కొంతమంది క్రికెట్ విశ్లేషకుల వల్ల తాను నిద్రలేని రాత్రులు గడిపానంటోంది నటి, యాంకర్ మందిర బేడి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 2003 వరల్డ్ కప్ సమయంలో క్రికెట్ ఎక్స్‌పర్ట్‌తో కలిసి పని చేశాను. కానీ అదంత ఈజీ కాదు. ఎందుకంటే వారి ప్యానెల్‌లో అమ్మాయిలు ఉండేవారే కాదు. కొత్తగా ఒక అమ్మాయి వస్తుందంటే కూడా వాళ్లేమీ ఎగ్జయిట్ అవలేదు.
నాకంత అవగాహన లేదు
నేను అడిగే ప్రశ్నలను కొన్నిసార్లు పట్టించుకునేవారే కాదు. క్రికెట్‌పై వారికున్నంత అవగాహన నాకు ఉండేది కాదు. నేను కాస్త పిచ్చి ప్రశ్నలడిగేదాన్ని. చాలామంది క్రికెట్ ప్రియులకు కూడా ఇలాంటి ప్రశ్నలే వారి బుర్రకు తట్టి ఉండొచ్చు. కాబట్టి ఇవి అడగడంలో తప్పేముందని అనుకునేదాన్ని. నా మనసుకు ఏది అడగాలనిపిస్తే అది మొహమాటం లేకుండా అడిగేదాన్ని. కొన్నిసార్లు లైవ్‌లోనే వాళ్లు నా ప్రశ్నకు సమాధానం ఇచ్చేవారు కాదు. పట్టించుకోనట్లు ఉండేవారు.
అవమానంతో తల దించుకున్నా..
షో అయిపోయాక అవమాన భారంతో తల దించుకుని ఏడ్చేదాన్ని. అసలు ఏం చేయాలి? ఎలాంటి ప్రశ్నలు అడగాలి? అనేది ఎవరూ చెప్పలేదు, ఒక్కరూ సపోర్ట్‌గా నిలబడలేదు. వారం రోజులు భయపడుతూనే హోస్టింగ్ చేశాను. మధ్యమధ్యలో తడబడేదాన్ని. నాతో పాటు ఉండే మేల్ హోస్ట్ చక్కగా వారితో కలిసిపోయేవాడు. ఒక వారం తర్వాత ఛానల్ నిర్వాహకుల నుంచి పిలుపొచ్చింది. నన్ను తీసేస్తారేమో అనుకున్నాను.
నా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే
వాళ్లేమో షో అంతా బోరింగ్‌గా ఉంది.. కాస్త జోష్ తీసుకురా అని చెప్పారు. అప్పుడు నేను నా విధానాన్ని మార్చుకున్నాను. భయాన్ని వదిలేశాను. నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పి తీరాలని గట్టిగా అడిగేదాన్ని. వారం రోజుల నరకం తర్వాత నేను మామూలయ్యాను. అందరితోనూ సరదాగా కలిసిపోయాను. ఒకసారి టైగర్ పఠౌడీ స్టూడియోకు వచ్చినప్పుడు.. అందరూ మాట్లాడుకుంటున్న మందిరా బేడి మీరే కదా అని అడిగాడు' అంటూ ఆనాటి సంగతులను గుర్తు చేసుకుంది.
సినిమాల్లోనూ..
కాగా మందిరా బేడి ఛాంపియన్స్ ట్రోఫీ (2004 & 2006)తో పాటు ఐపీఎల్ రెండో సీజన్‌కు, 2007 వరల్డ్ కప్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. మందిర బేడీ.. యాంకర్‌గా, నటిగా ఫేమస్. ఈమె మన్మథ మూవీలో సైకియాట్రిస్ట్‌గా, సాహోలో కల్కిగా నటించింది. హిందీలో అనేక సినిమాలు చేసిన ఆమె స్మోక్, రోమిల్ అండ్ జుగల్, ఖుబూల్ హై 2, సిక్స్ వంటి వెబ్ సిరీస్‌లలో కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment