Health: చీకటి పొర చీల్చండి.. | Precautions To Be Taken For Cataract Related Eye Problem Sakshi Plus News | Sakshi
Sakshi News home page

Health: చీకటి పొర చీల్చండి..

Published Tue, Sep 3 2024 10:15 AM | Last Updated on Tue, Sep 3 2024 10:15 AM

Precautions To Be Taken For Cataract Related Eye Problem Sakshi Plus News

క్యాటరాక్ట్‌ అంటే...?

మధ్య వయసు దాటాక చాలామందిలో కంటికి వచ్చే సమస్యల్లో ముఖ్యమైనది క్యాటరాక్ట్‌. ఈ సమస్యనే వాడుకభాషలో కంటిలో వచ్చే తెల్లముత్యం అనీ, పువ్వు రావడం, పొర రావడం అని అంటుంటారు. ప్రపంచవ్యాప్తంగా 60 శాతం మందిలో క్యాటరాక్ట్‌ వల్ల అంధత్వం వస్తోంది. ఇప్పటికీ మారుమూల గ్రామీణ ్రపాంతాల్లో మధ్యవయసులోనే అంధత్వానికి దారితీసే కారణాల్లో ఇదీ ఒకటి. దీనికి కారణాలూ, చికిత్స ఏమిటో తెలుసుకుందాం.

సాధారణంగా వృద్ధాప్య దశలోనే వచ్చే ఈ క్యాటరాక్ట్‌...
ఇటీవల చాలామందిలో చాలా చిన్నవయసులోనే వస్తోంది. అంధత్వానికి దారితీసే అంశాల్లో క్యాటరాక్ట్‌ కూడా ఒకటి అని తెలిసినప్పటికీ, సాధారణ శస్త్రచికిత్సతో దీన్ని సరిదిద్దడం సాధ్యమైనప్పటికీ మారుమూల పల్లెవాసుల్లో దీనిపై అంతగా అవగాహన లేకపోవడంతో ఇప్పటికీ దీని వల్ల అంధులయ్యేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. సర్జరీ ద్వారా ఈ పరిస్థితిని పూర్తిగా సరిదిద్ది, దీని ద్వారా వచ్చే అంధత్వాన్ని నివారించడం నూటికి నూరు పాళ్లు సాధ్యమే. అదెలాగో చూద్దాం.

క్యాటరాక్ట్‌ అంటే ఏమిటి, అందుకు కారణాలు...
కంట్లో ఉండే పారదర్శకమైన లెన్స్‌ పారదర్శకంగా ఉన్నంతసేపే కాంతి నిరాటంకంగా లోపలికి ప్రవేశించి రెటీనా తెరను చేరుకుంటుంది. అయితే కొన్ని కారణాల వల్ల లెన్స్‌ తన పారదర్శకత కోల్పోయే ప్రమాదముంది. అవి... పెరిగే వయసు, లేదా ఏదైనా ప్రమాదాలు వంటి కారణాలతో ఈ లెన్స్‌ క్రమంగా మసక మసకబారిపోతూ తన పారదర్శకతను కోల్పోతుంది. దాంతో లెన్స్‌ గుండా కాంతి సాఫీగా ప్రయణించడం సాధ్యం కాదు. ఫలితంగా క్రమంగా చూపు మసకబారుతుంది. ఈ కండిషన్‌నే క్యాటరాక్ట్‌ అంటారు.

చికిత్స...
క్యాటరాక్ట్‌ ఉన్నవారికి కంట్లో పారదర్శకత కోల్పోయిన లెన్స్‌ను తొలగించి, దాని స్థానంలో కృత్రిమ (ఆర్టిఫిషియల్‌) లెన్స్‌ (ఐఓఎల్‌ / ఇంట్రా ఆక్యులార్‌ లెన్స్‌)ను అమర్చడం ద్వారా చికిత్స చేసేవారు. అయితే గతంలో ఈ లెన్స్‌ను తొలగించేందుకు  దాదాపు 13–14 ఎం.ఎం. మేరకు కోత పెట్టేవారు. తర్వాత ఈ గాయానికి కుట్లు  వేసేవారు. కాల క్రమంలో శస్త్రచికిత్సల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. అక్రిలిక్‌ టెక్నాలజీలో వచ్చిన మార్పులతో కృత్రిమ లెన్స్‌ను రూపొందించారు. పాత స్వాభావిక (నేచురల్‌) లెన్స్‌ స్థానంలో దీన్ని అమర్చుతారు. దీంతో ఆపరేషన్‌ తర్వాత కనుచూపు పూర్తిగా మెరుగవుతుంది.

ఫ్యాకో ఎమల్సిఫికేషన్‌... (పీఈ):
కాటరాక్ట్‌ చికిత్సలో ఫ్యాకో ఎమల్సిఫికేషన్‌ అనేది ఒక ఆధునిక ప్రక్రియ. ఇందులో అల్ట్రా సౌండ్‌ ఎనర్జీ సహాయంతో లెన్స్‌ను చిన్న చిన్న ముక్కలుగా చేసి, చిన్న రంధ్రం ద్వారా క్యాటరాక్టస్‌ లెన్స్‌ (క్యాటరాక్ట్‌కు గురైన లెన్స్‌)ను తొలగిస్తారు. అదే చిన్న రంధ్రం ద్వారా ఫోల్డబుల్‌ అక్రిలిక్‌ ఇంట్రాక్యులార్‌ లెన్స్‌ను కంటిలోపల అమర్చుతారు. దీనికి కేవలం 2 – 3 ఎం.ఎం. గాటు సరిపోతుంది. కుట్లు వేయాల్సిన అవసరం కూడా ఉండదు. గాటు చిన్నది కావడం వల్ల గాయం మానేందుకు పట్టే సమయం కూడా తక్కువ. ఈ ప్రక్రియలో రిస్క్‌ కూడా చాలా తక్కువ. దీనిలో కన్ను ఎర్రబారడం, కళ్ల మంట చాలా తక్కువ. ఫలితంగా బాధితులు చాలా త్వరగా తమ వృత్తి, ఉద్యోగాలకు వెళ్లవచ్చు.

ఫెమ్టో లేజర్‌ చికిత్స:
త్యాధునికమైన ఫెమ్టో లేజర్‌ సాంకేతికత ఇప్పుడు క్యాటరాక్ట్‌కు మరో చికిత్స. ఇందులో కాటరాక్టస్‌ లెన్స్‌ తాలూకు పరిమాణం, మందం వంటి అంశాలను ఓసీటీ టెస్ట్‌ ద్వారా కొలిచి లేజర్‌ చికిత్స ద్వారా అవసరమైనంత పరిమాణంలో ముక్కలు చేసి ఆ మేరకే లెన్స్‌ను తొలగిస్తారు. కచ్చితత్వం, భద్రత... ఈ రెండూ ఈ ప్రక్రియలో ప్రధాన భూమిక పోషిస్తాయి.

లెన్స్‌లలో మరెన్నో రకాలు...
లెన్స్‌లలో మోనోఫోకల్, బైఫోకల్, ట్రైఫోకల్, టోరిక్‌ అనేవి కూడా కొత్తగా వచ్చాయి. ఇవి పేషెంట్‌ అవసరాలను బట్టి అమర్చుతారు.

మత్తు అవసరం లేదు.. నొప్పీ ఉండదు..
ఫ్యాకో చికిత్సలోనూ, లేజర్‌ చికిత్సలోనూ గతంలోలా పూర్తిగా మత్తు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. కేవలం లోకల్‌ అనస్థీషియాగా చుక్కల మందు వేసి వెంటనే చేసేందుకు అవకాశం ఉంది. అంతేకాదు... గత ప్రక్రియలతో పోలిస్తే నొప్పి కూడా తక్కువే.

కొనసాగుతున్న పరిశోధనలు...
ఫ్యాకో ఎమల్సిఫికేషన్, ఫెమ్టో లేజర్‌ దగ్గరే పురోగతి ఆగిపోలేదు. మరింత నాణ్యమైన, సమర్థమైన కృత్రిమ లెన్స్‌ల కోసం కృషి కొనసాగుతూనే ఉంది. ఇందులో ఇంట్రా ఆక్యులార్‌ లెన్స్‌ మరింత ఆధునికమైనవి.

ఇవి చదవండి: డ్రాగన్‌ పౌడర్‌ టెక్నాలజీ రెడీ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement