Nayanthara And Vignesh Shivan Get Special Surprise From Twins, New Pics Viral Of Twins - Sakshi
Sakshi News home page

Nayanthara and Vignesh Shivan: నయన్- విఘ్నేశ్‌కు ట్విన్స్ సర్‌ప్రైజ్‌.. ఇంత చిన్న వయసులోనే!

Published Fri, Jun 9 2023 7:22 PM | Last Updated on Fri, Jun 9 2023 8:25 PM

Nayanthara and Vignesh Shivan get special surprise from twins - Sakshi

సౌత్‌ ఇండియా బ్యూటీఫుల్ కపుల్స్‌లో నయన్-విక్కీ జంట ఒకరు. దాదాపు కొన్నేళ్లపాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట గతేడాది జూన్ 9న వివాహాబంధంతో ఒక్కటయ్యారు. మొదటి వివాహా వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ జంటకు పలువురు తారలు, ఫ్యాన్స్, సన్నిహితులు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే ఈ జంటకు ఉయిర్, ఉలగం అనే కవల పిల్లలు జన్మించారు. అయితే ఈ శుభ సందర్భంలో అమ్మా-నాన్నకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు ట్విన్స్. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.

(ఇది చదవండి: పిల్లల ఫోటోలు రివీల్‌ చేసిన నయనతార.. ఈరోజే ఎందుకంటే?)

నయన్- విఘ్నేశ్ ఇద్దరు పిల్లలు వివాహా వార్షికోత్సవానికి అమ్మా-నాన్నకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. హ్యాపీ యానివర్శరీ అంటూ బెలూన్లతో అలంకరించిన ఫోటోను విక్కీ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. తన ఇద్దరు పిల్లల గురించి విక్కీ ఎమోషనలయ్యారు. ఈ విషయాన్ని విఘ్నేశ్ తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. 

విఘ్నేష్ శివన్ ఇన్‌స్టాలో రాస్తూ.. 'ధన్యవాదాలు బాయ్స్. ఇంత చక్కని వివాహ వార్షికోత్సవ వేడుకను మాకు అందించినందుకు లవ్ యూ టూ ఉయిర్, ఉలగం. ఇంత చిన్న వయసులో మాకోసం మీరిద్దరు ఎంతగా ఆలోచించారు. మేము మీ ఇద్దరినీ ఎప్పటికీ ప్రేమిస్తునే ఉంటాం'. అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన ఇద్దరు పిల్లల ఫోటోను షేర్ చేస్తూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ ఇంత చిన్న వయసులోనే ఇంతలా డేకరేషన్ ఎలా చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో సూపర్బ్ అంటూ విషెష్ చెబుతున్నారు.

కాగా.. జూన్ 9, 2022న మహాబలిపురంలో నయనతార- విఘ్నేశ్ శివన్ వివాహా ఘనంగా జరిగింది. వీరి పెళ్లికి రజనీకాంత్, షారూఖ్ ఖాన్, అనిరుధ్ రవిచంద్రన్‌తో పాటు సినీ పరిశ్రమకు పలువురు తారలు, స్నేహితుల హాజరయ్యారు. అయితే పెళ్లయిన నాలుగు నెలలకే సరోగసీ ద్వారా గతేడాది అక్టోబర్‌లో కవలలకు స్వాగతం పలికారు.

(ఇది చదవండి: పెళ్లి పీటలెక్కనున్న ప్రముఖ నిర్మాత కుమార్తె.. తండ్రి ఎమోషనల్ పోస్ట్!)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement