Tamil New Year
-
హబ్బీతో మౌనీరాయ్ విషు సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
తమిళ న్యూ ఇయర్ వేడుకల్లో నయనతార ఫ్యామిలీ.. (ఫోటోలు)
-
కొత్త సంవత్సరం.. కొత్త ఉత్సాహం
తమిళ నూతన సంవత్సరాది (ఏప్రిల్ 14) సందర్భంగా కోలీవుడ్‌లో కొత్త ఉత్సాహం కనిపించింది. స్టార్ హీరో సినిమాల కొత్త లుక్‌లు, సరికొత్త అనౌన్స్మెంట్లతో తమిళ చిత్ర పరిశ్రమ కళకళలాడింది. ఈ విశేషాలపై కథనం.. భారతీయుడు వస్తున్నాడు భారతీయుడు మళ్లీ వస్తన్నాడు. హీరో కమల్‌హాసన్ , దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఇండియన్ ’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమా 1996లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తాజాగా ‘ఇండియన్ ’ సినిమాకు సీక్వెల్స్‌గా ‘ఇండియన్ 2’, ‘ఇండియన్ 3’ చిత్రాలను రూ΄÷ందించారు కమల్‌హాసన్ , శంకర్. లైకా ప్రోడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ పతాకాలపై సుభాస్కరన్ నిర్మించారు. ‘ఇండియన్ 2’ (‘భారతీయుడు 2’) చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ప్రోడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. మే నెలాఖరులో ‘ఇండియన్ 2’ ట్రైలర్, జూన్ లో సినిమా రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నామని చిత్రయూనిట్ పేర్కొంది. తాజాగా ఈ సినిమా కొత్త పోస్టర్స్‌ను విడుదల చేశారు మేకర్స్. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ‘ఇండియన్ 2’ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్ సింగ్, ప్రియాభవానీ శంకర్, ఎస్జే సూర్య, బాబీ సింహా కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందించారు. ఈ ఏడాదే కంగువ సూర్య హీరోగా నటించిన పీరియాడికల్ సోషియో ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కంగువ’. శివ దర్శకత్వంలో రూ΄÷ందిన ఈ సినిమాలో దిశా పటానీ, బాబీ డియోల్, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు. కేఈ జ్ఞానవేల్‌రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కానున్నట్లు చిత్రయూనిట్ స్పష్టం చేసింది. డిఫరెంట్ టైమ్‌లైన్స్‌లో జరిగే ఈ చిత్రంలో సూర్య నాలుగైదు గెటప్స్‌లో కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. తాజాగా ఈ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. విజిల్ పోడు విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి ఓ హీరోయిన్ గా నటిస్తున్నారు. విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘విజిల్ పోడు..’ అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. మదన్ కర్కే లిరిక్స్ అందించిన ఈ పాటను విజయ్, వెంకట్‌ప్రభు, యువన్ శంకర్ రాజా, ప్రేమ్గీ ఆలపించారు. ఏజీఎస్ ఎంటర్టైన్ మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబరు 5న విడుదల కానుంది. రాయన్ రెడీ ధనుష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రాయన్’. నార్త్ చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలో సందీప్ కిషన్, కాళిదాసు జయరాం లీడ్ రోల్స్ చేయగా, సెల్వరాఘవన్, ప్రకాష్‌రాజ్, దుషారా విజయన్, అపర్ణా బాలమురళి, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేసి, త్వరలోనే పాటలను రిలీజ్ చేయనున్నట్లుగా చిత్రయూనిట్ పేర్కొంది. సన్‌పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం ధనుష్ కెరీర్లో 50వ చిత్రం కావడం విశేషం. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ‘రాయన్’ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుందని కోలీవుడ్ సమాచారం. డబుల్ ధమాకా తమిళ కొత్త సంవత్సరంలో జోష్ పెంచారు రాఘవా లారెన్స్. ఆయన హీరోగా రెండు కొత్త సినిమాలను ప్రకటించారు. వాటిలో ఒక మూవీకి ‘హంటర్’ అనే టైటిల్ ఖరారైంది. రాఘవా లారెన్స్ కెరీర్లో 25వ సినిమాగా తెరకెక్కనున్న ఈ యాక్షన్ అడ్వెంచరస్ ఫిల్మ్‌కు వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తారు. గోల్డ్‌మైన్ టెలీ ఫిలింస్, మనీష్ షా, సత్యజ్యోతి ఫిలింస్ నిర్మించనున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. అలాగే ‘బెంజ్’ అనే కొత్త సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు లారెన్స్. దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ సినిమాకు కథ అందించారు. బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించనున్న ఈ మూవీని సుధన్ సుందరం, లోకేష్ కనగరాజ్, జగదీష్ పళనిస్వామి నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. తమిళ నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని మరికొన్ని సినిమాల అప్డేట్స్ కూడా వచ్చాయి. -
న్యూ ఇయర్ గిఫ్ట్
సమాజంలో లంచాన్ని నిర్మూలించాలని స్వాతంత్య్ర సమరయోధుడు సేనాపతిగా ‘భారతీయుడు’ సినిమాలో కమల్‌హాసన్ పోరాటం చేశారు. ఇప్పుడు మరోసారి సేనాపతిగా తిరిగి రానున్న సంగతి తెలిసిందే. ఈ సేనాపతి తమిళ కొత్త సంవత్సరం రోజున థియేటర్స్‌లోకి రానున్నారని టాక్. కమల్‌హాసన్ – దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన చిత్రం ‘భారతీయుడు’. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. కాజల్, రకుల్‌ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కమల్‌హాసన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఈ సినిమాకు చిన్న బ్రేక్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ రాజమండ్రిలో జరుగుతోంది. ఈ చిత్రాన్ని 2021 ఏప్రిల్ 14న తమిళ సంవత్సరాది సందర్భంగా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరు«ద్ సంగీత దర్శకుడు. -
బ్యాలెన్స్ చేయాలి
తమిళ కొత్త సంవత్సరాన్ని కుటుంబ సమేతంగా ఆహ్వానించారు నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్. వీరిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. కొత్త సంవత్సరాన్ని విఘ్నేశ్ తన కుటుంబ సభ్యులందరితో కలసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోను ఆయన తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసి – ‘‘అందరికీ తమిళ నూతన సంవత్సరం, అలాగే విషు (మలయా సంవత్సరాది) శుభాకాంక్షలు. అమ్మ, చెల్లి, కాబోయే వాళ్లు (అంటే నయనతార)... కుటుంబమే సర్వస్వం. బ్యాలెన్స్ చేయడమే లైఫ్. పాజిటివ్‌నెస్‌ను నింపడమే లైఫ్’’ అని పేర్కొన్నారు. విజయ్, రజనీకాంత్ సినిమాల్లో హీరోయిన్గా నయనతార, శివకార్తికేయన్ సినిమా రూపొందించే పనిలో విఘ్నేశ్ బిజీ బిజీగా ఉన్నారు. -
ఆ దేవాలయం గోడలు, దిమ్మెలు అన్నీ కరెన్సీ నోట్లే..!
-
ఆ దేవాలయమంతా కరెన్సీ నోట్లే..!
చెన్నై : తమిళ నూతన సంవత్సర ‘పుథాండు’ సందర్భంగా చెన్నైలోని అరబ్బక్కంలో బాల వినయానగర్ దేవాలయంలోకి ఎప్పుడైనా ప్రవేశించారా... అయితే ఒక్కసారి వెళ్లి చూడండి.. ఆ దేవాలయమంతా ఆ రోజు కరెన్సీ నోట్ల కట్టలతోనే దర్శనిమిస్తోందట. పుథాండు పర్వదినాన ఆ దేవాలయాన్ని పూలు, కాంతి వెలుగులతో కాకుండా.. తమిళ ప్రజలు కరెన్సీ నోట్లతో అలంకరిస్తారట. పుథాండు సందర్భంగా ఆ దేవాలయమంతా గోడలు, దిమ్మెలు అన్నీ కూడా రూపాయి నోటు నుంచి రూ.200 నోటు వరకున్న డినామినేషన్ నోట్లతోనే కళకళలాడుతుంటాయని అక్కడి భక్తులు చెబుతున్నారు. ప్రతేడాది తమిళ కొత్త ఏడాది సందర్భంగా ఈ గుడిని ఇలానే అలంకరిస్తామని దేవాలయ నిర్వాహకులు చెప్పారు. ఈ గుడిలో ఉండే గణేశుడి విగ్రహాన్ని కూడా నోట్ల కట్టలతో తీర్చిదిద్దుతామని తెలిపారు. ఒక గోడ నుంచి మరో గోడకు కరెన్సీ నోట్లను అమర్చడానికి సుమారు రూ.4 లక్షల విలువైన నోట్లు అవసరం పడతాయని చెప్పారు. అయితే ఈ నగదంతా నిజమైనదే అని కచ్చితంగా చెప్పలేమంటున్నారు అక్కడి భక్తులు. పుథాండు అనేది తమిళ ప్రజల కొత్త సంవత్సరం, తమిళ క్యాలెండర్లో తొలి రోజు. ప్రతేడాది ఈ రోజు 14వ తేదీ ఏప్రిల్‌లో వస్తుంటోంది. ఈ రోజును కేరళలో విశు, అస్సాంలో బిహు అని జరుపుకుంటుంటారు. -
‘2.0’ ముందుకు వస్తుందా?
రజనీకాంత్ సినిమా రిలీజ్ అంటే అభిమానులకు పండగ రోజు. అలాంటిది పండగ రోజు ఆయన సినిమా విడుదలైతే డబుల్ ఫెస్టివల్. వచ్చే సంవత్సరాది (ఏప్రిల్ 14) రజనీకాంత్ అభిమానులకు టూ ఫెస్టివల్స్. ఒకటి తమిళ న్యూ ఇయర్. ఇంకోటి ‘2.0’ రిలీజ్. అదేంటీ.. ఏప్రిల్ 27న కదా ‘2.0’ రిలీజ్ అనుకుంటున్నారా? లేదట. ‘ఏప్రిల్ 14న రిలీజ్ అనుకుంటున్నాం’ అని శనివారం ‘ఫ్యాన్స్ మీట్’లో రజనీకాంత్ పేర్కొన్నట్లుగా వార్త షికారు చేసింది. ‘‘2.0 చాలా గ్రాఫిక్స్‌తో కూడుకున్న సినిమా. అందుకే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. అందుకే జనవరి నుంచి ఏప్రిల్‌కు వాయిదా పడింది. ఎన్నిసార్లు వాయిదా పడినా సినిమా చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. బడ్జెట్ విషయంలోనే కాదు కంటెంట్ పరంగా కూడా చాలా గొప్ప సినిమా ఇది. తమిళంలో వచ్చిన ‘చంద్రలేఖ’ సినిమాలాగా చాలా కాలం గుర్తుపెట్టుకునే సినిమాగా నిలిచిపోతోంది. దర్శకుడు శంకర్ చాలా యునిక్ పాయింట్‌ను ఈ సినిమాలో చెప్పబోతున్నాడు. ‘కాలా’ సినిమాలో కొత్త డైమెన్షన్లో కనిపిస్తాను. ఒక కొత్త రజనీకాంత్‌ను దర్శకుడు పా.రంజిత్ మీ అందరికి చూపించబోతున్నాడు’’ అని రజనీకాంత్ ‘2.0, కాలా’ గురించి ఫ్యాన్స్‌తో పలు విశేషాలు పంచుకున్నారు. ఇంత చెప్పారు కదా సార్.. మరి రాజకీయల గురించి ? అని అడిగితే ‘‘ఇంకొక్క రోజు ఆగండి’’ అన్నారు. ఆ ఇంకొక్క రోజు ఈరోజే (ఆదివారం). సో.. రజనీ రాజకీయాల్లోకి వస్తారా? రారా? సాయంత్రానికల్లా ఓ క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పటివరకూ ఈ విషయం గురించి క్లారిటీ ఇవ్వని రజనీ ఈసారి మాత్రం స్పష్టంగా తన నిర్ణయాన్ని చెప్పేయాలనుకుంటున్నారట. ఫ్యాన్స్ మీట్లో రజనీ తన ఫ్లాష్‌బ్యాక్‌ని గుర్తు చేసుకున్నారు. ఈ స్థాయికి రావడానికి కారణమైన దర్శకుడు కె.బాలచందర్ గురించి మాట్లాడారు. ‘‘బాలచందర్‌గారిని నేను మొట్టమొదటిసారి కలసినప్పుడు తమిళ్ నేర్చుకోమన్నారు. మూడు సినిమాలకు నన్ను బుక్ చేసుకున్నారు. బాలచందర్‌గారి దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకుని, నేను స్టార్ అయ్యాక దర్శకుడు ఎస్. పి. ముత్తురామన్గారు, మణిరత్నంగారు, సురేష్కృష్ణగారు.. నన్ను సూపర్ స్టార్‌ని చేశారు. ‘రోబో’ సినిమాతో శంకర్ నన్ను జాతీయ స్థాయి నటుణ్ణి చేశారు’’ అని రజనీ అన్నారు. వాస్తవానికి ‘రోబో’కన్నా ముందే రజనీ జాతీయ స్థాయి నటుడే. అయితే శంకర్ పేరుని సూచించడం ఆయన సింప్లిసిటీని తెలియజేస్తోంది. ఇదిలా ఉంటే... ఒకవేళ ‘2.0’ నిజంగానే ఏప్రిల్ 14న విడుదలైతే ఇక్కడ మన రెండు తెలుగు సినిమాల రిలీజ్ డేట్ విషయంలో కూడా ఓ క్లారిటీ వచ్చేస్తుంది. ఒకటి కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్‌బాబు (‘భరత్ అనే నేను) హీరోగా రూపొందుతోన్న సినిమా. ఇంకొకటి వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతోన్న ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. వాస్తవానికి ముందు రిలీజ్ డేట్ (ఏప్రిల్ 27) ప్రకటించింది ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రబృందమే. ఆ తర్వాత అదే తేదీని మహేశ్‌బాబు మూవీ యూనిట్ ప్రకటించింది. అయితే రెండు పెద్ద సినిమాలు ఒకే తేదీన విడుదల కావడం శ్రేయస్కరం కాదు కాబట్టి, రెండు చిత్రాల నిర్మాతలిద్దరూ కలసి సామరస్యంగా మాట్లాడుకుని, ఓ నిర్ణయానికి రావాలనుకుంటున్నారు. -
వేడుకగా తమిళ సంవత్సరాది
టీనగర్: మేల్మరువత్తూరు ఆదిపరాశక్తి సిద్ధర్ పీఠంలో హేవళంబి తమిళ సంవత్సరాది వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. కలశ పూజలు, సాంస్కృతిక ప్రదర్శనలు, సంక్షేమ సహాయకాల పంపిణీ జరిగింది. ఇందులో పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు, పారిశ్రామికవేత్తలు, ప్రజలు, వేలాదిమంది భక్తులు బంగారు అడిగళార్ ఆశీస్సులు అందుకున్నారు. గురువారం సాయంత్రం ఆదిపరాశక్తి గర్భగుడి ముందు కలశ, దీప పూజలను మేల్మరువత్తూరు ఆదిపరాశక్తి ఆధ్యాత్మిక సంఘం అధ్యక్షురాలు లక్ష్మీ బంగారు అడిగళార్ ప్రారంభించారు. శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో మంగళవాయిద్యాల నడుమ అమ్మవారికి ప్రత్యేక అభిషేకం, అలంకరణ, ఆరాధనలు జరిగాయి. ఉదయం ఆధ్యాత్మిక సంఘం ఉపాధ్యక్షుడు కేపీ సెంథిల్‌కుమార్ అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. సిద్ధర్ పీఠానికి విచ్చేసిన బంగారు అడిగళార్‌కు కాంచీపురం జిల్లా తరఫున భక్తులు పాదపూజ చేసి ఘన స్వాగతం పలికారు. మధ్యాహ్నం 12.15 గంటలకు వేదికపై ప్రత్యేక ప్రదర్శనలు జరిగాయి. కాంచీపురం జిల్లా అదనపు న్యాయమూర్తి జి.కరుణానిధి, రైల్వే ఉన్నతాధికారి ఎస్.సెంథమిళ్ సెల్వన్, ఏకే వెంకటసామి, సాయిప్రసాద్ పాల్గొన్నారు. ఇందులో రూ.15 లక్షల విలువైన సంక్షేమ సహాయకాలను 446 మంది లబ్ధిదారులకు అందజేశారు. 15 ఉచిత వివాహాలు, ఆరుగురు దంపతులకు షష్టిపూర్తి ఉత్సవాలను బంగారు అడిగళార్ నిర్వహించారు. ఐదుగురు దివ్యాంగులకు త్రిచక్రవాహనాలు, ఆరుగురికి హియరింగ్ ఎయిడ్స్ మరికొందరికి ఇతర సహాయకాలు అందజేశారు. -
తమిళ సంవత్సరాదికి 2.0 టీజర్
గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా 2.0. గతంలో ఇదే కాంబినేషన్లో తెరకెక్కిన రోబోకు సీక్వల్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ప్రతినాయక పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై బాలీవుడ్లో కూడా భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ రావటంతో అభిమానులతో పాటు సినీ వర్గాలు కూడా టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఫైనల్‌గా టీజర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసింది రోబో టీం. తమిళ సంవత్సారాది సందర్భంగా ఏప్రిల్ 14న 2.0 టీజర్‌ను రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు. రజనీకాంత్ సరసన అమీజాక్సన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్ నిర్మిస్తోంది.