University of Miami
-
కూర్చొని పనిచేసే ఉద్యోగులకు మంచి అవకాశం!
వాషింగ్టన్: కూర్చొని పనిచేసే ఉద్యోగులు తమ ఆరోగ్యం కాపాడుకునేందుకు ఇదో మంచి అవకాశం. వారానికోసారి పనివేళ వాకింగ్ మీటింగ్‌ల (నడుస్తూ మాట్లాడుకోవడం) వల్ల వారిలో భౌతిక శ్రమ స్థాయులు 10 నిమిషాలు పెరుగుతాయని తాజా పరిశోధనలో తెలిసింది. ‘‘పనిచేసే చోట శారీరక శ్రమకు అవకాశం తక్కువ. ఈ ప్రయోగాత్మక అధ్యయనంలో... వాకింగ్ సమావేశాలు సాధ్యమేనని, సంప్రదాయ కూర్చొని జరిపే సమావేశాలను దీనిలోకి మార్చేందుకు ఉద్యోగులకు సమ్మతమేనని రుజువైంది’’ అని మియామి వర్సిటీ మెడిసిన్ స్కూల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జె.కాబన్ మార్టినెజ్ తెలిపారు. మూడు వారాల పాటు చేపట్టిన అధ్యయనంలో పాల్గొన్న వైట్ కాలర్ ఉద్యోగులు తమ భౌతిక శ్రమ స్థాయులు కొలిచేందుకు అక్సిలెరోమీటర్లు ధరించారు. వారి సగటు శారీరక శ్రమ స్థాయులు తొలివారంలోని 107 నిమిషాల నుంచి రెండో వారంలో 114 నిమిషాలకు పెరిగాయి. మూడో వారంలో 117 నిమిషాలకు చేరాయి. -
‘లేజర్’ పద్ధతితో హరికేన్ల తీవ్రత అంచనా
వాషింగ్టన్: సముద్ర ఉపరితలంపై పరిస్థితులను లేజర్ కాంతిపుంజాలను పంపి పరిశీలించడం ద్వారా పెనుతుపాన్ల తీవ్రతను బాగా అంచనా వేయవచ్చని యూనివర్సిటీ ఆఫ్ మియామీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సాధారణంగా సముద్రం, వాతావరణం మధ్య సాంద్రతల తేడా చాలా ఎక్కువగా ఉన్నప్పుడు తుపాన్ల తీవ్రత స్థిరంగా ఉంటుంది. అయితే తుపాన్ల సమయంలో సముద్ర ఉపరితలంపై నీరు, గాలులపై తాము గెడైడ్ లేజర్‌ను పంపే షాడో ఇమేజింగ్ పద్ధతిలో అధ్యయనం చేయగా.. ఉష్ణ మండలప్రాంత తుపానుల తీవ్రత వేగంగా మారిపోతుండటాన్ని అంచనా వేసినట్లు పరిశోధకులు తెలిపారు. సముద్ర ఉపరితలంపై ఒత్తిడి, హరికేన్ గాలుల వేగం వంటి వాటిని బట్టి హరికేన్ తీవ్రతను అంచనా వేయొచ్చని పేర్కొన్నారు. వీరి పరిశోధన వివరాలు ‘నేచర్ సైంటిఫిక్ రిపోర్ట్స్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.