నయన్‌- విఘ్నేశ్‌ వివాహ వార్షికోత్సవం.. భర్త ఎమోషనల్ పోస్ట్! | Nayanthara And Vignesh Shivan Shares Special Post On Their 2nd Marriage Anniversary | Sakshi
Sakshi News home page

Nayanthara: నయన్‌- విఘ్నేశ్‌ పెళ్లి బంధానికి రెండేళ్లు.. భర్త ఎమోషనల్ పోస్ట్!

Published Sun, Jun 9 2024 8:55 PM | Last Updated on Mon, Jun 10 2024 10:42 AM

 Nayanthara Vignesh Shivan Special Post on thier Marriage anniversery

కోలీవుడ్‌లో మోస్ట్‌ ఫేమ్ ఉన్న ఫేమ్ ఉన్న జంటల్లో నయనతార- విఘ్నేశ్ శివన్ ఒకరు. కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న వీరిద్దరు జూన్ 9, 2022లో వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఈ జంట సరోగసి పద్ధతిలో కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. తాజాగా ఇవాళ రెండో వివాహా వార్షికోత్సవం సందర్భంగా నయన భర్త విఘ్నేశ్ శివన్‌ స్పెషల్ పోస్ట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా తన భార్యతో కలిసి చిల్ అవుతోన్న వీడియోను అభిమానులతో పంచుకున్నారు.

విఘ్నేశ్ శివన్‌ తన ఇన్‌స్టాలో రాస్తూ..'పదేళ్ల నయనతార.. రెండేళ్ల విక్కీ-నయన్. ఇవాళ మా రెండో  వివాహా వార్షికోత్సవం. నిన్ను పెళ్లి చేసుకోవడం, ఉయిర్ ఉలగం రావడం నా జీవితంలోకి అతి గొప్పవిషయం. నా భార్య తంగమేయిని చాలా ప్రేమిస్తున్నా. నీతో మరెన్నో ఆహ్లాదకరమైన సమయాలు, జ్ఞాపకాలు, విజయవంతమైన క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేను. ఎలాంటి పరిస్థితుల్లనైనా నీకు తోడుగా ఉంటా. ఆ భగవంతుడు ఎల్లవేళలా మనకు అండగా నిలవాలని కోరుకుంటున్నా. మన ఉయిర్, ఉలగంతో సంతోషంగా ఉండాలనేదే ఆశయం. ఆలాగే మన పెద్ద పెద్ద ఆశయాలు నెరవేరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా.' అంటూ వీడియోను పోస్ట్ చేశారు. 

ఇది చూసిన అభిమానులు విషెస్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. నయన్ గతేడాది జవాన్‌ మూవీతో సూపర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత ఆమె నటించిన అన్నపూరణి చిత్రం విమర్శల పాలైన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement