Mandira Bedi Husband Raj Kaushal Last Post Goes Viral - Sakshi
Sakshi News home page

Mandira Bedi: వీకెండ్‌లో భార్య, స్నేహితులతో రాజ్‌ కౌశల్‌ సందడి

Published Wed, Jun 30 2021 5:48 PM | Last Updated on Wed, Jun 30 2021 6:50 PM

Mandira Bedi Husband Raj Kaushal Last Instagram Post Fun With Friends - Sakshi

ప్రముఖ నటి, యాంకర్‌ మందిరా బేడి భర్త, నిర్మాత రాజ్‌ కౌశల్‌ ఇవాళ గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో బాలీవుడ్‌ ప్రముఖులు, సినీ నటీనటులు ఆయన మృతికి నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో రాజ్‌ కౌశల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన చివరి పోస్టు వైరల్‌గా మారింది. ఈ ఆదివారం వీకెండ్‌ సందర్భంగా ఆయన స్నేహితులు, భార్య మందిర బేడీతో సందడి చేసినట్లు కౌశల్‌ తన చివరి పోస్టులో రాసుకొచ్చారు. ఇది చూసి ఆయన ఫాలోవర్స్‌, స్నేహితులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

కాగా గత ఆదివారం మాజీ క్రికెటర్‌ జహీర్‌ ఖాన్‌ ఆయన భార్య  సాగరిక ఘాట్కే, నటి నేహా దూపియా, అంగద్‌ బేడి, భార్య మందిరా బేడిలతో కలిసి ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ ‘సూపర్‌ సండే, సూపర్‌ ఫ్రెండ్స్‌, సూపర్‌ ఫన్‌’ అంటూ షేర్‌ చేశారు. అది చూసి ‘మూడు రోజుల క్రితమే స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపిన కౌశల్‌ ఇలా మృత్యువాత పడటం తీవ్రం కలచివేస్తోంది’, ‘ఇదే ఆయన చివరి పోస్టు అని తలచుకుంటే కన్నీరు ఆగడం లేదు’ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ఇదే ఫొటోను నేహా దూపియా షేర్‌ చేస్తూ భావోద్యేగానికి లోనయ్యారు.

‘రాజ్‌ ఈ ఫొటోను మనం ఎప్పటికి గుర్తుండిపోయే జ్ఞాపకం గుర్తుగా తీసుకున్నాము. కానీ నువ్వు మా మధ్య ఎప్పటికి ఉండవనే విషయాన్ని నమ్మలేకపోతున్నా’ అంటూ మై స్ట్రాంగ్‌ లేడీ, ఈ సమయంలో నిన్ను ఓదార్చడానికి నాకు మాటలు రావడం లేదంటూ మందిరా, ఆమె కుమారుడు వీర్‌, కూతురు తారాలను ఉద్దేశిస్తూ తన పోస్టులో రాసుకొచ్చారు. అదే విధంగా రాజ్‌ కౌశల్‌ తన కుమారుడు వీర్‌, కూతురు తారాలతో పాటు మిగిలిన కుటుంబ సభ్యులతో ఎంజాయ్‌ చేసిన కౌశల్‌ పోస్టులు కూడా ఈ సందర్భంగా వైరల్‌ అవుతున్నాయి. 

చదవండి: 
Mandira Bedi: ప్రముఖ నటి మందిరా బేడి భర్త కన్నుమూత 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement