Prabhas Interviewed Romantic Team Goes Viral - Sakshi
Sakshi News home page

Prabhas : ప్రభాస్‌ ఇంటర్వ్యూ: నెవర్‌ బిఫోర్‌..ఎవర్‌ ఆఫ్టర్‌

Published Wed, Oct 27 2021 1:38 PM | Last Updated on Wed, Oct 27 2021 3:51 PM

Prabhas Interviewed Romantic Team Goes Giral - Sakshi

Prabhas Chitchat With Romantic Team: యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం పాన్‌ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయినప్పటికీ పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి  చేస్తున్న రొమాంటిక్‌ సినిమాను దగ్గరుండి ప్రమోట్‌ చేస్తున్నాడు. ఇటీవల ట్రైలర్‌ రిలీజ్‌ చేసిన ప్రభాస్‌ తాజాగా రొమాంటిక్‌ హీరో, హీరోయిన్లతో సరదాగా ఇంటర్వ్యూ చేశాడు. ఈ నేపథ్యంలో ఆకాశ్‌, కేతికా శర్మలకు తనదైన స్టైయిల్‌లో ప్రశ్నలు సంధించాడు.

ఈ క్రమంలో ఇంటర్వ్యూ మొదట్లో కేతికా..తనని తాను పరిచయం చేసుకుంటూ..హాయ్ సార్, నేను ఢిల్లీ నుంచి కేతికను” అని చెప్పగా, “హాయ్ మేడమ్, నేను మొగల్తూరుకు చెందిన ప్రభాస్” అంటూ డార్లింగ్‌ బదులిచ్చాడు. హీరోయిన్‌ కేతిక బాగా పాడుతుందని ఆకాశ్‌ చెప్పగా.. ‘లేదు సార్‌. నేను కేవలం బాత్రూం సింగర్‌ని’ అని ఆమె పేర్కొంది. అయితే ఆకాశ్‌ మాత్రం ‘ఇది బాత్రూం అనుకో. నేను, ప్రభాస్‌ అన్న ఇక్కడ లేము అనుకో.. ఏమంటావ్‌ డార్లింగ్‌’ అని ప్రశ్నించగా... ‘ఆమె బాత్రూంలో నేను ఎందుకు ఉంటానురా?’ అంటూ ప్రభాస్‌ అదిరిపోయే సెటైర్‌ వేశాడు.

ఇంటర్వ్యూ మొత్తం ప్రభాస్‌ చాలా ఓపెన్‌ అప్‌ అ‍యి మాట్లాడాడు. సెటైర్స్‌ వేస్తూ ఆద్యంతం కట్టిపడేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంత బిజీగా ఉన్నా ఒక యంగ్‌ హీరో కోసం ప్రభాస్‌ ప్రమోషన్‌ చేయడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. నిజంగా ప్రభాస్‌ డార్లింగ్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక వీడియో చివర్లో పూరి జగన్నాథ్‌ భార్య లావణ్య అంటే తనకు ఎంతో ఇష్టం, గౌరవం అని ప్రభాస్‌ పేర్కొన్నారు. 

చదవండి: Romantic: భయమేసింది.. పారిపోదామనుకున్నా: ఆకాశ్‌ పూరి
ఆ ఫోటో చూసి సెట్స్‌లో నాతో విచిత్రంగా ప్రవర్తించారు: హీరోయిన్‌
నా కొడుకులకు అలాంటివి చేయొద్దని చెప్తా : నాగార్జున

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement