Bigg Boss Fame Ashu Reddy First Look From Focus Movie Released, Deets Inside - Sakshi
Sakshi News home page

Ashu Reddy: అషూ రెడ్డి హీరోయిన్‌గా ఫోకస్‌, పోస్టర్‌ చూశారా?

Published Wed, Apr 27 2022 11:25 AM | Last Updated on Wed, Apr 27 2022 1:01 PM

Ashu Reddy First Look From Focus Movie Released - Sakshi

యంగ్ హీరో విజ‌య్ శంక‌ర్, `బిగ్‌బాస్` ఫేమ్‌ అషూరెడ్డి హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం 'ఫోక‌స్'. సుహాసిని మ‌ణిర‌త్నం, భానుచంద‌ర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నఈ చిత్రానికి జి. సూర్య‌తేజ ద‌ర్శ‌కుడు. మర్డర్‌ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కింది. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్‌కి మంచి రెస్పాన్స్ రాగా ఇటీవ‌ల విడుద‌లైన ఫోక‌స్ మూవీ టీజ‌ర్ ఐదు ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్ సాధించి సోష‌ల్ మీడియాలో విశేషాద‌ర‌ణ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో అషురెడ్డి మొద‌టిసారిగా పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నుంది. తాజాగా ఆమె లుక్‌ను బి. సుమతి ఐపీఎస్‌ (డీఐజీ, మహిళా భద్రతా విభాగం) విడుద‌ల చేసి చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌ తెలిపారు.

ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు జి. సూర్య‌తేజ మాట్లాడుతూ.. 'ఫోక‌స్ మూవీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ పూర్త‌య్యింది. ఔట్ పుట్ ప‌ట్ల మా యూనిట్ అంద‌రం చాలా సంతోషంగా ఉన్నాం. అతి త్వ‌ర‌లో ఒక స్టార్ హీరోతో ఫోక‌స్ మూవీ ట్రైల‌ర్‌ని లాంచ్ చేయ‌బోతున్నాం. ఇప్ప‌టి వ‌ర‌కు మాకు స‌పోర్ట్ చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ థ్యాంక్స్‌. త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్ ప్ర‌క‌టిస్తాం' అన్నారు. స్కైరా క్రియేషన్స్‌ సమర్పణలో రిలాక్స్‌ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

చదవండి: పాన్‌ ఇండియా సినిమాల సక్సెస్‌, కలవరపడుతున్న కోలీవుడ్‌

 బాలీవుడ్‌ రీమేక్‌లపై వర్మ వ్యంగ్యాస్త్రాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement