కూర్చొని పనిచేసే ఉద్యోగులకు మంచి అవకాశం! | Walk more at workplace: Hold walking meetings for super health | Sakshi
Sakshi News home page

కూర్చొని పనిచేసే ఉద్యోగులకు మంచి అవకాశం!

Published Sun, Jul 3 2016 4:14 PM | Last Updated on Mon, Sep 4 2017 4:03 AM

కూర్చొని పనిచేసే ఉద్యోగులకు మంచి అవకాశం!

కూర్చొని పనిచేసే ఉద్యోగులకు మంచి అవకాశం!

వాషింగ్టన్: కూర్చొని పనిచేసే ఉద్యోగులు తమ ఆరోగ్యం కాపాడుకునేందుకు ఇదో మంచి అవకాశం. వారానికోసారి పనివేళ వాకింగ్ మీటింగ్‌ల (నడుస్తూ మాట్లాడుకోవడం) వల్ల వారిలో భౌతిక శ్రమ స్థాయులు 10 నిమిషాలు పెరుగుతాయని తాజా పరిశోధనలో తెలిసింది.  ‘‘పనిచేసే చోట శారీరక శ్రమకు అవకాశం తక్కువ. ఈ ప్రయోగాత్మక అధ్యయనంలో... వాకింగ్ సమావేశాలు సాధ్యమేనని, సంప్రదాయ కూర్చొని జరిపే సమావేశాలను దీనిలోకి మార్చేందుకు ఉద్యోగులకు సమ్మతమేనని రుజువైంది’’ అని మియామి వర్సిటీ మెడిసిన్ స్కూల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జె.కాబన్ మార్టినెజ్ తెలిపారు.

మూడు వారాల పాటు చేపట్టిన అధ్యయనంలో పాల్గొన్న వైట్ కాలర్ ఉద్యోగులు తమ భౌతిక శ్రమ స్థాయులు కొలిచేందుకు అక్సిలెరోమీటర్లు ధరించారు. వారి సగటు శారీరక శ్రమ స్థాయులు తొలివారంలోని 107 నిమిషాల నుంచి రెండో వారంలో 114 నిమిషాలకు పెరిగాయి. మూడో వారంలో 117 నిమిషాలకు చేరాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement