పిల్లల కోస​మే బతికి ఉన్నా: నటి మందిరా | Mandira Bedi on Life After Husbands Death and Says Children Reason to Live | Sakshi
Sakshi News home page

Mandira Bedi: పిల్లల కోస​మే బతికి ఉన్నా

Published Mon, Oct 18 2021 7:22 PM | Last Updated on Tue, Oct 19 2021 9:28 AM

Mandira Bedi on Life After Husbands Death and Says Children Reason to Live - Sakshi

బాలీవుడ్ నటి, మందిరా బేడీ క్రికెట్‌ వ్యాఖ్యాతగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఆమె భర్త, ప్రముఖ నిర్మాత రాజ్ కౌశల్ ఈ ఏడాది జూన్‌లో గుండెపోటుతో సడెన్‌గా మరణించాడు. ఆయన మృతి అనంతరం క్రమంగా కొలుకున్న ఈ నటి తన పనిలో పడిపోయింది. వర్క్‌లో ఎంత బిజీగా ఉన్న కుదిరినప్పుడల్లా భర్తపై ఉన్న ప్రేమని సోషల్‌ మీడియాలో వ్యక్త పరుస్తూనే ఉంటోంది. ఈ జంటకి ఇద్దరు పిల్లలు. పిల్లల కోసం మాత్రమే తాను బతుకుతున్నట్లు  ఓ ఇంటర్వూలో నటి తెలిపింది.

ఓ ఇంటర్వూలో భర్త మరణం తర్వాత జీవితంలో వచ్చిన మార్పులపై మందిరా స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. ‘నా పిల్లలే నా ప్రపంచం. విషాదం నుంచి కోలుకోవడానికి మోటివేషన్‌ వాళ్లే. వాళ్ల కోసం ఏదైనా చేస్తాను. నిజానికి నేను బతికి ఉండడానికి కారణం వారే. వారికి మంచి తల్లిగా ఉండాలనుకుంటున్నాను’ అని ఈ నటి చెప్పుకొచ్చింది. లైఫ్‌లో వచ్చే ఎత్తుపల్లాలతోనే గొప్ప పాఠాలను నేర్చుకునే అవకాశం ఉంటుందని తెలిపింది.

ఈ బ్యూటీ ప్రస్తుతం రెమిడీ నవ్‌ ఒరిజినల్‌ షో ‘ది లవ్‌ లాఫ్‌ లైవ్‌’ సీజన్‌ 3కి పనిచేస్తోంది. ఇంతకుముందు ‘దిల్‌వాలే దుల్హానియా లే జాయేంగే’,‘దస్‌ కహానియా’ వంటి చిత్రాల్లో నటించి  గుర్తింపు పొందింది. అంతేకాకుండా 2003, 2007 ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లకు, ఛాంపియన్స్ ట్రోఫీల‌తో పాటు ఐపీఎల్-2కు క్రికెట్‌ ప్రెజంటర్‌గా వ్యవహారించింది.

చదవండి: మరచిపోవడానికి జ్ఞాపకం కాదు.. ఆయనే నా జీవితం: మందిర

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement