
ఆకాష్ పూరి, కేతికా శర్మ
‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మించిన చిత్రం ‘రొమాంటిక్’. ఆకాష్ పూరి, కేతికా శర్మ జంటగా, రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించారు. అనిల్ పాడూరి దర్శకుడు. ఈ చిత్రాన్ని మే 29న విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు పేర్కొన్నాయి. అనిల్ పాడూరి మాట్లాడుతూ– ‘‘ఇంటెన్స్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది. వేసవి సెలవుల్లో కాలక్షేపాన్ని ఆశించేవాళ్లు మా సినిమాను చూడొచ్చు. ఇటీవల విడుదల చేసిన రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది. మా సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: లావణ్య
Comments
Please login to add a commentAdd a comment