వాషింగ్టన్: సముద్ర ఉపరితలంపై పరిస్థితులను లేజర్ కాంతిపుంజాలను పంపి పరిశీలించడం ద్వారా పెనుతుపాన్ల తీవ్రతను బాగా అంచనా వేయవచ్చని యూనివర్సిటీ ఆఫ్ మియామీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సాధారణంగా సముద్రం, వాతావరణం మధ్య సాంద్రతల తేడా చాలా ఎక్కువగా ఉన్నప్పుడు తుపాన్ల తీవ్రత స్థిరంగా ఉంటుంది. అయితే తుపాన్ల సమయంలో సముద్ర ఉపరితలంపై నీరు, గాలులపై తాము గెడైడ్ లేజర్‌ను పంపే షాడో ఇమేజింగ్ పద్ధతిలో అధ్యయనం చేయగా.. ఉష్ణ మండలప్రాంత తుపానుల తీవ్రత వేగంగా మారిపోతుండటాన్ని అంచనా వేసినట్లు పరిశోధకులు తెలిపారు. సముద్ర ఉపరితలంపై ఒత్తిడి, హరికేన్ గాలుల వేగం వంటి వాటిని బట్టి హరికేన్ తీవ్రతను అంచనా వేయొచ్చని పేర్కొన్నారు. వీరి పరిశోధన వివరాలు ‘నేచర్ సైంటిఫిక్ రిపోర్ట్స్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
‘లేజర్’ పద్ధతితో హరికేన్ల తీవ్రత అంచనా
Published Sun, Jul 13 2014 2:14 AM | Last Updated on Sat, Oct 20 2018 4:38 PM
Advertisement
Advertisement