ప్రభాస్ ఇంటర్వ్యూ చేస్తున్నారంటే నమ్మలేకపోయా:  కేతికా శర్మ | Ketika Sharma Talk About Romantic Movie | Sakshi
Sakshi News home page

ప్రభాస్ ఇంటర్వ్యూ చేస్తున్నారంటే నమ్మలేకపోయా:  కేతికా శర్మ

Published Wed, Oct 27 2021 5:30 PM | Last Updated on Wed, Oct 27 2021 8:20 PM

Ketika Sharma Talk About Romantic Movie - Sakshi

‘నేను డిల్లీ నుండి వ‌చ్చాను. మాది డాక్ట‌ర్స్ ఫ్యామిలీ.. అయితే నేను మాత్రం ఒక‌  కొత్త ప్రపంచాన్ని ఎంచుకున్నాను. నాకు సినిమా రంగమంటే చాలా ఇష్టం. సినిమా ఫీల్డ్ రావాలని అనుకున్నాను. పూరి క‌నెక్ట్స్ వంటి పెద్ద బ్యానర్‌ ద్వారా డెబ్యూ అవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది’అన్నారు హీరోయిన్‌ కేతిక శర్మ. అనిల్‌ పాదూరి దర్శకత్వంలో ఆకాశ్‌ పూరి, కేతికా శర్మ జంటగా తెరకెక్కిన చిత్రం ‘రొమాంటిక్‌’.పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడదల కాబోతుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం హీరోయిన్ కేతిక శర్మ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

ఇన్ స్టాగ్రాంలో మిమ్మల్ని చూశాం.. మీరు ఒకసారి ఆడిషన్‌కి రండి అని పూరి కనెక్ట్స్ నుంచి కాల్ వచ్చింది. వచ్చాను.. ఆడిషన్ ఇచ్చాను.. అలా సినిమా మొదలైంది.

ఈ క్షణాన్ని ఎంజాయ్ చేయాలని అనుకునే అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. సమాజంలో కట్టుబాట్ల గురించి ఆలోచించకుండా తనకు నచ్చినట్టుగా బతికే అమ్మాయి కారెక్టర్‌ను ఈ సినిమాలో పోషించాను. మౌనిక ఎవరినైనా ప్రేమిస్తే.. మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది.

నా మొదటి చిత్రమే పూరి క‌నెక్ట్స్ వంటి పెద్ద బ్యానర్‌లో చేయడం ఆనందంగా ఉంది. పూరి సార్ లెజెండరీ డైరెక్టర్. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. దర్శకుడిగానే కాకుండా ఆయన మనస్తత్వం ఇంకా చాలా ఇష్టం. ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నాను. వారితో కలిసి పని చేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది.

నా మొదటి చిత్రంలోనే నాకు పాట పాడే అవకాశం వచ్చింది. నా వల్లే కాదే పాటను పాడాను చాలా  ఆనందంగా ఉంది. నా సినిమా రెండు రోజుల్లో విడుదల కాబోతోందనే సంతోషంగా నాలో ఎక్కువైంది. తెరపై నన్ను నేను చూసుకోవాలనే కల నెరవేరుతోంది.

► ఈ చిత్రంలో క్లైమాక్స్ అద్బుతంగా ఉంటుంది. ఎంతో ఇంటెన్సిటీతో ఉంటుంది. రమ్యకృష్ణ, ఆకాశ్‌తో కలిసి నటించడం చాలెంజింగ్ గా అనిపించింది. దర్శకుడు అనిల్ ని ప్ర‌తీ సీన్ గురించి పదే పదే అడిగేదాన్ని. టోట‌ల్ ఔట్‌పుట్ చూశాక ఆడియెన్స్‌కు నేను నచ్చుతాను అని అనిపించింది.

► ఆకాశ్‌ చాలా మంచి వ్యక్తి. నేను కంఫర్ట్‌గా ఫీలయ్యేలా చూసుకున్నాడు. నాకు ఈ చిత్రంలో ఆకాష్ రూపంలో ఓ మంచి ఫ్రెండ్ దొరికాడు.

► బయోపిక్స్‌లో నటించాలని ఉంది. నాకు సాయి పల్లవి అంటే చాలా ఇష్టం. ఆమె ఎంతో సహజంగా నటిస్తుంది. లవ్ స్టోరీ సినిమాను చూశాను. ఆమె చాలా చక్కగా నటించింది. ఆమె డ్యాన్సుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె చేసే ప్రతీ ఒక్కటీ నాకు ఇష్టమే.

► ప్రభాస్ మా టీంను పిలిచారు.. డార్లింగ్ మమ్మల్ని ఇంటర్వ్యూ చేయబోతోన్నారు అంటే నేను అస్సలు నమ్మలేదు. మా ఇంట్లో వాళ్లు, నార్త్ సైడ్ అంతా ఎక్కువగా సౌత్ సినిమాలు చూడరు. కానీ బాహుబలి మాత్రం అందరికీ తెలుసు. అంతర్జాతీయ స్థాయిలో మన ఇండస్ట్రీ అంటే బాహుబలితోనే గుర్తిస్తున్నారు. అలాంటి ప్రభాస్ ఇంటర్వ్యూ చేస్తున్నారంటే నమ్మలేకపోయాను. ఆయన ఎంతో ఒదిగి ఉంటారు. చాలా మంచి వారు. ఎంతో సింపుల్‌గా ఉంటారు. ఆయన మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం, మా సినిమాను ప్రమోట్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది.

► సినిమా మొదటి నుంచి చివరి వరకు ఛార్మీ గారు మా వెంటే ఉన్నారు. ఆమే నాకు శిక్షణ ఇచ్చారు. మౌనికను నాలో ఆమె చూశారు. నన్ను నమ్మారు. ఆమె ఎంతో మంచి వ్యక్తి.

► రొమాంటిక్ చిత్రంలో కరోనా కంటే ముందే షూట్ చేశాం. లక్ష్య సినిమా కరోనా సమయంలోనే షూట్ చేశాం. నా రెండు చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ రావడం ఆనందంగా ఉంది.

► రొమాంటిక్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. మీరంతా కూడా రొమాంటిక్ చిత్రాన్ని ఎంతో ఇష్టపడతారు. అద్భుతమైన డైలాగ్స్ ఉంటాయి.. ప్రతీ సీన్ ట్రీట్‌లా ఉంటుంది. 

► డబ్బింగ్ చెప్పలేదు. ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్నాను. త్వరలోనే డబ్బింగ్ చెప్పాలని, అది జరగాలని ఆశిస్తున్నాను. ప్రస్తుతం నాగ శౌర్యతో లక్ష్య, వైష్ణవ్ తేజ్‌తో మరో సినిమాను చేస్తున్నాను.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement