
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలోని సంగమ తీరంలో నిర్వహిస్తున్న కుంభమేళాకు కోట్లాదిగా భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని ప్రతిపక్ష నేతలు ప్రభుత్వానికి పలు సవాళ్లు సంధిస్తున్నారు. వీటికి సీఎం యోగి ఆదిత్యనాథ్ సమాధానమిచ్చారు. మహాకుంభమేళా యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోందని, కోట్లాదిమంది తరలివస్తున్నారని, ఈ నేపధ్యంలో ప్రయాగ్‌రాజ్, కాశీ, అయోధ్యలను కూడా దర్శిస్తున్నారని సీఎం పేర్కొన్నారు.
‘యువ పారిశ్రామికవేత్తలతో సంభాషణ’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ మహాకుంభమేళాపై విమర్శలు గుప్పిస్తున్నవారు.. ఈ భారీ కార్యక్రమం కారణంగా రాష్ట్రానికి భారీగా ఆదాయం సమకూరుతున్నదని గ్రహించాలన్నారు. మహాకుంభమేళా నిర్వహణకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సంయుక్తంగా రూ. 7,500 కోట్లు ఖర్చు చేస్తున్నాయని, ఫలితంగా రాష్ట్రానికి మూడు లక్షల కోట్లకుపైగా ఆదాయం రానున్నదనే అంచనాలున్నాయన్నారు.
కుంభమేళా సందర్భంగా అయోధ్య, ప్రయాగ్‌రాజ్, కాశీ, చిత్రకూట్, గోరఖ్‌పూర్, నైమిశారణ్యంలో పలు వసతులు కల్పించామని సీఎం అన్నారు. ఒక్క ఏడాదిలో అయోధ్యకు కానుకలు, విరాళాల రూపంలో రూ. 700 కోట్లు సమకూరాయన్నారు. మహాకుంభమేళాలో ఫిబ్రవరి 17 నాటికి మొత్తం రూ.54 కోట్ల 31 లక్షల మంది పుణ్యస్నానాలు చేశారన్నారు. మహాకుంభమేళా ఫిబ్రవరి 26(శివరాత్రి) వరకూ కొనసాగనుంది.
ఇది కూడా చదవండి: Railway Station Stampede: రద్దీ నియంత్రణకు మూడు విధానాలు
Comments
Please login to add a commentAdd a comment