అభిమానులకు షాకిచ్చిన నటి
సీనియర్ నటి, మోడల్ మందిరా బేడీ హాట్‌హాట్ ఫొటోలతో అభిమానులకు స్వీట్ షాకిచ్చారు. హాలిడే కోసం శ్రీలంక వెళ్లిన ఆమె.. అక్కడ సేదతీరుతున్నప్పటి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. వైరల్‌గా మారిన ఆ ఒక్కో ఫొటోలు ఒక్కొక్కటీ 50 వేలు తగ్గకుండా లైక్స్‌తోపాటు వందలకొద్దీ షేర్స్ వచ్చాయి.
కొన్నాళ్లుగా మీడియాకు దూరమైపోయిన ఈ 45ఏళ్ల నటి.. ఒక్కసారే ఇలా సోషల్ మీడియాలో దర్శనమివ్వడం సర్వత్రా చర్చనీయాంశమైంది. భర్త రాజ్ కౌశల్, ఐదేళ్ల కొడుకుతో సహా మందిరా బేడి శ్రీలంకలో పర్యటించారు.
శాంతి సీరియల్‌తో ప్రారంభమైన మందిరా బేడి కెరీర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో తారాస్థాయికి చేరింది. ఇండియాలో స్పోర్ట్స్ యాంకర్ల రివాజును పూర్తిగా మార్చేసిన ఘనత మందిరకే దక్కుతుంది. బాలీవుడ్‌తోపాటు పలు భాషల సినిమాల్లోనూ ప్రతిభచాటుకున్న బేడి.. ఫిట్‌నెస్ రంగంలోనూ రాణించారు. గతంలోనూ తన భర్త, కొడుకుతో కలిసి మందిర దిన ఫొటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.