రొమాంటిక్‌కి గెస్ట్‌ | ram guest role in romantic movie | Sakshi
Sakshi News home page

రొమాంటిక్‌కి గెస్ట్‌

Dec 5 2019 12:26 AM | Updated on Dec 5 2019 12:26 AM

ram guest role in romantic movie - Sakshi

రామ్‌

రామ్‌ ఇప్పటివరకు అతిథి పాత్రల్లో కనిపించలేదు. వచ్చే ఏడాది ‘రొమాంటిక్‌’ సినిమాలో గెస్ట్‌ రోల్‌లో కనిపించనున్నారు. పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఇది. పూరి జగన్నాథ్‌ అందించిన కథతో నూతన దర్శకుడు అనిల్‌ పాదూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను పూరి, చార్మి నిర్మిస్తున్నారు.

రొమాంటిక్‌ లవ్‌ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. కేతికా శర్మ కథానాయిక. ఇందులో మందిరా బేడీ, దివ్య దర్షినీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రమ్యకృష్ణ అతిథి పాత్రలో నటిస్తున్నారు. ఇప్పుడు రామ్‌ గెస్ట్‌గా నటించారనే వార్త బయటికొచ్చింది. సినిమాలో ఓ సర్‌ప్రైజ్‌గా రామ్‌ పాత్ర ఉంటుందని సమాచారం. ఈ పాత్రకు సంబంధించిన షూటింగ్‌ కూడా పూర్తి చేశారట రామ్‌. వచ్చే ఏడాది రిలీజ్‌ కానున్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement