సాక్షి, హైదరాబాద్: ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలు పెరిగిన నేపథ్యంలో పోలీసులను అప్రవుత్తం చేశావుని ఉత్తర కోస్తా ఐజీ అతుల్‌సింగ్ పేర్కొన్నారు. సీమాంధ్రలో ఈ నెల 7న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల తాజా కార్యకలాపాలు, వాటిని నిరోధించేం దుకు తీసుకోవాల్సిన చర్యలపై శుక్రవారం ఆయున విశాఖ రేంజ్ అధికారులతో మాట్లాడారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో పోలింగ్ సందర్భంగా విధ్వంసానికి మావోయిస్టులు వ్యూహరచన చేశారని ఇంటెలిజెన్స్ హెచ్చరించిన నేపథ్యంలో సరిహద్దుల్లో నక్సల్స్ కదలికలపై నిఘాను పెంచాలని, గ్రేహౌండ్స్, సీఆర్‌పీఎఫ్ బలగాలతో గాలింపు చర్యలను ఉధృతం చేయాలని నిర్ణయించారు. తమ రీజియన్‌లో పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఐజీ అతుల్‌సింగ్ ‘సాక్షి’కి వివరించారు.