ప్రముఖ కార్ల కంపెనీ టెస్లా అధినేత ఎలన్ మస్క్ (49) అరుదైన ఘనతను సాధించారు. అపర కుబేరుడు బిల్‌గేట్స్‌ను అధిమించి మరీ ప్రపంచంలో రెండవ అతిపెద్ద ధనవంతుడిగా దూసుకు వచ్చారు. ప్రపంచ అపర కుబేరుల్లో ఒకరైన మస్క్ సంపద 127.9 బిలియన్ డాలర్లకు చేరింది. అతని నికర విలువ 7.2 బిలియన్ డాలర్లు పుంజుకోగా, బిల్‌గేట్స్ ఆదాయం 127.7 బిలియన్ డాలర్లుగా ఉంది. మస్క్‌కు చెందిన టెస్లా స్టాక్ సోమవారం ట్రేడింగ్‌లో దాదాపు 6.58 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 521.85 డాలర్లకు చేరింది. ఇదే అత్యధిక సింగిల్-డే లాభాలకు కారణమైంది. అతని మరో కంపెనీ స్పేస్ ఎక్స్ మార్కెట్ వ్యాల్యూ 500 బిలియన్లకు చేరడం విశేషం.
ఈ ఏడాది జనవరి నుండి తన నికర విలువ 100 బిలియన్ల డాలర్లకు పైగా ఎగిసింది. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న 500 మంది ధనవంతులలో ఒకరిగా నిలిచాడు. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ రెండవస్థానం కంటే కిందికి పడిపోవడం బ్లూమ్‌బెర్గ్ ఇండెక్స్ ఎనిమిదేళ్ల చరిత్రలో ఇది రెండవసారి. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్బెజోస్ 2017లో గేట్స్‌ను అధిగమించి ప్రపంచంలోని అత్యంత ధనవంతుడుగా నిలిచారు. అంతుకుముందు వరకు బిల్‌గేట్స్ రిచెస్ట్ పర్స్‌న్‌గా నిలుస్తూ వచ్చారు. ప్రస్తుతం బెజోస్ 182 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోని సంపన్న వ్యక్తిగా అగ్రస్థానంలో ఉన్నారు. ఈ ఏడాది అతని నికర విలువ 67 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. కాగా బిల్ గేట్స్ తన సంపాదనంలో ఏటా కొంత భాగాన్ని డొనేషన్లకు ఇస్తారు. 2006 నుంచి ప్రతి ఏటా 27 బిలియన్ డాలర్లను నేమ్‌సేక్ ఫాండేషన్‌కు గేట్స్ ఛారిటీగా ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment