో పోలీసులను అప్రవుత్తం చేశావుని ఉత్తర కోస్తా ఐజీ అతుల్‌సింగ్ పేర్కొన్నారు. సీమాంధ్రలో ఈ నెల 7న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల తాజా కార్యకలాపాలు, వాటిని నిరోధించేం దుకు తీసుకోవాల్సిన చర్యలపై శుక్రవారం ఆయున విశాఖ రేంజ్ అధికారులతో మాట్లాడారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో పోలింగ్ సందర్భంగా విధ్వంసానికి మావోయిస్టులు వ్యూహరచన చేశారని ఇంటెలిజెన్స్ హెచ్చరించిన నేపథ్యంలో సరిహద్దుల్లో నక్సల్స్ కదలికలపై నిఘాను పెంచాలని, గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్ బలగాలతో గాలింపు చర్యలను ఉధృతం చేయాలని నిర్ణయించారు. తమ రీజియన్‌లో పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఐజీ అతుల్‌సింగ్ ‘సాక్షి’కి వివరించారు.