కానిస్టేబుల్ పరీక్షలో 63,718 మంది అర్హత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 4,548 కానిస్టేబుల్ పోస్టులకు నిర్వహించిన తుది రాతపరీక్షల్లో 63,718 మంది అర్హత సాధించినట్లు ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ అతుల్‌సింగ్ సోమవారం ప్రకటించారు. దీనిప్రకారం ఒక్కో కానిస్టేబుల్ పోస్టుకు సగటున 14 మంది అర్హత సాధించినట్టు అయ్యింది. వారిలో మెరిట్ ఆధారంగా పోస్టులు భర్తీ చేపడతారు. ఈ నెల 7 నుంచి అభ్యర్థులు "recruitment. appolice. gov. in' వెబ్‌సైట్‌లో ఓఎంఆర్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ నెల 8 నుంచి 10వ తేదీలోపు వెబ్‌సైట్‌లో నిర్దేశించిన ఫార్మాట్‌లో అభ్యంతరాలను పంపించాల్సి ఉంటుంది. ఈ నెల 13న అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షల ఫలితాలు, విద్యార్హతలు, ఇతర సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. ఓఎంఆర్ షీట్స్, అభ్యంతరాల పరిశీలన అనంతరం తుది ఫలితాలు ప్రకటించి మెరిట్ ఆధారంగా కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపడతారు. అభ్యర్థులు అవసరమైన సమాచారం కోసం 94414 50639, 0884–2340535, 0884–2356255 హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు. లేదా ‘apslprb. pc@ gmail. com’కు మెయిల్ చేయవచ్చు.