సౌత్ ఇండియాలో స్టార్ హీరోలు చాలా మందే ఉన్నారు. వారికి అభిమానులు కూడా అదే రేంజ్‌లో ఉంటారు. కొందరు సినిమా హీరోలను పూజిస్తారు కూడా. ముఖ్యంగా చిరంజీవి, రజనీకాంత్, మోహన్‌లాల్ వంటి అత్యంత విజయవంతమైన నటులు చాలా మందే ఉన్నారు. ఇండస్ట్రీలోని కొంతమంది హీరోల సినిమాలకు అత్యంత ప్రజాదరణ పొందడం వల్ల వారు భారీగానే లాభపడుతారు. అంతే కాకుండా ఇతర వ్యాపార ప్రకటనల ద్వారా కూడా వారికి భారీగానే రెమ్యునరేషన్ వస్తుంది . అయితే సౌత్ ఇండియాలోని అందరి హీరోల్ల సంపదను సరిచూస్తే ఈయన టాప్‌లో ఉంటారు.
దక్షిణ భారతదేశంలోనే అత్యంత సంపన్న నటుడు
నాగార్జున అక్కినేని, గత మూడు దశాబ్దాలుగా అత్యంత విజయవంతమైన తెలుగు స్టార్ హీరోల్లో ఒకరు. గతంలో ఆయన కొన్ని హిందీ చిత్రాలలో కూడా కనిపించాడు. సినిమాలే కాకుండా ఇతర వ్యాపార ప్రకటనల ద్వారా భారీగానే అర్జించారని సమాచారం. అంతే కాకుండా ఆయన పలు వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇలా ఆయన నికర ఆస్తుల విలువ సుమారు రూ. 3000 కోట్ల రూపాయలని నివేదించబడింది. జూమ్ టీవీ నివేదిక 2022 ప్రకారం అతని నికర విలువ రూ. 3010 కోట్లకు పైగా ఉందని, సౌత్ ఇండియాలోని హీరోల్లో అత్యంత ధనవంతుడిగా నాగార్జునేనని ఆ నివేదిక పేర్కొంది.
దక్షిణ భారతదేశంలో అత్యంత ధనవంతులైన నటులు
దక్షిణ భారతదేశంలో అత్యంత సంపన్న నటుల జాబితాలో నాగార్జున అగ్రస్థానంలో ఉండగా, ఇతర సూపర్ స్టార్ల సంపద కూడా వందల కోట్లలోనే ఉంది. నాగార్జున సమకాలీనులైన వెంకటేష్, చిరంజీవి నికర విలువ రూ.2200 కోట్లు, రూ.1650 కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ రూ.1370 కోట్ల రూపాయలతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇతర సూపర్ రిచ్ సౌత్ స్టార్లలో జూనియర్ ఎన్టీఆర్ (రూ. 450 కోట్లు), దళపతి విజయ్ (రూ. 445 కోట్లు), రజనీకాంత్ (రూ. 430 కోట్లు), కమల్ హాసన్ (రూ. 388 కోట్లు), మోహన్ లాల్ (రూ. 376 కోట్లు), అల్లు అర్జున్ (రూ. 350) ఉన్నారు. ఇవన్నీ జూమ్ టీవీ నివేదిక 2022 ప్రకారం మాత్రమే ఉన్నాయని గమనించగలరు.
(ఇదీ చదవండి: శోభన ఇంట్లో చోరీ.. పనిమనిషి వేడుకోవడంతో ఆమె నిర్ణయానికి ఫ్యాన్స్ ఫిదా)
Comments
Please login to add a commentAdd a comment