బీసీసీఐ ఫిట్నెస్ మంత్ర
కాంట్రాక్టు క్రికెటర్లకు పరీక్షలు తప్పనిసరి
ముంబై: ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రత్యేక దృష్టి సారించింది. బోర్డుతో ఒప్పందం కుదుర్చుకున్న క్రికెటర్లందరికి ఇకపై క్రమం తప్పకుండా ఫిట్‌నెస్ టెస్టులు చేయాలని నిర్ణరుుంచింది. ఆటగాళ్లకు రెండు నెలలకోసారి... లేదంటే ప్రతి 45 రోజులకోసారి ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించనుంది. ఈ మేరకు ఆటగాళ్ల వివరాలను భారత చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే బోర్డుకు సమర్పించారు. 2011 వన్డే ప్రపంచకప్‌కు ముందు కూడా ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పటికీ తదనంతరం పూర్తిస్థారుులో ఈ ప్రక్రియను కొనసాగించలేకపోయారు.