Nayanthara Lost Her Cool At Kumbakonam Temple, Video Viral - Sakshi
Sakshi News home page

Nayanthara: ఆలయంలో నయన్ ఫైర్.. కాసేపు కూడా ఆగలేరా?

Published Fri, Apr 7 2023 9:37 AM | Last Updated on Fri, Apr 7 2023 10:03 AM

Nayanthara Lost Her Cool At Kumbakonam Temple in Tamilanadu - Sakshi

లేడీ సూపర్ స్టార్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు నయనతార. దక్షిణాది ఇండస్ట్రీలో అంతలా పేరు సంపాదించుకుంది కోలీవుడ్ భామ. గతేడాది దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ను పెళ్లాడిన నయన్.. సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే తమ పిల్లల పూర్తి పేర్లను కూడా వెల్లడించారు. అయితే ఇటీవల కుంభకోణంలోని తమ ఇష్టదైవమైన ఆలయానికి వెళ్లిన దంపతులు పూజలు నిర్వహించారు. కానీ అదే సమయంలో అక్కడున్న భక్తులపై నయనతార ఆగ్రహం వ్యక్తం చేసింది.  

అసలేం జరిగిందంటే..

 ఏప్రిల్ 5న కుంభకోణం జిల్లాలోని  ఆలయానికి వెళ్లారు నయన్, విఘ్నేశ్ దంపతులు. వీరు పూజలు చేస్తున్న సమయంలో కొందరు భక్తులు గొడవకు దిగారు. అంతే కాకుండా వారి ఫోటోలు, వీడియోలు తీసేందుకు ఎగబడ్డారు. దీంతో నయనతార భక్తులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక్క ఐదు నిమిషాలు ఆగండి. మా పూజ పూర్తవుతుంది, మేము మీలాగే దేవుడి ఆశీస్సుల కోసమే వచ్చాం.' అని అన్నారు. 

కాగా.. నయనతార తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో పలు బ్లాక్‌బస్టర్ చిత్రాలలో నటించింది.  ఆమె చివరిసారిగా దర్శకుడు అశ్విన్ శరవణన్ 'కనెక్ట్'‌లో కనిపించింది.  త్వరలోనే షారుఖ్ ఖాన్ మూవీ జవాన్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement