
విఘ్నేశ్ కుటుంబ సభ్యులతో నయనతార
తమిళ కొత్త సంవత్సరాన్ని కుటుంబ సమేతంగా ఆహ్వానించారు నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్. వీరిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. కొత్త సంవత్సరాన్ని విఘ్నేశ్ తన కుటుంబ సభ్యులందరితో కలసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసి – ‘‘అందరికీ తమిళ నూతన సంవత్సరం, అలాగే విషు (మలయా సంవత్సరాది) శుభాకాంక్షలు. అమ్మ, చెల్లి, కాబోయే వాళ్లు (అంటే నయనతార)... కుటుంబమే సర్వస్వం. బ్యాలెన్స్ చేయడమే లైఫ్. పాజిటివ్‌నెస్‌ను నింపడమే లైఫ్’’ అని పేర్కొన్నారు. విజయ్, రజనీకాంత్ సినిమాల్లో హీరోయిన్‌గా నయనతార, శివకార్తికేయన్ సినిమా రూపొందించే పనిలో విఘ్నేశ్ బిజీ బిజీగా ఉన్నారు.