Kamal Haasan Health Update: Hospital Report Says Kamal Haasan Fully Recovered From COVID-19 - Sakshi
Sakshi News home page

Kamal Haasan: కమల్‌హాసన్‌ హెల్త్‌ బులెటిన్‌ విడుదల.. వైద్యులు ఏం చెప్పారంటే ?

Published Wed, Dec 1 2021 4:05 PM | Last Updated on Wed, Dec 1 2021 5:37 PM

Doctors Said Kamal Hasan Recovered From Corona - Sakshi

Doctors Said Kamal Hasan Recovered From Corona: లోకనాయకుడు కమల్‌హాసన్‌ కరోనా నుంచి కోలుకున్నాడని చెన‍్నైలోని శ్రీ రామచంద్రా మెడికల్ సెంటర్ ప్రకటించింది. కమల్ ఆరోగ్యం ప్రస్తుతం నలకడగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు. అందుకే ఈ నెల 3న డిశ్చార్జ్‌ చేస్తామని హెల్త్‌ బులెటిన్‌లో వైద్యులు పేర్కొన్నారు. డిసెంబర్ 4 నుంచి కమల్‌ హాసన్‌ తన పనులను చేసుకోవచ్చని వైద్యులు తెలిపారు. అయితే ఇంతకుముందు అమెరికా పర్యటనను ముగించుకుని వచ్చిన ఆయన అస్వస్థతకు గురయ్యారు. వైద్యపరీక్షలు చేయించుకోగా కమల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో చికిత్స కోసం నవంబర్‌ 22న ఆస్పత్రిలో చేరారు. 

ఇదిలా ఉండగా కమల్‌ వరుస సినిమాలతో బిజీగా ఉ‍న్నారు. కమల్‌హాసన్, ఫాహద్‌ ఫాజిల్, విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రధారులుగా లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘విక్రమ్‌’. ఇందులో విక్రమ్‌ పాత్రలో కనిపిస్తారు కమల్‌. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకుంటున్నట్లు సమాచారం. అలాగే శంకర్‌ దర్శకత్వంలో భారతీయుడు 2లో కూడా నటిస్తున్నారు కమల్‌. 

ఇది చదవండి: కమల్‌ హాసన్‌ను పరామర్శించిన రజనీకాంత్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement