
దేశంలో అతి పెద్ద రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (Star Health Insurance) 2024 డిసెంబర్ 31తో ముగిసిన తొమ్మిది నెలలకు గాను తమ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. కంపెనీ ఈ తొమ్మిది నెలల వ్యవధిలో రూ. 645 కోట్ల లాభం (PAT) నమోదు చేసింది.
2025 ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల కాలంలో (9MFY25) ఆర్థికంగా, నిర్వహణపరంగా స్టార్ హెల్త్ స్థిరమైన పనితీరును సాధించింది. కంపెనీ కంబైన్డ్ నిష్పత్తి 101.8%గా, క్లెయిమ్స్ నిష్పత్తి 70.66%గా నమోదయ్యాయి. వ్యయ నిష్పత్తి 31.18 శాతంగా ఉంది. పెట్టుబడులపై ఆదాయం రూ. 996 కోట్లుగా ఉంది. అదే సమయంలో కంపెనీ పెట్టుబడులు పెట్టిన అసెట్స్ విలువ 15 శాతం పెరిగి రూ. 16,666 కోట్లకు చేరుకుంది.
“టెక్నాలజీని ఉపయోగించుకుని, పటిష్టమైన భాగస్వామ్యాలను పెంపొందించుకోవడం ద్వారా ఆరోగ్య బీమా ప్రతి ఒక్కరికి సులభతరంగా, అందుబాటులో ఉండేలా చూడాలనేది మా లక్ష్యం. ఆరోగ్య సంరక్షణ విషయంలో భారతదేశ పురోభివృద్ధికి తోడ్పడుతూ, ఆరోగ్య బీమా వ్యవస్థను పటిష్టం చేస్తూ, 2047 నాటికి అందరికీ బీమా ఉండాలన్న ఐఆర్‌డీఏఐ చైర్మన్ విజన్‌ను సాకారం చేసే దిశగా, దేశీయంగా బీమా విషయంలో నెలకొన్న అంతరాలను తగ్గించేందుకు కృషి చేస్తున్నాం” అని స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో ఆనంద్ రాయ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment