కొత్త సంవత్సరం.. కొత్త ఉత్సాహం | Kollywood stars upcoming movies updates on occasion of Tamil New Year | Sakshi
Sakshi News home page

కొత్త సంవత్సరం.. కొత్త ఉత్సాహం

Published Mon, Apr 15 2024 2:22 AM | Last Updated on Mon, Apr 15 2024 2:22 AM

Kollywood stars upcoming movies updates on occasion of Tamil New Year - Sakshi

తమిళ నూతన సంవత్సరాది (ఏప్రిల్‌ 14) సందర్భంగా కోలీవుడ్‌లో కొత్త ఉత్సాహం కనిపించింది. స్టార్‌ హీరో సినిమాల కొత్త లుక్‌లు, సరికొత్త అనౌన్స్‌మెంట్‌లతో తమిళ చిత్ర పరిశ్రమ కళకళలాడింది. ఈ విశేషాలపై కథనం..

భారతీయుడు వస్తున్నాడు
భారతీయుడు మళ్లీ వస్తన్నాడు. హీరో కమల్‌హాసన్ , దర్శకుడు శంకర్‌ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఇండియన్ ’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమా 1996లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తాజాగా ‘ఇండియన్ ’ సినిమాకు సీక్వెల్స్‌గా ‘ఇండియన్  2’, ‘ఇండియన్  3’ చిత్రాలను రూ΄÷ందించారు కమల్‌హాసన్ , శంకర్‌. లైకా ప్రోడక్షన్స్, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ పతాకాలపై సుభాస్కరన్  నిర్మించారు.

‘ఇండియన్  2’ (‘భారతీయుడు 2’) చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ప్రోడక్షన్  వర్క్స్‌ శరవేగంగా జరుగుతున్నాయి. మే నెలాఖరులో ‘ఇండియన్  2’ ట్రైలర్, జూన్ లో సినిమా రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నామని చిత్రయూనిట్‌ పేర్కొంది. తాజాగా ఈ సినిమా కొత్త పోస్టర్స్‌ను విడుదల చేశారు మేకర్స్‌. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్ గా నటించిన ‘ఇండియన్  2’ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్‌ సింగ్, ప్రియాభవానీ శంకర్, ఎస్‌జే సూర్య, బాబీ సింహా కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి అనిరుధ్‌  సంగీతం అందించారు.

ఈ ఏడాదే కంగువ
సూర్య హీరోగా నటించిన పీరియాడికల్‌ సోషియో ఫ్యాంటసీ యాక్షన్  థ్రిల్లర్‌ మూవీ ‘కంగువ’. శివ దర్శకత్వంలో రూ΄÷ందిన ఈ సినిమాలో దిశా పటానీ, బాబీ డియోల్, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు. కేఈ జ్ఞానవేల్‌రాజా, వంశీ, ప్రమోద్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కానున్నట్లు చిత్రయూనిట్‌ స్పష్టం చేసింది. డిఫరెంట్‌ టైమ్‌లైన్స్లో జరిగే ఈ చిత్రంలో సూర్య నాలుగైదు గెటప్స్‌లో కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. తాజాగా ఈ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌.

విజిల్‌ పోడు
విజయ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి ఓ హీరోయిన్ గా నటిస్తున్నారు. విజయ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాకు వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘విజిల్‌ పోడు..’ అనే పాట లిరికల్‌ వీడియోను విడుదల చేశారు మేకర్స్‌. మదన్  కర్కే లిరిక్స్‌ అందించిన ఈ పాటను విజయ్, వెంకట్‌ప్రభు, యువన్  శంకర్‌ రాజా, ప్రేమ్‌గీ ఆలపించారు. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్ మెంట్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబరు 5న విడుదల కానుంది. 

రాయన్‌ రెడీ
ధనుష్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రాయన్‌’. నార్త్‌ చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలో సందీప్‌ కిషన్, కాళిదాసు జయరాం లీడ్‌ రోల్స్‌ చేయగా, సెల్వరాఘవన్, ప్రకాష్‌రాజ్, దుషారా విజయన్, అపర్ణా బాలమురళి, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేసి, త్వరలోనే పాటలను రిలీజ్‌ చేయనున్నట్లుగా చిత్రయూనిట్‌ పేర్కొంది. సన్‌పిక్చర్స్‌ నిర్మించిన ఈ చిత్రం ధనుష్‌ కెరీర్‌లో 50వ చిత్రం కావడం విశేషం. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించిన ‘రాయన్‌’ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుందని కోలీవుడ్‌ సమాచారం.

డబుల్‌ ధమాకా
తమిళ కొత్త సంవత్సరంలో జోష్‌ పెంచారు రాఘవా లారెన్స్. ఆయన హీరోగా రెండు కొత్త సినిమాలను ప్రకటించారు. వాటిలో ఒక మూవీకి ‘హంటర్‌’ అనే టైటిల్‌ ఖరారైంది. రాఘవా లారెన్స్ కెరీర్‌లో 25వ సినిమాగా తెరకెక్కనున్న ఈ యాక్షన్  అడ్వెంచరస్‌ ఫిల్మ్‌కు వెంకట్‌ మోహన్  దర్శకత్వం వహిస్తారు. గోల్డ్‌మైన్  టెలీ ఫిలింస్, మనీష్‌ షా, సత్యజ్యోతి ఫిలింస్‌ నిర్మించనున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. అలాగే ‘బెంజ్‌’ అనే కొత్త సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చారు లారెన్స్. దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ ఈ సినిమాకు కథ అందించారు. బక్కియరాజ్‌ కన్నన్  దర్శకత్వం వహించనున్న ఈ మూవీని సుధన్  సుందరం, లోకేష్‌ కనగరాజ్, జగదీష్‌ పళనిస్వామి నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.

తమిళ నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని మరికొన్ని సినిమాల అప్‌డేట్స్‌ కూడా వచ్చాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement