ప్రభాస్‌ను మందిరా బేడీ ఓ... పొగిడేస్తోంది! అట్లా ఇట్లా కాదు. ఓ లెవల్లో మొత్తం బాలీవుడ్‌ని జల్లెడేసి పట్టినా ప్రభాసంతటోడు లేడనేసింది. మందిర అన్నదని కాదు కానీ, ప్రభాస్‌కి ‘బాహుబలి’ భలే కలిసొచ్చింది. అప్పటి దాకా మనోడి హైట్ సదరన్ పీక్ అయితే ఇప్పుడు నార్త్ రాష్ట్రాలు కూడా మెడలెత్తి చూస్తున్నాయి.
ఇంతకీ మందిరకి ప్రభాస్ అంతగా ఎప్పుడు నచ్చాడంటే... ‘సాహో’ షూటింగ్‌లో. మూడు భాషల్లో తీస్తున్న ‘సాహో’లో మందిరా బేడీ కూడా నటిస్తోంది. రోజూ సాహో బాహుబలి అంటూ ప్రభాస్ ప్రస్తావన తెచ్చి మరీ సన్మాన సభ పెట్టేస్తోందట. ప్రభాస్ సౌత్‌లోనే కాదు... నార్త్ మందిరంలో కూడా ప్లేస్ కొట్టేశాడన్నమాట?!
Comments
Please login to add a commentAdd a comment