South Indian actors
-
సౌత్ ఇండియాలో రిచ్చెస్ట్ హీరో ఆయనే.. ఆస్తులు ఎన్ని వేల కోట్లంటే
సౌత్ ఇండియాలో స్టార్ హీరోలు చాలా మందే ఉన్నారు. వారికి అభిమానులు కూడా అదే రేంజ్లో ఉంటారు. కొందరు సినిమా హీరోలను పూజిస్తారు కూడా. ముఖ్యంగా చిరంజీవి, రజనీకాంత్, మోహన్‌లాల్ వంటి అత్యంత విజయవంతమైన నటులు చాలా మందే ఉన్నారు. ఇండస్ట్రీలోని కొంతమంది హీరోల సినిమాలకు అత్యంత ప్రజాదరణ పొందడం వల్ల వారు భారీగానే లాభపడుతారు. అంతే కాకుండా ఇతర వ్యాపార ప్రకటనల ద్వారా కూడా వారికి భారీగానే రెమ్యునరేషన్ వస్తుంది . అయితే సౌత్ ఇండియాలోని అందరి హీరోల్ల సంపదను సరిచూస్తే ఈయన టాప్‌లో ఉంటారు. దక్షిణ భారతదేశంలోనే అత్యంత సంపన్న నటుడు నాగార్జున అక్కినేని, గత మూడు దశాబ్దాలుగా అత్యంత విజయవంతమైన తెలుగు స్టార్ హీరోల్లో ఒకరు. గతంలో ఆయన కొన్ని హిందీ చిత్రాలలో కూడా కనిపించాడు. సినిమాలే కాకుండా ఇతర వ్యాపార ప్రకటనల ద్వారా భారీగానే అర్జించారని సమాచారం. అంతే కాకుండా ఆయన పలు వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇలా ఆయన నికర ఆస్తుల విలువ సుమారు రూ. 3000 కోట్ల రూపాయలని నివేదించబడింది. జూమ్ టీవీ నివేదిక 2022 ప్రకారం అతని నికర విలువ రూ. 3010 కోట్లకు పైగా ఉందని, సౌత్ ఇండియాలోని హీరోల్లో అత్యంత ధనవంతుడిగా నాగార్జునేనని ఆ నివేదిక పేర్కొంది. దక్షిణ భారతదేశంలో అత్యంత ధనవంతులైన నటులు దక్షిణ భారతదేశంలో అత్యంత సంపన్న నటుల జాబితాలో నాగార్జున అగ్రస్థానంలో ఉండగా, ఇతర సూపర్ స్టార్ల సంపద కూడా వందల కోట్లలోనే ఉంది. నాగార్జున సమకాలీనులైన వెంకటేష్, చిరంజీవి నికర విలువ రూ.2200 కోట్లు, రూ.1650 కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ రూ.1370 కోట్ల రూపాయలతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇతర సూపర్ రిచ్ సౌత్ స్టార్లలో జూనియర్ ఎన్టీఆర్ (రూ. 450 కోట్లు), దళపతి విజయ్ (రూ. 445 కోట్లు), రజనీకాంత్ (రూ. 430 కోట్లు), కమల్ హాసన్ (రూ. 388 కోట్లు), మోహన్ లాల్ (రూ. 376 కోట్లు), అల్లు అర్జున్ (రూ. 350) ఉన్నారు. ఇవన్నీ జూమ్ టీవీ నివేదిక 2022 ప్రకారం మాత్రమే ఉన్నాయని గమనించగలరు. (ఇదీ చదవండి: శోభన ఇంట్లో చోరీ.. పనిమనిషి వేడుకోవడంతో ఆమె నిర్ణయానికి ఫ్యాన్స్ ఫిదా) -
రికార్డు రెమ్యూనరేషన్: ఈ రికార్డ్ సాధించిన తొలి హీరో ఎవరో తెలుసా?
ప్రపంచంలో అత్యంత లాభదాయకమైనచలనచిత్ర పరిశ్రమగా ఇండియన్ సినిమాలు దూసుకుపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అభిమానుల మనసు దోచుకుంటూ, బాక్సీఫీసు వద్ద వేల కోట్ల రాబడులను సాధిస్తున్నాయి. ఇటివల కొన్ని దశాబ్దాలుగా సూపర్ స్టార్లు అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్, ప్రభాస్, జూ.ఎన్టీఆర్, రాంచరణ్, మహేష్ బాబు, విజయ్, రజనీకాంత్ లాంటి హీరోలు సినిమాకు వన్నెతెచ్చారనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రేక్షకుల్లో భారీ క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటూ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఈ ఫీజు కొన్నిసార్లు సినిమా మొత్తం బడ్జెట్‌ను మించిపోతోందంటే వీరి క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే బాలీవుడ్లో సౌత్ ఇండియాలో సినిమాకు 100కోట్ల రూపాయలకుపైగా వసూలు చేస్తున్న టాప్ స్లార్లు చాలామందే ఉన్నారు. ఆశ్చర్యకరంగా బాలీవుడ్ బిగ్ స్టార్ల కంటే ఎక్కువ వసూలు చేస్తున్న నటుడు ఎవరో తెలుసా? సల్మాన్, షారూఖ్, అక్షయ్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ కాకుండా సినిమాకి 200 కోట్లు వసూలు చేసిన తొలి భారతీయ యాక్టర్‌గా కోలీవుడ్ స్టార్ హీరో రికార్డ్ క్రియేట్ చేశాడని టాక్. (అపుడు తప్పింది..ఇపుడు మింగేసింది: పాకిస్తాన్ టైకూన్ విషాద గాథ) తమిళ సూపర్ స్టార్ విజయ్ దళపతి ఇప్పుడు భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరో. తాజా నివేదికల ప్రకారం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ లియో సినిమాకు రూ. 200 కోట్లు వసూలు చేశాడట. దీనిపై ఇంకా పూర్తి ధృవీకరణ రానప్పటికీ హైయ్యస్ట్ పెయిడ్ హీరో అని టాక్ హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. విజయ్ 2021లో వచ్చిన 'మాస్టర్' సినిమాకు 80 కోట్లు, బీస్ట్, వారసుడు సినిమాలకు 100 కోట్లు వసూలు చేశాడని టాక్. తాజాగా దీన్ని రెట్టింపు చేశాడన్నట్టు. 48 ఏళ్ల విజయ్ 27 సంవత్సరాల క్రితం తన నటుడిగా పరిచయం అయ్యాడు. సుమారు 66 చిత్రాలలో ప్రధాన పాత్రల్లో అభిమానులను అలరించాడు స్నేహితులు, కుటుంబ సభ్యులు ప్రేమగా 'జో' అని పిలుచుకునే విజయ్ దళపతి స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. (రూ. 13 కోట్ల ఆస్తులను కొనుగోలు చేసిన సుహానా ఖాన్) విజయ్ ప్రస్తుతం ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రూపొందుతున్న లియో సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గ్యాంగ్‌స్టర్-థ్రిల్లర్ మూవీ లియోలో విజయ్ సరసరన త్రిష కృష్ణన్ నటిస్తోంది. అంతేకాదు ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇంకా ప్రియా ఆనంద్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, యాక్షన్ కింగ్ అర్జున్, మాథ్యూ థామస్ తదితరులు నటిస్తున్నారు. 49వ పుట్టినరోజు సందర్భంగా లియో టీమ్ విజయ్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో దళపతి విజయ్ నటిస్తున్న లియో మూవీ ఫస్ట్ లుక్ అదిరి పోవడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. అలాగే 'దళపతి 68'లో వెంకట్ ప్రభుతో కలిసి వర్క్ చేస్తున్నాడు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టుపై పూర్తి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. -
ప్రముఖ హీరోయిన్ ఇంట్లో చోరీ.. పోలీసులకు ఫిర్యాదు
బుజ్జిగాడు హీరోయిన్ సంజన గల్రానీ చెల్లెలు నిక్కీ గల్రానీ కోలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'డార్లింగ్', 'వెలయిన్ను వందుట్టా వెల్లైక్కారన్', 'కడవుల్ ఇరుక్కన్ కుమారు', 'మొట్ట శివ కెట్ట శివ', 'హరహర మహాదేవకి', 'మరగత నానయం' వంటి తమిళ చిత్రాలతో చాలా పాపులర్ అయింది. జనవరి 11న తన దగ్గర పనిచేసే 19 ఏళ్ల యువకుడు ధనుష్‌పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది నిక్కీ. చెన్నై రాయపేటలోని నిక్కీ గల్రానీ ఇంట్లో పని చేస్తున్నాడు ధనుష్. ఈ క్రమంలో నిక్కీకి చెందిన బట్టలు, ఖరీదైన కెమెరా కనిపించలేదు. ఈ సంఘటన తర్వాత ధనుష్ పరారీలో ఉండటంతో అతనే దొంగతనం చేసినట్లుగా భావించి పోలీస్‌లకు ఫిర్యాదు చేసింది. ధనుష్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కోరింది నిక్కీ. (చదవండి: ఆ హీరో ఇంట్లో విషాదం.. అతనే సర్వస్వం అంటూ ఎమోషనల్) రంగంలోకి దిగిన పోలీసులు ధనుష్ తిరుపూర్‌లోని తన స్నేహితుడి ఇంట్లో దాక్కున్నట్లు గుర్తించారు. సోమవారం తిరుపూర్‌లో ధనుష్‌ను అరెస్టు చేసి, అతను దొంగలించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం ధనుష్‌ను చైన్నైకి తీసుకొచ్చారు పోలీసులు. అనంతరం దుస్తులు, కెమెరాను తిరిగి నిక్కీ గల్రానీకి అప్పగించారు. దీంతో నిక్కీ తన ఫిర్యాదు ఉపసంహరించుకున్నట్లు తెలిపింది. ధనుష్‌పై తదుపరి చర్యలు తీసుకోవద్దని కోరినట్లు సమాచారం. ఎందుకంటే తన వస్తువులు తనకు తిరిగి దొరికాయన్న సంతృప్తి చాలని నిక్కీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆ వస్తువుల విలువ సుమారు రూ. లక్షకుపైగా ఉంటుందని అంచనా. (చదవండి: ప్రభాస్ తర్వాత స్థానంలో అల్లు అర్జున్.. దేనిలో అంటే ?) -
అసలేంటీ గోల్డెన్ వీసా.. ఇప్పటివరకు వీసా పొందిన సెలబ్రిటీలు
What Is UAE Golden Visa And Celebrities Who Got It: వివిధ రంగాల్లో అంటే కళలు, క్రియేటివిటీ పరిశ్రమలు, సాహిత్యం, కల్చర్, విద్య, వారసత్వ సంపద చరిత్ర గురించి అధ్యయనం చేసేవాళ్లు, సేవలు అందిస్తున్న వాళ్లకు యూఏఈ (దుబాయ్) ప్రభుత్వం గోల్డెన్ వీసాను జారీ చేస్తుంది. దీని ద్వారా ఆ దేశంలో దీర్ఘకాలికంగా ఎలాంటి పరిమితులు లేకుడా స్వేచ్ఛగా నివాసం ఉండేందుకు వీలు కలుగుతుంది. 2019 నుంచి ఈ గోల్డెన్ వీసాలు మంజూరు చేస్తుందీ యూఏఈ ప్రభుత్వం. ఇందులో భాగంగా విదేశీయులకు నివాసం, పనిచేసుకోవడం, అధ్యయనానికి ఎలాంటి స్పాన్సర్షిప్ అవసరం లేకుండా చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. అలాగే వందశాతం ఓనర్‌షిప్‌తో ఆ దేశంలో సొంతంగా వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు. ఇక యూఏఈ ఇచ్చే ఈ లాంగ్‌టర్మ్ వీసాకు 10, 5 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. తర్వాత దానికదే రెన్యూవల్ అవుతుంది. ఈ గోల్డెన్ వీసాను తాజాగా టాలీవుడ్ నుంచి మెగా కోడలు ఉపాసన అందుకుంది. యూఏఈ ప్రభుత్వం జారీ చేసే ఈ వీసాను ఇండియా నుంచి మొదటగా బాద్ షా షారుఖ్ ఖాన్ దక్కించుకున్నాడు. తర్వాత బాలీవుడ్లో సంజయ్ దత్, సునీల్ శెట్టి, సింగర్స్ సోనూ నిగమ్, నెహా కక్కర్, బుల్లితెర హాట్ బ్యూటీ మౌనీ రాయ్, ఫరా ఖాన్, దివంగత నటి శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్‌తో పాటు బోనీ కపూర్ కుటుంబం ఈ వీసా పొందింది. ఈ వీసాను సాధించిన హీరోయిన్ త్రిష.. తొలి తమిళ కథానాయికగా అవతరించింది. తర్వాత అమలా పాల్‌ను కూడా గోల్డెన్ వీసా వరించింది. వీరితో పాటు మలయాళ ఇండస్ట్రీ నుంచి మొదటగా మోహన్ లాల్ తర్వాత మమ్ముట్టి, టోవినో థామస్, దుల్కర్ సల్మాన్ కూడా ఈ వీసాను పొందారు. స్పోర్ట్స్‌కు చెందిన సానియా మీర్జా-షోయబ్ మాలిక్ దంపతులకు దుబాయ్ గోల్డెన్ వీసా దక్కింది. వీరే కాకుండా ఒడిషాకు చెందిన ఆర్టిస్ట్ మోనా విశ్వరూప మోహంతీకి కూడా ఈ దుబాయ్ గోల్డెన్ వీసా దక్కింది. ఇదీ చదవండి: మెగా కోడలికి గోల్డెన్ వీసా.. గ్లోబల్ సిటిజన్‌గా ఉపాసన -
తగ్గేదే లే అంటూనే తగ్గారు.. ఎందులో తగ్గారో తెలుసా ?
Celebrities Weight Loss Transformation Story: తగ్గేదే లే అంటున్నారు.. కానీ తగ్గారు. మరి.. ఏ విషయంలో తగ్గేదే లే అంటే.. నటనపరంగా తగ్గేదే లే అంటూ విజృంభిస్తున్నారు. ఏ విషయంలో తగ్గారు అంటే.. బరువు తగ్గారు. సినీ సెలబ్రిటీలకు అందంతోపాటు ఫిట్నెస్ కూడా ఎంతో ముఖ్యం. అందుకే వయసు పెరిగినా ఫిట్నెస్ మాత్రం కచ్చితంగా పాటిస్తారు కొందరు సినీ తారలు. అందంగా ఆరోగ్యంగా ఉండటానికి ‘ఫిట్ అండ్ ఫైన్’ అంటున్నారు. సీనియర్ తారలు జయసుధ, ఖుష్బూ, ప్రభు బాగా బరువు తగ్గి కొత్త లుక్‌లోకి మారిపోయారు. ఆ లుక్‌ని ఓ లుక్కేద్దాం. ‘‘నవ్వండి.. ఉచితంగా లభించే మంచి థెరపీ అది’’ అంటున్నారు జయసుధ. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి ఫామ్‌లో ఉన్న ఆమె బరువు తగ్గాక సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేసి, ఈ విధంగా పేర్కొన్నారు. కొన్ని నెలలుగా అమెరికాలో ఉంటున్న ఈ సహజ నటి అక్కడే బరువు తగ్గే పనిలో పడ్డట్లున్నారు. మామూలుగా సినిమా తారలు బరువు తగ్గితే ఏదైనా పాత్ర కోసం అనుకుంటారు. కానీ ఫిట్‌నెస్‌లో భాగంగానే ఆమె తగ్గారు. పైగా బరువు తగ్గే క్రమంలో ఆమె శాకాహారానికి కూడా మారారని తెలుస్తోంది. ఎందుకంటే ‘వీగన్ ఫుడ్ ట్రై చేద్దాం’ అని ట్వీట్ చేశారు. ఇక ఫిట్‌నెస్‌లో భాగంగానే తగ్గిన మరో తార ఖుష్బూ విషయానికొస్తే.. ఆ మధ్య 15 కిలోలు బరువు తగ్గానంటూ ఓ ఫొటో షేర్ చేశారామె. తాజాగా వెయిట్ మిషన్‌పై నిలబడి చూసుకుని, మరో ఐదు కిలోలు తగ్గానోచ్ అన్నారు. అంటే.. మొత్తం 20 కిలోలు తగ్గించేశారు. ఇలా తగ్గడంవల్ల ఆమె ఆరోగ్యం బాగాలేదని కొందరు అనుకున్నారట. ‘‘నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ఎక్కడ అనారోగ్యానికి గురయ్యానో అని కొందరు ఆందోళన పడ్డారు. నా పట్ల వారికున్న అభిమానానికి ధన్యవాదాలు. అసలు నేనింత ఫిట్‌గా ఎప్పుడూ లేను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా. దాన్ని దృష్టిలో పెట్టుకునే తగ్గాను. ఈ విషయంలో నేను పది మందికి ఆదర్శంగా నిలిస్తే విజయం సాధించినట్లే’’ అన్నారు ఖుష్బూ. ఈ బ్యూటీ కథానాయికగా మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు ప్రభు సరసన కొన్ని సినిమాల్లో నటించారు. 1990లలో ఈ ఇద్దరిదీ ‘హిట్ పెయిర్’. విశేషం ఏంటంటే.. ఇప్పుడు ప్రభు కూడా తగ్గారు. ఖుష్బూలానే ఆయన కూడా 20 కిలోలు వెయిట్ లాస్ అయ్యారు. అయితే ఫిట్‌నెస్‌లో భాగంగా తగ్గలేదు. మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ‘పొన్నియిన్ సెల్వన్’ కోసం తగ్గారని కోలీవుడ్ టాక్. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభు కీలక పాత్ర చేస్తున్నారట. ఈ పాత్రలో స్లిమ్ లుక్‌లో కనిపించాల్సి రావడంతో వెయిట్ తగ్గినట్లు తెలుస్తోంది. క్యారెక్టర్ కోసమో, ఫిట్నెస్ గురించో సీనియర్లు ఇలా తగ్గడం చూసి ‘భేష్.. నటన విషయంలోనే కాదు... తగ్గే విషయంలో కూడా మీరు ఆదర్శమే’ అని కొందరు యువతారలు అంటున్నారు. అభిమానులైతే ఖుషీ అయిపోతున్నారు. -
తెరపైకి బిస్కెట్ కింగ్ బయోపిక్.. ప్రధాన పాత్రలో ఎవరంటే ?
Prithviraj Sukumaran New Web Series On Biscuit King Rajan Pillai: వెండితెరపై ప్రముఖుల జీవిత చరిత్రలు బయోపిక్‌లుగా వచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. డర్టీ పిక్చర్ సినిమా నుంచి స్కామ్ 1992 వెబ్ సిరీస్ వరకు ఎన్నో జీవితగాథలు తెరపై, ఓటీటీల్లో సందడి చేశాయి. తాజాగా 'బిస్కెట్ కింగ్'గా పేరొందిన రాజన్ పిళ్లై జీవితం ఆధారంగా బాలీవుడ్లో ఓ వెబ్ సిరీస్ రానుంది. ఈ సిరీస్‌లో మలయాళీ దర్శకుడు, నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. పృథ్వీరాజ్ దర్శకుడిగా బాలీవుడ్లో చేస్తున్న తొలి ప్రాజెక్టు ఇది. పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన ఆయన మోహన్ లాల్ హీరోగా నటించిన 'లూసీఫర్' (మలయాళం) చిత్రంతో దర్శకుడిగా మారారు. ఈ సినిమాను తెలుగులో చిరంజీవి హీరోగా 'గాడ్ ఫాదర్' పేరుతో రీమేక్‌గా మోహన్ రాజా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పృథ్వీరాజ్ నటించిన మలయాళ చిత్రం 'అయ్యప్పనుమ్ కోశియమ్' సూపర్ హిట్ అయింది. ఇదే సినిమాను పవన్ కల్యాణ్, రానా హీరోలుగా భీమ్లా నాయక్‌గా తెలుగులో ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజన్ పిళ్లై ఒక వ్యాపారవేత్త. బ్రిటానియా ఇండస్ట్రీలో వాటాదారు. 1970లో సింగపూర్ కేంద్రంగా తన వ్యాపారాన్ని కొనసాగించి బిస్కెంట్ కింగ్‌గా ఎదిగారు. 1993లో సింగపూర్ వాణిజ్య వ్యవహారాల శాఖ అతనిపై విచారణ చేపట్టింది. సింగపూర్ ప్రభుత్వ సమాచారం మేరకు భారత పోలీసులు 1995 జూలై 4న కొత్త ఢిల్లీలోని ఓ హోటల్లో అరెస్ట్ చేశారు. అనంతరం తీహార్ జైలుకు పంపించారు. అనారోగ్యంతో రాజన్ పిళ్లై కస్టడీలోనే మరణించడంతో అప్పట్లో సంచలనమైంది. కె. గోవిందన్ కుట్టితో కలిసి రాజన్ సోదరుడు రామ్మోహన్ పిళ్లై 'ఏ వేస్టెడ్ డెత్: ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ రాజన్ పిళ్లై' పేరుతో పుస్తకం కూడా రాశారు. 2001లో విడుదలైన ఈ పుస్తకం ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. -
కమల్‌హాసన్ హెల్త్ బులెటిన్ విడుదల.. వైద్యులు ఏం చెప్పారంటే ?
Doctors Said Kamal Hasan Recovered From Corona: లోకనాయకుడు కమల్‌హాసన్ కరోనా నుంచి కోలుకున్నాడని చెన్నైలోని శ్రీ రామచంద్రా మెడికల్ సెంటర్ ప్రకటించింది. కమల్ ఆరోగ్యం ప్రస్తుతం నలకడగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు. అందుకే ఈ నెల 3న డిశ్చార్జ్ చేస్తామని హెల్త్ బులెటిన్‌లో వైద్యులు పేర్కొన్నారు. డిసెంబర్ 4 నుంచి కమల్ హాసన్ తన పనులను చేసుకోవచ్చని వైద్యులు తెలిపారు. అయితే ఇంతకుముందు అమెరికా పర్యటనను ముగించుకుని వచ్చిన ఆయన అస్వస్థతకు గురయ్యారు. వైద్యపరీక్షలు చేయించుకోగా కమల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో చికిత్స కోసం నవంబర్ 22న ఆస్పత్రిలో చేరారు. ఇదిలా ఉండగా కమల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కమల్‌హాసన్, ఫాహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రధారులుగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘విక్రమ్’. ఇందులో విక్రమ్ పాత్రలో కనిపిస్తారు కమల్. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకుంటున్నట్లు సమాచారం. అలాగే శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2లో కూడా నటిస్తున్నారు కమల్. ఇది చదవండి: కమల్ హాసన్‌ను పరామర్శించిన రజనీకాంత్ -
నన్ను ఆహ్వానించలేదు
తమిళసినిమా: స్టార్స్ క్రికెట్ పోటీకి తనను ఆహ్వానించలేదని ఆరోపణలు పరిశ్రమలో అక్కడక్కడా వ్యక్తం అవుతున్నాయి.దక్షిణ భారత నటీనటుల సంఘం నూతన భవన నిర్మాణానికి నిధిని సమకూర్చే కార్యక్రమంలో భాగంగా సంఘ నిర్వాహకులు ఆదివారం చెన్నైలో స్టార్స్ క్రికెట్ క్రీడా పోటీని నిర్వహించిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున్న జరిగిన ఈ కార్యక్రమంలో దక్షిణ భారత చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని విజయవంతం చేశారు.ఇది బృహత్తర కార్యక్రమం అని పలువురు మెచ్చుకున్నారు. అయితే కొందరు ఆరోపణలు గుప్పిస్తున్నారు. దక్షిణ భారత నటీనటుల సంఘానికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో అప్పటి సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్ వర్గానికి కొత్తగా పోటీకి దిగిన నటుడు విశాల్ వర్గానికి మధ్య చిన్న పాటి పోరే జరిగిందన్న విషయం తెలిసిందే. రాజకీయ ఎన్నికల వాతావరణాన్ని తలపించిన ఆ ఎన్నికల్లో విశాల్ వర్గం విజయం సాధించి సంఘ నిర్వాహక బాధ్యతల్ని చేపట్టింది. ఆదివారం జరిగిన స్టార్స్ క్రికెట్ క్రీడా పోటీ కార్యక్రమంలో సంఘం మాజీ అధ్యక్షుడు శరత్‌కుమార్, మాజీ కార్యదర్శి రాధారవి లాంటి ముఖ్యులు కొందరు పాల్గొనక పోవడం చర్చనీయాంశంగా మారింది. నటుడు అజిత్, విజయ్, శింబు, రాధికా శరత్‌కుమార్,వడివేలు కూడా పాల్గొనలేదు. హాస్యనటుడు సూరికి ప్రాముఖ్యత నివ్వడంతో కినుకు వహించిన వడివేలు ఈ కార్యక్రమంలో పాల్గొనలేదనే ప్రచారం కూడా హల్ చల్ చేసింది. అయితే ఆయన తల్లి అనారోగ్యం కారణంగా వడివేలు శనివారం రాత్రే మధురై వెళ్లాల్చి వచ్చిందని ఆయన సన్నిహితులు వివరించారు. ఇక నటుడు అజిత్ ఈ స్టార్స్ క్రికెట్ క్రీడా పోటీలను ముందుగానే విభేదించారు. నటి రాధికా శరత్‌కుమార్ తనతో పాటు చాలా మందికి ఆహ్వానం లేదని ఆరోపించడం ఆరోపణలు గుప్పించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం హల్చల్ చేస్తోంది. మరి ఆమె ఆరోపణలకు సంఘం నిర్వాకం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.