Richest Persons
-
ఫోర్బ్స్ జాబితా ప్రకారం తెలుగు రాష్ట్రాల్లోని కోటీశ్వరులు (ఫొటోలు)
-
ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుల జాబితా (ఫొటోలు)
-
సౌత్ ఇండియాలో రిచ్చెస్ట్ హీరో ఆయనే.. ఆస్తులు ఎన్ని వేల కోట్లంటే
సౌత్ ఇండియాలో స్టార్ హీరోలు చాలా మందే ఉన్నారు. వారికి అభిమానులు కూడా అదే రేంజ్లో ఉంటారు. కొందరు సినిమా హీరోలను పూజిస్తారు కూడా. ముఖ్యంగా చిరంజీవి, రజనీకాంత్, మోహన్‌లాల్ వంటి అత్యంత విజయవంతమైన నటులు చాలా మందే ఉన్నారు. ఇండస్ట్రీలోని కొంతమంది హీరోల సినిమాలకు అత్యంత ప్రజాదరణ పొందడం వల్ల వారు భారీగానే లాభపడుతారు. అంతే కాకుండా ఇతర వ్యాపార ప్రకటనల ద్వారా కూడా వారికి భారీగానే రెమ్యునరేషన్ వస్తుంది . అయితే సౌత్ ఇండియాలోని అందరి హీరోల్ల సంపదను సరిచూస్తే ఈయన టాప్‌లో ఉంటారు. దక్షిణ భారతదేశంలోనే అత్యంత సంపన్న నటుడు నాగార్జున అక్కినేని, గత మూడు దశాబ్దాలుగా అత్యంత విజయవంతమైన తెలుగు స్టార్ హీరోల్లో ఒకరు. గతంలో ఆయన కొన్ని హిందీ చిత్రాలలో కూడా కనిపించాడు. సినిమాలే కాకుండా ఇతర వ్యాపార ప్రకటనల ద్వారా భారీగానే అర్జించారని సమాచారం. అంతే కాకుండా ఆయన పలు వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇలా ఆయన నికర ఆస్తుల విలువ సుమారు రూ. 3000 కోట్ల రూపాయలని నివేదించబడింది. జూమ్ టీవీ నివేదిక 2022 ప్రకారం అతని నికర విలువ రూ. 3010 కోట్లకు పైగా ఉందని, సౌత్ ఇండియాలోని హీరోల్లో అత్యంత ధనవంతుడిగా నాగార్జునేనని ఆ నివేదిక పేర్కొంది. దక్షిణ భారతదేశంలో అత్యంత ధనవంతులైన నటులు దక్షిణ భారతదేశంలో అత్యంత సంపన్న నటుల జాబితాలో నాగార్జున అగ్రస్థానంలో ఉండగా, ఇతర సూపర్ స్టార్ల సంపద కూడా వందల కోట్లలోనే ఉంది. నాగార్జున సమకాలీనులైన వెంకటేష్, చిరంజీవి నికర విలువ రూ.2200 కోట్లు, రూ.1650 కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ రూ.1370 కోట్ల రూపాయలతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇతర సూపర్ రిచ్ సౌత్ స్టార్లలో జూనియర్ ఎన్టీఆర్ (రూ. 450 కోట్లు), దళపతి విజయ్ (రూ. 445 కోట్లు), రజనీకాంత్ (రూ. 430 కోట్లు), కమల్ హాసన్ (రూ. 388 కోట్లు), మోహన్ లాల్ (రూ. 376 కోట్లు), అల్లు అర్జున్ (రూ. 350) ఉన్నారు. ఇవన్నీ జూమ్ టీవీ నివేదిక 2022 ప్రకారం మాత్రమే ఉన్నాయని గమనించగలరు. (ఇదీ చదవండి: శోభన ఇంట్లో చోరీ.. పనిమనిషి వేడుకోవడంతో ఆమె నిర్ణయానికి ఫ్యాన్స్ ఫిదా) -
గౌతమ్ అదానీ మరో ఘనత: బిజినెస్ మాగ్నెట్లకు షాకిచ్చి మరీ
సాక్షి, ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ప్రపంచంలోనే మూడో అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. ఫ్రాన్స్‌కు చెందిన వ్యాపారదిగ్గజం బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను అధిగమించి మరీ ప్రపంచ కుబేరుల సరసన చోటు సంపాదించడం విశేషం. అత్యంత సంపన్నుల జాబితాలో మూడో స్థానాన్ని సాధించిన తొలి ఆసియా వ్యక్తిగా రికార్డును తన ఖతాలో వేసుకున్నారు. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ, చైనాకు చెందిన జాక్ మా, సంపన్నుల జాబితాలో నిలిచినప్పటికీ ఎప్పుడూ మొదటి మూడు స్థానాలకు చేరుకోలేదు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఆసియాకు చెందిన వ్యక్తి మొదటి మూడు స్థానాల్లోకి ప్రవేశించడం ఇదే తొలిసారి. 137.4 బిలియన్ల డాలర్ల మొత్తం నికర విలువతో, 60 ఏళ్ల అదానీ, సంపదలో లూయిస్ విట్టన్ ఛైర్మన్ ఆర్నాల్ట్‌ను అధిగమించారు. అంతేకాదు ఈ ర్యాంకింగ్‌లో బిజినెస్ మాగ్నెట్ ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్‌ల సమీపంలోకి వచ్చారు. ప్రస్తుతం టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ నికర విలువ వరుసగా 251 బిలియన్ డాలర్లు, 153 బిలియన్ డాలర్లుగా ఉంది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను అధిగమించి గౌతమ్ అదానీ ఇప్పుడు ప్రపంచంలోని మూడవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. కాగా ఈ ఇండెక్స్‌లో ముఖేశ్ అంబానీ మొత్తం 91.9 బిలియన్ల డాలర్లతో 11వ స్థానంలో ఉన్నారు. దేశీయంగా అదానీ గ్రూప్ రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్ తర్వాత మూడో అతిపెద్ద వ్యాపారసంస్థగా ఉంది. ఒక్క 2022 లోనే అదానీ సంపద 60.9 బిలియన్ డాలర్లు పెరిగింది. మిగిలిన బిలియనీర్లతో పోలిస్తే ఇది ఐదు రెట్లు ఎక్కువ. ఫలితంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలి ఆసియా కుబేరుడిగా ముఖేశ్ అంబానీని దాటేశారు. ఆ తరువాత ఏప్రిల్‌లో సెంట్ బిలియనీర్ అయ్యారు. గతనెలలో మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ అధినేత బిల్‌గేట్స్‌ను తలదన్ని ప్రపంచంలో నాల్గవ సంపన్న వ్యక్తిగా నిలిచిన సంగతి తెలిసిందే. -
‘హురూన్’ సంపన్నుల్లో మనోళ్లు 69 మంది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ ఇండియా సంపన్నుల జాబితా–2021లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి 69 మంది చోటు సంపాదించారు. వీరందరి సంపాదన రూ.3,79,200 కోట్లు. గతేడాదితో పోలిస్తే ఇది 54 శాతం వృద్ధి. కొత్తగా 13 మంది ఈ లిస్ట్‌లో చేరారు. మొత్తం జాబితాలో ఇద్దరు మహిళలు ఉన్నారు. అయితే ఔషధ తయారీ రంగం నుంచే 21 మంది ఉండడం విశేషం. రూ.1,000 కోట్లు, ఆపైన సంపద కలిగిన వ్యక్తులతో ఈ జాబితాను రూపొందించారు. వీరిలో హైదరాబాద్ నుంచి 56 మంది, రంగారెడ్డి నుంచి నలుగురు, విశాఖపట్నం నుంచి ముగ్గురు ఉన్నారు. సెపె్టంబర్ 15 నాటికి బిలియన్ డాలర్లకుపైగా సంపద కలిగిన వారి సంఖ్య ఏడాదిలో 9 నుంచి 15కు చేరింది. రూ.79,000 కోట్లతో దివీస్ ల్యా»ొరేటరీస్ వ్యవస్థాపకులు మురళి దివి, ఆయన కుటుంబం తొలి స్థానంలో నిలిచింది. పదేళ్ల క్రితం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ లిస్ట్‌లో ముగ్గురు మాత్రమే నమోదయ్యారు. ఈ ఏడాది జాబితాలో పేరు దక్కించుకున్న వారిలో మొదటి అయిదు స్థానాల్లో జి.అమరేందర్‌రెడ్డి, కుటుంబం, వెంకటేశ్వర్లు జాస్తి, కుటుంబం, ఏ.ప్రతాప్ రెడ్డి (బాలాజీ అమైన్స్), దాసరి ఉదయ్‌కుమార్ రెడ్డి (తాన్లా ప్లాట్‌ఫామ్స్), అనిల్ కుమార్ చలమలశెట్టి (గ్రీన్కో), మహేశ్ కొల్లి(గ్రీన్కో) ఉన్నారు. -
మస్క్ దూకుడు: మరోసారి బిల్ గేట్స్‌కు షాక్
ప్రముఖ కార్ల కంపెనీ టెస్లా అధినేత ఎలన్ మస్క్ (49) అరుదైన ఘనతను సాధించారు. అపర కుబేరుడు బిల్‌గేట్స్‌ను అధిమించి మరీ ప్రపంచంలో రెండవ అతిపెద్ద ధనవంతుడిగా దూసుకు వచ్చారు. ప్రపంచ అపర కుబేరుల్లో ఒకరైన మస్క్ సంపద 127.9 బిలియన్ డాలర్లకు చేరింది. అతని నికర విలువ 7.2 బిలియన్ డాలర్లు పుంజుకోగా, బిల్‌గేట్స్ ఆదాయం 127.7 బిలియన్ డాలర్లుగా ఉంది. మస్క్‌కు చెందిన టెస్లా స్టాక్ సోమవారం ట్రేడింగ్‌లో దాదాపు 6.58 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 521.85 డాలర్లకు చేరింది. ఇదే అత్యధిక సింగిల్-డే లాభాలకు కారణమైంది. అతని మరో కంపెనీ స్పేస్ ఎక్స్ మార్కెట్ వ్యాల్యూ 500 బిలియన్లకు చేరడం విశేషం. ఈ ఏడాది జనవరి నుండి తన నికర విలువ 100 బిలియన్ల డాలర్లకు పైగా ఎగిసింది. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న 500 మంది ధనవంతులలో ఒకరిగా నిలిచాడు. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ రెండవస్థానం కంటే కిందికి పడిపోవడం బ్లూమ్‌బెర్గ్ ఇండెక్స్ ఎనిమిదేళ్ల చరిత్రలో ఇది రెండవసారి. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్‌బెజోస్ 2017లో గేట్స్‌ను అధిగమించి ప్రపంచంలోని అత్యంత ధనవంతుడుగా నిలిచారు. అంతుకుముందు వరకు బిల్‌గేట్స్ రిచెస్ట్ పర్స్‌న్‌గా నిలుస్తూ వచ్చారు. ప్రస్తుతం బెజోస్ 182 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోని సంపన్న వ్యక్తిగా అగ్రస్థానంలో ఉన్నారు. ఈ ఏడాది అతని నికర విలువ 67 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. కాగా బిల్ గేట్స్ తన సంపాదనంలో ఏటా కొంత భాగాన్ని డొనేషన్లకు ఇస్తారు. 2006 నుంచి ప్రతి ఏటా 27 బిలియన్ డాలర్లను నేమ్‌సేక్ ఫాండేషన్‌కు గేట్స్ ఛారిటీగా ఇస్తున్నారు. -
తొలిసారి 100 బిలియన్ డాలర్లకు సంపద
షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్ రీల్స్(Reels)ను యూఎస్ మార్కెట్లో ప్రవేశపెట్టడంతో గురువారం సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ షేరు జోరందుకుంది. ఏకంగా 6.5 శాతం జంప్‌చేసింది. 265 డాలర్ల ఎగువన ముగిసింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. దీంతో ఫేస్బుక్లో 13 శాతం వాటా కలిగిన మార్క్ జుకర్‌బర్గ్ వ్యక్తిగత సంపద తొలిసారి 100 బిలియన్ డాలర్లను తాకింది. వెరసి 100 బిలియన్ డాలర్లకుపైగా సంపద కలిగిన ప్రపంచ కుబేరుల జాబితాలో జెఫ్ బెజోస్(అమెజాన్), బిల్‌గేట్స్(మైక్రోసాఫ్ట్) సరసన నిలిచారు. టిక్‌టాక్‌కు చెక్ ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్ అయిన చైనీస్ యాప్ టిక్‌టాక్‌కు చెక్ పెడుతూ షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్ రీల్స్‌ను ఫేస్బుక్ బుధవారం యూఎస్ మార్కెట్లో విడుదల చేసింది. దీంతో గురువారం షేరు దూసుకెళ్లింది. కాగా.. ఈ ఏడాది అమెరికా స్టాక్ మార్కెట్లు ర్యాలీ బాటలో సాగుతున్న సంగతి తెలిసిందే. గురువారం యూఎస్ మార్కెట్లలో తొలిసారి నాస్డాక్ 11,000 పాయింట్ల మార్క్‌ను దాటి ముగిసింది. ఇందుకు టెక్ దిగ్గజాలు దన్నుగా నిలుస్తున్నాయి. జోరు తీరిలా ఈకామర్స్ దిగ్గజం అమెజాన్, ఐఫోన్ల దిగ్గజం యాపిల్, ఆటో టెక్నాలజీ కంపెనీ టెస్లా తదితరాలు ఈ ఏడాది(2020) అనూహ్య ర్యాలీ చేస్తున్న విషయం విదితమే. దీంతో 2020లో ఇప్పటివరకూ అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సంపద 75 బిలియన్ డాలర్లకుపైగా ఎగసింది. ఈ బాటలో జుకర్‌బర్గ్ సంపద సైతం 22 బిలియన్ డాలర్లమేర బలపడింది. తద్వారా ఎలైట్ క్లబ్లో జుకర్‌బర్గ్ చోటు సాధించారు. కాగా.. ఇదే విధంగా దేశీ పారిశ్రామిక దిగ్గజం.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సంపద సైతం 22 బిలియన్ డాలర్లమేర పుంజుకోవడం గమనార్హం! దీంతో ముకేశ్ సంపద 80 బిలియన్ డాలర్లను అధిగమించింది. ఇందుకు ప్రధానంగా డిజిటల్, టెలికం విభాగం రిలయన్స్ జియోలోకి విదేశీ పెట్టుబడులు భారీగా ప్రవహించడం కారణమైనట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
2033 నాటికి ముకేశ్ సంపద.. లక్ష కోట్ల డాలర్లు!
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం, దేశీ కుబేరుడు ముకేశ్ అంబానీ మరో దశాబ్ద కాలంలో ట్రిలియనీరుగా ఎదగనున్నారు. 2033 నాటికి 75 ఏళ్ల వయసులో.. ఏకంగా 1 లక్ష కోట్ల (ట్రిలియన్) డాలర్ల సంపదతో ట్రిలియనీర్ల జాబితాలో చోటు దక్కించుకోనున్నారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ గణాంకాల ప్రకారం ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముకేశ్ సంపద ప్రస్తుతం సుమారు 53.7 బిలియన్ డాలర్లుగా ఉంది. వివిధ వ్యాపారాలపై తులనాత్మక అధ్యయనం చేసే కంపేరిజన్ సంస్థ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2026 నాటికి అమెరికన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ తొలి ట్రిలియనీర్ హోదా అందుకోనున్నారు. 145 బిలియన్ డాలర్ల సంపదతో జెఫ్ బెజోస్ ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా చలామణీ అవుతున్నారు. గడిచిన అయిదేళ్లలో ఆయన సంపద సగటున 34 శాతం మేర పెరిగింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నులు, సంపన్న కంపెనీల చారిత్రక వేల్యుయేషన్లను అధ్యయనం చేయడం ద్వారా ఎవరు, ఎప్పుడు ట్రిలియన్ డాలర్ల క్లబ్లో చేరతారనేది కంపేరిజన్ అంచనా వేసింది. రెండో ట్రిలియనీర్‌గా చైనా రియల్టర్.. జెఫ్ బెజోస్ తర్వాత చైనాకు చెందిన రియల్ ఎస్టేట్ దిగ్గజం జు జియాయిన్ 2027 నాటికి ప్రపంచంలోనే రెండో ట్రిలియనీరుగా ఎదగనున్నారు. అప్పటికాయన వయసు 75 ఏళ్లు ఉంటుంది. ఇక చైనాకే చెందిన మరో దిగ్గజ సంస్థ ఆలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా, సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ తదితరులు కూడా వచ్చే దశాబ్దం, దశాబ్దన్నర కాలంలో ట్రిలియనీర్ల లిస్టులో చోటు దక్కించుకోనున్నారు. కంపేరిజన్ మొత్తం 25 మంది కుబేరులపై అధ్యయనం చేయగా, ఇటీవలి కాలంలో వారి సంపద వృద్ధి రేటును బట్టి చూస్తే.. కేవలం 11 మందే తమ జీవితకాలంలో ట్రిలియనీర్లుగా మారే అవకాశాలు ఉన్నాయి. న్యూయార్క్ స్టాక్ ఎక్సే్చంజీలో అత్యధిక మార్కెట్ క్యాపిటలైజేషన్ గల 25 లిస్టెడ్ కంపెనీలు, ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన 25 మంది వ్యక్తులకు సంబంధించి గత అయిదేళ్ల డేటాను కంపేరిజన్ పరిగణనలోకి తీసుకుంది. గత అయిదేళ్లలో సంపద వృద్ధి చెందిన తీరు ఆధారంగా రాబోయే సంవత్సరాల్లో పెరుగుదలను లెక్కగట్టడం ద్వారా .. ట్రిలియనీర్ల జాబితాపై ఒక అంచనా రూపొందించే ప్రయత్నం చేసింది. -
ఆసియా కుబేరుడు అంబానీ
న్యూఢిల్లీ: సోషల్ మీడియా సైట్ ఫేస్‌బుక్‌తో డీల్ నేపథ్యంలో పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తాజాగా మళ్లీ ఆసియా కుబేరుల జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్నారు. డీల్ వార్తల కారణంగా రిలయన్స్ షేరు ఒక్కసారిగా ఎగియడంతో అంబానీ సంపద 4.7 బిలియన్ డాలర్ల మేర పెరిగి 49.2 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో చైనా దిగ్గజం ఆలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మాను అధిగమించి అంబానీ అగ్రస్థానం దక్కించుకున్నారు. జాక్ మా కన్నా అంబానీ సంపద 3.2 బిలియన్ డాలర్లు అధికంగా ఉంది. సంపన్నుల సంపదకు కొలమానంగా పరిగణించే బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ ద్వారా ఈ విషయాలు వెల్లడయ్యాయి. రిలయన్స్‌లో భాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఫేస్బుక్ సుమారు 10 శాతం వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. బుధవారానికి ముందు ఈ ఏడాది ఇప్పటిదాకా అంబానీ సంపద 14 బిలియన్ డాలర్ల మేర కరిగిపోయింది. డాలర్ల మారకంలో చూస్తే ఆసియాలో అత్యధికంగా నష్టపోయినది ముకేశ్ అంబానీయే. కానీ, ఫేస్బుక్ డీల్ కలిసి వచ్చి రిలయన్స్ షేరు పుంజుకోవడంతో మళ్లీ ఆసియా కుబేరుల్లో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు. -
మళ్లీ ము‘క్యాష్’ కింగ్..!
ముంబై: భారత్‌లో అత్యంత సంపన్నునిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ కొనసాగుతున్నారు. ఆయన సంపద రూ.3,80,700 కోట్లు. తాజా ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా 2019 రిచ్ లిస్ట్ ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ జాబితాలో వరుసగా ఎనిమిదేళ్ల నుంచీ ఆయనదే అగ్రస్థానం. ఇక ఈ జాబితాలో రెండవ స్థానంలో లండన్ కేంద్రంగా ఉంటున్న ఎస్పీ హిందూజా అండ్ ఫ్యామిలీ నిలిచింది. వీరి సంపద రూ.1,86,500 కోట్లు. రూ.1,17,100 కోట్ల విలువతో విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీ మూడవ స్థానంలో ఉన్నారు. తాజా ఆవిష్కృత జాబితాలో ముఖ్యాంశాలు చూస్తే... ► రూ.1,000 కోట్లు పైబడిన సంపద ఉన్న భారతీయుల సంఖ్య 2019లో 953కు పెరిగింది. 2018లో ఈ సంఖ్య 831 మాత్రమే. ► అమెరికా డాలర్ల రూపంలో చూస్తే, బిలియనీర్ల సంఖ్య 141 నుంచి 138కి పడింది. డాలరుతో రూపాయి విలువ లెక్కన రూ.7,000 కోట్ల సంపద పైబడిన వారిని బిలియనీర్లుగా పరిగణిస్తారు. ► రూ.1,000 కోట్లు పైబడిన మొత్తం 953 మందిని తీసుకుంటే, వీరిలో మొదటి 25 మంది మొత్తం సంపద స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 10 శాతం. మొత్తం అందరినీ పరిగణనలోకి తీసుకుంటే మాత్రం జీడీపీలో ఈ విలువ 27 శాతం. ► సంపన్నుల సంపద 2018తో పోల్చితే 2% పెరిగింది. 344 మంది వ్యక్తుల సంపద తగ్గింది. ► మొత్తం సంపన్నుల్లో 246 మందితో (జాబితాలో 26%) ముంబై టాప్‌లో ఉంది. 2, 3 స్థానాల్లో న్యూఢిల్లీ(175), బెంగళూరు(77) ఉన్నాయి. ► సంపన్నులకు సంబంధించి 82 మంది ప్రవాస భారతీయులను తీసుకుంటే, వారిలో 76 మంది స్వశక్తితో పైకి వచ్చినవారు ఉన్నారు. ఎన్ఆర్ఐలకు ఈ విషయంలో అత్యంత ప్రాధాన్యతా దేశంగా అమెరికా ఉంది. యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, బ్రిటన్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ► స్వశక్తితో సంపన్నులైన వారిలో అత్యంత యువకుడు రితేష్ అగర్వాల్ (25). ఓయో అధిపతి∙అగర్వాల్ సంపద రూ.7,500 కోట్లు. ► జాబితాలో 152 మంది మహిళలు కూడా ఉన్నారు. వీరి సగటు వయసు 56 సంవత్సరాలు. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ రోష్నీ నాడార్ (37) మొదటి స్థానంలో నిలిచారు. భారత్‌లో స్వయం శక్తిగా సంపన్నురాలిగా ఎదిగిన మహిళల జాబితాలో బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా ఉన్నారు. ఆమె సంపద రూ.18,500 కోట్లు. వృద్ధిలో వీరి పాత్ర కీలకం... ప్రపంచ వృద్ధిలో సంపద సృష్టికర్తలు కీలకపాత్ర పోషిస్తున్నారు. భారత్ ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి కేంద్రం వృద్ధి వ్యూహాలు రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఐదేళ్లలో భారత్ సంపన్నుల జాబితా మూడింతలు పెరుగుతుందని భావిస్తున్నాం. –అనాన్ రెహ్మాన్ జునైడ్, హురున్ రిపోర్ట్ ఇండియా ఎండీ, చీఫ్ రెసెర్చర్ వేగం పుంజుకుంటున్న భారత్ భారత్ వృద్ధి వేగం పుంజుకుంటోంది. దీనికి యువ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల మద్దతు ఎంతో ఉంది. దేశంలో సంపద నిర్వహణ సామర్థ్యం ఎంతో మెరుగుపడుతోంది. – యతిన్ షా, ఐఐఎఫ్ఎల్ వెల్త్ మేనేజ్మెంట్ కో–ఫౌండర్ తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు బిలియనీర్లు హురున్ భారతీయ కుబేరుల జాబితా (బిలియనీర్లు)లో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు చోటు దక్కించుకున్నారు. అరబిందో ఫార్మా చైర్మన్ పీవీ రాంప్రసాద్ రెడ్డి రూ.14,800 కోట్ల సంపదతో దేశంలోని 100 మంది కుబేరుల్లో 51వ స్థానంలో నిలిచారు. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(ఎంఈఐఎల్) చైర్మన్ పి.పిచ్చిరెడ్డి 57వ స్థానంలో, ఎంఈఐఎల్ ఎండీ పీవీ కృష్ణారెడ్డి 63వ ర్యాంకును చేజిక్కించుకున్నారు. జాబితాలో దివి సత్చంద్ర కిరణ్ 83వ స్థానం, నీలిమ మోటపర్తి 89వ స్థానాన్ని దక్కించుకున్నారు. పి.పిచ్చిరెడ్డి, పీవీ కృష్ణారెడ్డి కాగా, దేశంలోని టాప్–10 మహిళా కుబేరుల జాబితాలో దివీస్ ల్యాబ్స్‌కు చెందిన నీలిమ 8వ ర్యాంకులో నిలిచారు. ఇక స్వశక్తితో వ్యాపారవేత్తలుగా ఎదిగిన అత్యంత పిన్న వయస్కుల్లో(40 ఏళ్ల లోపు) విజయవాడకు చెందిన 33 ఏళ్ల శ్రీహర్ష మాజేటి చోటు సంపాదించారు. స్విగ్గీ సహ ప్రమోటర్ శ్రీహర్ష సంపద విలువను హురున్ రూ.1,400 కోట్లుగా లెక్కగట్టింది. మొత్తం సంపన్నుల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు 68 మంది,(గతేడాది 49), ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు 9 మంది(గతేడాది 6) ఉన్నట్లు హురున్ వెల్లడించింది. గోపిచంద్ హిందూజా, శ్రీచంద్ హిందూజా, అజీం ప్రేమ్‌జీ రాంప్రసాద్‌రెడ్డి, దివి సత్చంద్ర కిరణ్, నీలిమ, శ్రీహర్ష మాజేటి -
ప్రపంచ సంపన్నుల్లో ముకేశ్ అంబానీ పదో స్థానం
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ సంపద పరంగా ప్రపంచంలో టాప్–10కు చేరుకున్నారు. ఆయన సంపద విలువ 54 బిలియన్ డాలర్లు (రూ.3.83 లక్షల కోట్లు) అని హురూన్ ప్రపంచ సంపన్నుల జాబితా 2019 వెల్లడించింది. ముకేశ్ తమ్ముడు అనిల్ అంబానీ మాత్రం తన నికర విలువలో 65 శాతాన్ని కోల్పోయినట్టు ఈ నివేదిక తెలిపింది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఈ జాబితాలో వరుసగా రెండో ఏడాది మొదటి స్థానంలో ఉన్నారు. ఆయన సంపద 147 బిలియన్ డాలర్లు. ఇక హురూన్ ప్రపంచ సంపన్నుల జాబితాలో భారత్ ఐదో స్థానానికి జారినట్టు నివేదిక పేర్కొంది. రిలయన్స్ షేరు ఇటీవలి కాలంలో ర్యాలీ చేయడంతో మార్కెట్ విలువ పెరిగిన విషయం తెలిసిందే. కంపెనీలో ముకేశ్ అంబానీకి 52 శాతం వాటా ఉంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ రూ.7.73 లక్షల కోట్ల దగ్గర ఉంది. మరోవైపు అనిల్ అంబానీ నెట్‌వర్త్ ఏడు సంవత్సరాల క్రితం 7 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంటే ఈ ఏడాది 1.9 బిలియన్ డాలర్లకు పడిపోయింది. రిలయన్స్ గ్రూపు వ్యాపారాలను సోదరులు ఇద్దరూ పంచుకున్న సమయంలో ఇరువురి కంపెనీల మార్కెట్ విలువ ఇంచుమించు ఒకే స్థాయిలో ఉన్న విషయం తెలిసిందే. ‘‘కుటుంబ సంపదను విభజించిన తర్వాత ఇద్దరూ ఒకే స్థాయిలో ప్రయాణం ఆరంభించగా.. ముకేశ్ అంబానీ గడిచిన ఏడేళ్ల కాలంలో 30 బిలియన్ డాలర్ల మేర తన సంపదను పెంచుకున్నారు. కానీ, అనిల్ మాత్రం ఇదే కాలంలో 5 బిలియన్ డాలర్లను కోల్పోయారు’’ అని హరూన్ నివేదిక వివరించింది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ 96 బిలియన్ డాలర్లు, బెర్క్‌షైర్ హాత్వే చైర్మన్ వారెన్ బఫెట్ 88 బిలియన్ డాలర్లు, ఎల్వీఎంహెచ్ బెర్నార్డ్ ఆర్నాల్డ్ 84 బిలియన్ డాలర్లు, ఫేస్బుక్ జుకెర్‌బర్గ్ 80 బిలియన్ డాలర్లతో టాప్ 5లో ఉన్నారు. భారత్‌లో కుబేరులు... ఈ జాబితాలో చోటు సంపాదించుకున్న భారత కుబేరుల్లో... తొలి స్థానంలో ముకేశుడు ఉండగా, హిందుజా గ్రూపు చైర్మన్ ఎస్పీ హిందుజా 21 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచారు. మూడో స్థానంలో ఉన్న విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ సంపద 17 బిలియన్ డాలర్లుగా ఉంది. పూనవాలా గ్రూపు (సెరమ్ ఇనిస్టిట్యూట్) చైర్మన్ సైరస్ ఎస్ పూనవాలా 13 బిలియన్ డాలర్ల సంపదతో నాలుగో స్థానంలో ఉన్నారు. ఆయన ప్రపంచంలోని టాప్–100 సంపన్నుల్లోకి చేరినట్టు హరూన్ జాబితా తెలిపింది. ఆర్సెలర్ మిట్టల్ అధిపతి లక్ష్మీ నివాస్ మిట్టల్ ఐదో స్థానంలో, కోటక్ మహింద్రా ఉదయ్ కోటక్ (11 బిలియన్ డాలర్లు), గౌతం అదానీ (9.9 బిలియన్ డాలర్లు), సన్‌ఫార్మా దిలీప్ సంఘ్వి(9.5 బిలియన్ డాలర్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. సైరస్ పల్లోంజి మిస్త్రీ, షాపూర్జీ పల్లోంజీ మిస్త్రీ ఉభయుల సంపద 9.5 బిలియన్ డాలర్ల చొప్పున ఉండగా, ఇరువురు 9, 10వ స్థానాల్లో నిలిచారు. టాటాగ్రూపులో వీరికి 18.4 శాతం వాటా ఉండడం సంపద వృద్ధికి కలిసొచ్చింది. మహిళా‘మణు’లు గోద్రేజ్ కుటుంబంలో మూడో తరానికి చెందిన స్మితా కృష్ణ మహిళా బిలియనీర్లలో టాప్‌లో ఉన్నారు. ఆమె సంపద 6.1 బిలియన్ డాలర్లు. బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా 3.5 బిలియన్ డాలర్లతో హరూన్ జాబితా లో 671వ స్థానంలో ఉన్నారు. సొంతంగా సంపద సృష్టిం చుకున్న మహిళామణిగా ఆమెను హరూన్ పేర్కొంది. 5వ స్థానానికి జారిన భారత్ ‘‘2012 నుంచి చూస్తే భారత్ మొదటిసారిగా హరూన్ ప్రపంచ సంపన్నుల జాబితాలో ఐదో స్థానానికి దిగజారింది. రూపాయి బలహీనత, స్టాక్ మార్కెట్ కాంతిహీనంగా ఉండటం దీనికి కారణం’’ అని హరూన్ రిపోర్ట్ ఇండియా ఎండీ అనాస్ రెహ్మాన్ జునైద్ తెలిపారు. జీ గ్రూపు సుభాష్‌చంద్ర, సన్‌టీవీ కళానిధి మారన్‌లకు ఈ ఏడాది ప్రతికూల సంవత్సరమని, వీరిద్దరూ గణనీయంగా సంపద కోల్పోయారని పేర్కొంది. 2018తో పోలిస్తే ఈ ఏడాది జాబితాలో సంపన్నుల సంఖ్య 224 తగ్గి 2,470కు చేరింది. ఈ 2,470 మంది ఉమ్మడి సంపద విలువ 9.5 లక్షల కోట్ల డాలర్లు. ప్రపంచ జీడీపీలో 12%కి సమానం. -
ఐటీ కుబేరుల్లోని భారతీయులు వీరే!
ప్రపంచ కుబేరుల జాబితాను ఫోర్బ్స్ శనివారం విడుదల చేసింది. గత కొద్ది సంవత్సరాల నుంచి మొదటి స్థానంలో ఉంటున్న మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తిరిగి తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఫోర్బ్స్ జాబితాలో టాప్ తొమ్మిది భారతీయ ఐటీ బిలియనీర్లు వీళ్లే.. 1. అజీమ్ ప్రేమ్ జీ ఆస్తులు: 15 బిలియన్ డాలర్లు ప్రపంచ ర్యాంకు: 55 విప్రో కంపెనీ స్థాపించిన ప్రేమ్ జీ భారతదేశంలో మూడో అతిపెద్ద సాఫ్ట్ వేర్ దిగ్గజంగా ఎదిగారు. అంతేకాకుండా స్నాప్ డీల్, మింత్రా, పాలసీ బజార్, సీయానోజెన్ వంటి కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టారు. 2. శివ్ నాడార్ ఆస్తులు:11.1 బిలియన్ డాలర్లు ప్రపంచ ర్యాంకు: 88 హెచ్ సీఎల్ సంస్థను స్థాపించిన శివ్ నాడార్ భారత సాఫ్ట్ వేర్ దిగ్గజాల్లో నాలుగో స్థానంలో ఉన్నారు. శివ నాడార్ ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సాయం చేస్తున్నారు. 3. నారాయణ మూర్తి ఆస్తులు: 1.9 బిలియన్ డాలర్లు ప్రపంచర్యాంకు:959 ఇన్ఫోసిస్ కంపెనీ సహవ్యవస్థాపకుడిగా ఉన్న నారాయణ మూర్తి భారత సాఫ్ట్ వేర్ కంపెనీల్లో రెండో పెద్ద కంపెనీగా ఇన్ఫీని నిలిపారు. 1981 నుంచి 2002 వరకు సీఈవోగా 2002 నుంచి 2011 వరకు చైర్మన్ గా పనిచేశారు. కాటమారన్ పేరుతో ప్రారంభించిన ప్రైవేట్ ఇన్వెస్ట్ మెంట్ వెంచర్ తో ఏభీ, హెక్టార్ బేవరేజెస్, ఇన్నోవిటీ, కవర్ ఫాక్స్ లలో పెట్టుబడులు పెట్టారు. అమెజాన్ ఇండియాలో అతిపెద్ద అమ్మకం దారుగా ఉన్న క్లౌడ్ టెయిల్ కూడా నారాయణస్వామిదే. 4. క్రిస్ గోపాలక్రిష్ణన్ ఆస్తులు: 1.6 బిలియన్ డాలర్లు ప్రపంచర్యాంకు:1121 ఇన్ఫోసిస్ లో సహవ్యవస్థాపకుడిగా ఉన్న క్రిస్ 2007 నుంచి 2011 వరకు సంస్థ సీఈవో గా పనిచేశారు. బెంగళూరులో రూ.225 కోట్లతో సెంటర్ ఫర్ బ్రెయిన్ రీసెర్చ్ ని నిర్మించారు. 5. నందన్ నిలేకని ఆస్తులు: 1.6 బిలియన్ డాలర్లు ప్రపంచ ర్యాంకు:1121 ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడిగా ఉన్న నందన్ 2002 నుంచి 2007 వరకు సీఈవో గా పనిచేశారు. కంపెనీ చేపట్టిన యూఐఎఐ కు 2014 వరకు చైర్మన్ గా ఉన్నారు. ప్రస్తుతం ఏక్ స్టెప్ చైర్మన్ గా సేవలందిస్తున్నారు. టీమ్ ఇండస్, ఫోర్టిగో, మబుల్, జగ్గర్ నాట్, లెట్స్ వెంచర్, పవర్ 2 ఎస్ఎమ్ఈ, సిస్టం యాంటిక్స్ తదితర కంపెనీలకు వెన్నుదన్నుగా నిలిచారు. 6. బిన్నీ బన్సల్ ఆస్తులు: 1.2 బిలియన్ డాలర్లు ప్రపంచ ర్యాంకు:1476 భారతదేశపు అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ను స్థాపించిన వారిలో బిన్నీ బన్సల్ కూడా ఒకరు. 2016 జనవరిలో ఆయన సంస్థ సీఈవో గా పగ్గాలు చేపట్టారు. 7. సచిన్ బన్సల్ ఆస్తులు: 1.2 బిలియన్ డాలర్లు ప్రపంచ ర్యాంకు: 1476 సచిన్ బన్సల్ ఫ్లిప్ కార్ట్ ను స్థాపించిన సహవ్యవస్థాపకుల్లో ఈయన కూడా ఒకరు. 2016 జనవరి వరకు కంపెనీ సీఈవో గా పనిచేశారు. అథర్ ఎనర్జీ, ఇన్ షార్ట్స్, ట్రాక్సన్, టినీస్టెప్ తదితర కంపెనీలను ప్రోత్సహించారు. 8. కే దినేశ్ ఆస్తులు: 1.2 బిలియన్ డాలర్లు ప్రపంచ ర్యాంకు:1476 ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడిగా ఉన్న దినేశ్ 1981 నుంచి 2011 వరకు బోర్డు మెంబర్లలో ఒకరిగా పనిచేశారు. 2011లో డిజైన్ గ్రూప్ నుంచి పదవీవిరమణ చేశారు. 9. ఎస్ డీ షీబూలాల్ ఆస్తులు: 1.1 బిలియన్ డాలర్లు ప్రపంచర్యాంకు: 1577 ఇన్ఫోసిస్ సహవ్యవస్థపకులైన ఎస్ డీ షిబూలాల్ 2011 నుంచి 2014 వరకు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేశారు. యాక్సిలర్ వెంచర్స్ పేరుతో క్రిస్ గోపాలన్ తో ఇంక్యూబేటర్ సెంటర్ ను ప్రారంభించారు. -
సంపన్నుల జాబితాలో ఆరో స్థానంలో జుకర్‌బర్గ్