కానిస్టేబుల్ పోస్టులకు ఆదివారం నిర్వహించిన తుది రాత పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి.
సాక్షి, అమరావతి: కానిస్టేబుల్ పోస్టులకు ఆదివారం నిర్వహించిన తుది రాత పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 72,324 మందికి హాల్‌టికెట్లు జారీ చేయగా 72,045 మంది హాజరయ్యారు. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, తిరుపతి, కర్నూలుల్లోని కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. 99.61 శాతం మంది పరీక్షకు హాజరైనట్టు ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ అతుల్ సింగ్ ప్రకటనలో తెలిపారు. ఏ,బీ,సీ,డీ ప్రశ్నాపత్రాలకు సంబంధించిన కీ విడుదల చేశారు.
కీ విషయంలో ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా ఈ నెల 25వ తేదీ సాయంత్రం లోపు మెయిల్ చేయాలని సూచించారు. 3,216 సివిల్ కానిస్టేబుల్స్, 1,067 ఏఆర్ కానిస్టేబుల్స్, వార్డెన్లు 240(పురుషులు), 25(మహిళలు) పోస్టులకు సంబంధించిన తుది ఫలి తాలను పదిహేను రోజుల్లో ప్రకటించ నున్నట్టు తెలిపారు.