Nikki Galrani Complaint Against Dhanush Her Staff - Sakshi
Sakshi News home page

Nikki Galrani: ప్రముఖ హీరోయిన్‌ ఇంట్లో చోరీ.. పోలీసులకు ఫిర్యాదు

Jan 19 2022 5:07 PM | Updated on Jan 19 2022 5:27 PM

Nikki Galrani Police Complaint Against Her Staff Dhanush - Sakshi

బుజ్జిగాడు హీరోయిన్ సంజన గల్రానీ చెల్లెలు నిక్కీ గల్రానీ కోలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'డార్లింగ్‌', 'వెలయిన్ను వందుట్టా వెల్లైక్కారన్‌', 'కడవుల్ ఇరుక్కన్‌ కుమారు', 'మొట్ట శివ కెట్ట శివ', 'హరహర మహాదేవకి', 'మరగత నానయం' వంటి తమిళ చిత్రాలతో చాలా పాపులర్ అయింది. జనవరి 11న తన దగ్గర పనిచేసే 19 ఏళ్ల యువకుడు ధనుష్‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది నిక్కీ. చెన్నై రాయపేటలోని నిక్కీ గల్రానీ ఇంట్లో పని చేస్తున్నాడు ధనుష్‌. ఈ క్రమంలో నిక్కీకి చెందిన బట్టలు, ఖరీదైన కెమెరా కనిపించలేదు. ఈ సంఘటన తర్వాత ధనుష్‌ పరారీలో ఉండటంతో అతనే దొంగతనం చేసినట్లుగా భావించి పోలీస్‌లకు ఫిర్యాదు చేసింది. ధనుష్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కోరింది నిక్కీ. 

(చదవండి: ఆ హీరో ఇంట్లో విషాదం.. అతనే సర్వస్వం అంటూ ఎమోషనల్‌)

రంగంలోకి దిగిన పోలీసులు ధనుష్‌ తిరుపూర్‌లోని తన స్నేహితుడి ఇంట్లో దాక్కున్నట్లు గుర్తించారు. సోమవారం తిరుపూర్‌లో ధనుష్‌ను అరెస్టు చేసి, అతను దొంగలించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం ధనుష్‌ను చైన్నైకి తీసుకొచ్చారు పోలీసులు. అనంతరం దుస్తులు, కెమెరాను తిరిగి నిక్కీ గల్రానీకి అప్పగించారు. దీంతో నిక్కీ తన ఫిర్యాదు ఉపసంహరించుకున్నట్లు తెలిపింది. ధనుష్‌పై తదుపరి చర్యలు తీసుకోవద్దని కోరినట్లు సమాచారం. ఎందుకంటే తన వస్తువులు తనకు తిరిగి దొరికాయన్న సంతృప్తి చాలని నిక్కీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆ వస్తువుల విలువ సుమారు రూ.  లక్షకుపైగా ఉంటుందని అంచనా. 

(చదవండి:  ప్రభాస్‌ తర్వాత స్థానంలో అ‍ల్లు అర్జున్‌.. దేనిలో అంటే ?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement