cataract operation
-
Health: చీకటి పొర చీల్చండి..
మధ్య వయసు దాటాక చాలామందిలో కంటికి వచ్చే సమస్యల్లో ముఖ్యమైనది క్యాటరాక్ట్. ఈ సమస్యనే వాడుకభాషలో కంటిలో వచ్చే తెల్లముత్యం అనీ, పువ్వు రావడం, పొర రావడం అని అంటుంటారు. ప్రపంచవ్యాప్తంగా 60 శాతం మందిలో క్యాటరాక్ట్ వల్ల అంధత్వం వస్తోంది. ఇప్పటికీ మారుమూల గ్రామీణ ్రపాంతాల్లో మధ్యవయసులోనే అంధత్వానికి దారితీసే కారణాల్లో ఇదీ ఒకటి. దీనికి కారణాలూ, చికిత్స ఏమిటో తెలుసుకుందాం.సాధారణంగా వృద్ధాప్య దశలోనే వచ్చే ఈ క్యాటరాక్ట్...ఇటీవల చాలామందిలో చాలా చిన్నవయసులోనే వస్తోంది. అంధత్వానికి దారితీసే అంశాల్లో క్యాటరాక్ట్ కూడా ఒకటి అని తెలిసినప్పటికీ, సాధారణ శస్త్రచికిత్సతో దీన్ని సరిదిద్దడం సాధ్యమైనప్పటికీ మారుమూల పల్లెవాసుల్లో దీనిపై అంతగా అవగాహన లేకపోవడంతో ఇప్పటికీ దీని వల్ల అంధులయ్యేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. సర్జరీ ద్వారా ఈ పరిస్థితిని పూర్తిగా సరిదిద్ది, దీని ద్వారా వచ్చే అంధత్వాన్ని నివారించడం నూటికి నూరు పాళ్లు సాధ్యమే. అదెలాగో చూద్దాం.క్యాటరాక్ట్ అంటే ఏమిటి, అందుకు కారణాలు...కంట్లో ఉండే పారదర్శకమైన లెన్స్ పారదర్శకంగా ఉన్నంతసేపే కాంతి నిరాటంకంగా లోపలికి ప్రవేశించి రెటీనా తెరను చేరుకుంటుంది. అయితే కొన్ని కారణాల వల్ల లెన్స్ తన పారదర్శకత కోల్పోయే ప్రమాదముంది. అవి... పెరిగే వయసు, లేదా ఏదైనా ప్రమాదాలు వంటి కారణాలతో ఈ లెన్స్ క్రమంగా మసక మసకబారిపోతూ తన పారదర్శకతను కోల్పోతుంది. దాంతో లెన్స్ గుండా కాంతి సాఫీగా ప్రయణించడం సాధ్యం కాదు. ఫలితంగా క్రమంగా చూపు మసకబారుతుంది. ఈ కండిషన్‌నే క్యాటరాక్ట్ అంటారు.చికిత్స...క్యాటరాక్ట్ ఉన్నవారికి కంట్లో పారదర్శకత కోల్పోయిన లెన్స్‌ను తొలగించి, దాని స్థానంలో కృత్రిమ (ఆర్టిఫిషియల్) లెన్స్ (ఐఓఎల్ / ఇంట్రా ఆక్యులార్ లెన్స్)ను అమర్చడం ద్వారా చికిత్స చేసేవారు. అయితే గతంలో ఈ లెన్స్‌ను తొలగించేందుకు దాదాపు 13–14 ఎం.ఎం. మేరకు కోత పెట్టేవారు. తర్వాత ఈ గాయానికి కుట్లు వేసేవారు. కాల క్రమంలో శస్త్రచికిత్సల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. అక్రిలిక్ టెక్నాలజీలో వచ్చిన మార్పులతో కృత్రిమ లెన్స్‌ను రూపొందించారు. పాత స్వాభావిక (నేచురల్) లెన్స్ స్థానంలో దీన్ని అమర్చుతారు. దీంతో ఆపరేషన్ తర్వాత కనుచూపు పూర్తిగా మెరుగవుతుంది.ఫ్యాకో ఎమల్సిఫికేషన్... (పీఈ):కాటరాక్ట్ చికిత్సలో ఫ్యాకో ఎమల్సిఫికేషన్ అనేది ఒక ఆధునిక ప్రక్రియ. ఇందులో అల్ట్రా సౌండ్ ఎనర్జీ సహాయంతో లెన్స్‌ను చిన్న చిన్న ముక్కలుగా చేసి, చిన్న రంధ్రం ద్వారా క్యాటరాక్టస్ లెన్స్ (క్యాటరాక్ట్‌కు గురైన లెన్స్)ను తొలగిస్తారు. అదే చిన్న రంధ్రం ద్వారా ఫోల్డబుల్ అక్రిలిక్ ఇంట్రాక్యులార్ లెన్స్‌ను కంటిలోపల అమర్చుతారు. దీనికి కేవలం 2 – 3 ఎం.ఎం. గాటు సరిపోతుంది. కుట్లు వేయాల్సిన అవసరం కూడా ఉండదు. గాటు చిన్నది కావడం వల్ల గాయం మానేందుకు పట్టే సమయం కూడా తక్కువ. ఈ ప్రక్రియలో రిస్క్ కూడా చాలా తక్కువ. దీనిలో కన్ను ఎర్రబారడం, కళ్ల మంట చాలా తక్కువ. ఫలితంగా బాధితులు చాలా త్వరగా తమ వృత్తి, ఉద్యోగాలకు వెళ్లవచ్చు.ఫెమ్టో లేజర్ చికిత్స:త్యాధునికమైన ఫెమ్టో లేజర్ సాంకేతికత ఇప్పుడు క్యాటరాక్ట్‌కు మరో చికిత్స. ఇందులో కాటరాక్టస్ లెన్స్ తాలూకు పరిమాణం, మందం వంటి అంశాలను ఓసీటీ టెస్ట్ ద్వారా కొలిచి లేజర్ చికిత్స ద్వారా అవసరమైనంత పరిమాణంలో ముక్కలు చేసి ఆ మేరకే లెన్స్‌ను తొలగిస్తారు. కచ్చితత్వం, భద్రత... ఈ రెండూ ఈ ప్రక్రియలో ప్రధాన భూమిక పోషిస్తాయి.లెన్స్‌లలో మరెన్నో రకాలు...లెన్స్‌లలో మోనోఫోకల్, బైఫోకల్, ట్రైఫోకల్, టోరిక్ అనేవి కూడా కొత్తగా వచ్చాయి. ఇవి పేషెంట్ అవసరాలను బట్టి అమర్చుతారు.మత్తు అవసరం లేదు.. నొప్పీ ఉండదు..ఫ్యాకో చికిత్సలోనూ, లేజర్ చికిత్సలోనూ గతంలోలా పూర్తిగా మత్తు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. కేవలం లోకల్ అనస్థీషియాగా చుక్కల మందు వేసి వెంటనే చేసేందుకు అవకాశం ఉంది. అంతేకాదు... గత ప్రక్రియలతో పోలిస్తే నొప్పి కూడా తక్కువే.కొనసాగుతున్న పరిశోధనలు...ఫ్యాకో ఎమల్సిఫికేషన్, ఫెమ్టో లేజర్ దగ్గరే పురోగతి ఆగిపోలేదు. మరింత నాణ్యమైన, సమర్థమైన కృత్రిమ లెన్స్‌ల కోసం కృషి కొనసాగుతూనే ఉంది. ఇందులో ఇంట్రా ఆక్యులార్ లెన్స్ మరింత ఆధునికమైనవి.ఇవి చదవండి: డ్రాగన్ పౌడర్ టెక్నాలజీ రెడీ! -
కంటి శుక్లాలు ఏర్పడడానికి కారణం ఈ చిన్న మార్పుతో అంధత్వం దూరం
-
శుక్లం శాపం, దృష్టి లోపం.. కారణాలు, లక్షణాలు, చికిత్స
కంటిశుక్లం అత్యంత విలువైన కంటి చూపును తగ్గించే తీవ్రమైన సమస్య. దీనిపై ప్రజలలో ఇంకా అవగాహన పెరగాల్సి ఉంది. ఇది నిదానంగా పెరిగే సమస్య కావడం వల్ల చాలామంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. తద్వారా సమస్య తీవ్రత పెరిగేందుకు కారణమవుతున్నారు. ఈ నేపధ్యంలో కంటి శుక్లం– శస్త్రచికిత్స/క్యాటరాక్ట్ ఆపరేషన్ అవసరం...పై అపోలో స్పెక్ట్రా ఆసుపత్రికి చెందిన వైద్యులు, ప్రముఖ క్యాటరాక్ట్ సర్జన్ డా. అల్పా అతుల్ పూర్బియా అందిస్తున్న సమాచారం ఇది... కంటి శుక్లం..కారణాలు... కంటి లెన్స్ పుట్టుకతో స్పష్టంగా ఉంటుంది, ప్రధానంగా నీరు మరియు ప్రోటీన్లతో కూడి ఉంటుంది. ప్రోటీన్లు కాలక్రమేణా విచ్ఛిన్నం కావడంతో, లెన్స్ తెల్లగా లేదా బూడిద రంగులోకి మారడం ప్రారంభిస్తుంది, ఇది స్పష్టమైన చూపును నిరోధిస్తుంది. దీనికి సాధారణంగా వయస్సు పెరగడం కాగా, అతినీలలోహిత కిరణం/సూర్య కాంతికి గురికావడం వంటివి కూడా కంటిశుక్లంను ప్రేరేపించడానికి కారణాలే. ఇక ఇతర కారణాలలో అతిగా ధూమపానం, దీర్ఘకాలిక మధుమేహం, దీర్ఘకాలిక స్టెరాయిడ్స్ వాడకం వంటివి కూడా ఉండవచ్చు. అలాగే ఆల్కహాల్ దుర్వినియోగం, ఊబకాయం, రేడియేషన్ థెరపీ మొదలైనవి కూడా ఉన్నాయి. ప్రమాదవశాత్తు కంటికి అయిన గాయాలు కూడా కంటిశుక్లం వృద్ధికి కారణం కావచ్చు. కొన్ని సార్లు పుట్టుకతో కూడా కంటిశుక్లం వచ్చే అవకాశం ఉంది. చాలా అరుదుగా పిల్లలలో అభివృద్ధి చెందే కంటిశుక్లంని డెవలప్మెంటల్ క్యాటరాక్ట్ అంటారు. గుర్తించాల్సిందే... కంటిశుక్లం నిదానంగా అభివృద్ధి చెందే గుణం కలిగి ఉంటుంది కాబట్టి ముందుగా జాగ్రత్త పడడం కష్టమవుతుంది. దీనిని ముందుగా గుర్తించడానికి రాత్రిపూట దృష్టికి అంతరాయం, తక్కువ కాంతిలో చూడటం కష్టతరం అవడం వంటి లక్షణాలు ఉపకరిస్తాయి. కంటి శుక్లం ఉన్న రోగులు సాధారణంగా లైట్ చుట్టూ ఒక కాంతిని చూస్తారు. అలాగే కంటి శుక్లం ఉన్నప్పుడు ప్రకాశవంతమైన లైట్ల మెరుపు బాధాకరంగా ఉంటుంది, కంటిశుక్లం ఉన్న వ్యక్తులు ప్రకాశవంతమైన సూర్యకాంతిలో సరిగ్గా చూడటం కష్టంగా ఉండవచ్చు లేదా రాత్రి సమయంలో కొన్నిసార్లు మరింత చెదిరిన దృష్టిని గమనించవచ్చు. వారికి ఇండోర్ లైట్లలో కూడా చూపు కష్టంగా ఉండవచ్చు. వీధి లైట్లు ఎదురుగా వచ్చే వాహనాల నుండి వచ్చే హెడ్లైట్ల వల్ల కలిగే కాంతి కారణంగా రాత్రి సమయంలో డ్రైవింగ్ సమస్యగా మారవచ్చు చికిత్స...? కంటిశుక్లం బాగు చేసేందుకు మందులతో చేయగలిగిన వైద్య చికిత్స లేదు. మసకబారిన చూపును, దృష్టిని పునరుద్ధరించడానికి శస్త్రచికిత్స ద్వారా కంటిశుక్లం తొలగించడమే మార్గం. . కంటిశుక్లం లక్షణాలు స్వల్పంగా ఉన్నట్లయితే, అద్దాలు లేదా కాంటాక్ట్ లెన్స్ అవసరం కావచ్చు, కానీ కాలక్రమేణా కంటిశుక్లం మరింత తీవ్రమవుతుంది. తర్వాత తర్వాత సాధారణ రోజువారీ కార్యకలాపాలకు కూడా ఇది ఆటంకం కలిగిస్తే శస్త్రచికిత్స చేయక తప్పదు. కంటిశుక్లం తొలగింపు శస్త్రచికిత్స ప్రక్రియను ఇంట్రాకోక్యులర్ లెన్స్ ఇంప్లాంటేషన్స్ తో ఫాకోఎమల్సిఫికేషన్ అంటారు. ఈ ప్రక్రియలో, కంటిశుక్లం వృద్ధి చెందిన అసలు లెన్స్, కృత్రిమ (ఇంట్రాకోక్యులర్ లెన్స్)తో భర్తీ చేయబడుతుంది. ఇది చాలా సురక్షితమైన ప్రక్రియ. ఈ శస్త్రచికిత్స తర్వాత కొన్ని రోజుల పాటు దురద, తేలికపాటి అసౌకర్యం కంటిలో నీరు కారడం వంటివి కనిపించవచ్చు. అయితే నేడు అందుబాటులో ఉన్న తాజా సాంకేతికతతో విజువల్ రికవరీ చాలా వేగంగా ఉంది. శస్త్రచికిత్స తర్వాత కోలుకునే కాలం ఒకరి నుండి మరొకరికి భిన్నంగా ఉండవచ్చు. కొంతమంది కొద్ది రోజుల్లోనే సాధారణ స్థితికి చేరుకుంటారు, మరికొందరికి కోలుకోవడానికి వారాలు పడుతుంది. ఇతరత్రా సమస్యలు లేనట్లయితే వైద్యులు ఒక వారం విశ్రాంతిని సిఫార్సు చేస్తారు. సాధారణంగా అయితే కొన్ని గంటలలోపే, కంటిలో కాలుష్యం లేదా ధూళి కణాలు ప్రవేశించకుండా నిరోధించడానికి రోగిని రక్షించే గ్లాస్ లేదా కంటికి ఐ ప్యాడ్‌తో ఇంటికి తిరిగి పంపుతారు. ––డా. అల్పా అతుల్ పూర్బియా, క్యాటరాక్ట్ సర్జన్, అపోలో స్పెక్ట్రా ఆసుపత్రి, కొండాపూర్ -
'సరోజినీ'లో మళ్లీ సేవలు ప్రారంభం
హైదరాబాద్ : మెహదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో దాదాపు 15 రోజుల విరామం తర్వాత ఇన్‌పేషంట్ సేవలు శుక్రవారం మళ్లీ ప్రారంభమైనాయి. ఈ రోజు ఉదయం అవుట్ పేషంట్ విభాగానికి వచ్చిన రోగుల్లో 40 మందిని ఇన్‌పేషంట్లుగా ఆసుపత్రలో చేర్చుకున్నారు. వీరికి సోమవారం శస్త్రచికిత్సలు చేయనున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. సదరు ఆసుపత్రిలో ఇటీవల క్యాటరాక్ట్ శాస్త్రచికిత్స చేయించుకున్న ఏడుగురు బాధితులకు కంటిచూపు పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్‌గా స్పందించింది. వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా తీసుకుని... కేసు నమోదు చేసింది. అలాగే ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, డీజీపీలకు కూడా నోటీసులు జారీ చేసింది. -
'ఆపరేషన్ వికటించి కంటి చూపు కోల్పోయారు'