Kamal Haaan
-
కొత్త సంవత్సరం.. కొత్త ఉత్సాహం
తమిళ నూతన సంవత్సరాది (ఏప్రిల్ 14) సందర్భంగా కోలీవుడ్‌లో కొత్త ఉత్సాహం కనిపించింది. స్టార్ హీరో సినిమాల కొత్త లుక్‌లు, సరికొత్త అనౌన్స్మెంట్లతో తమిళ చిత్ర పరిశ్రమ కళకళలాడింది. ఈ విశేషాలపై కథనం.. భారతీయుడు వస్తున్నాడు భారతీయుడు మళ్లీ వస్తన్నాడు. హీరో కమల్‌హాసన్ , దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఇండియన్ ’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమా 1996లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తాజాగా ‘ఇండియన్ ’ సినిమాకు సీక్వెల్స్‌గా ‘ఇండియన్ 2’, ‘ఇండియన్ 3’ చిత్రాలను రూ΄÷ందించారు కమల్‌హాసన్ , శంకర్. లైకా ప్రోడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ పతాకాలపై సుభాస్కరన్ నిర్మించారు. ‘ఇండియన్ 2’ (‘భారతీయుడు 2’) చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ప్రోడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. మే నెలాఖరులో ‘ఇండియన్ 2’ ట్రైలర్, జూన్ లో సినిమా రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నామని చిత్రయూనిట్ పేర్కొంది. తాజాగా ఈ సినిమా కొత్త పోస్టర్స్‌ను విడుదల చేశారు మేకర్స్. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ‘ఇండియన్ 2’ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్ సింగ్, ప్రియాభవానీ శంకర్, ఎస్జే సూర్య, బాబీ సింహా కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందించారు. ఈ ఏడాదే కంగువ సూర్య హీరోగా నటించిన పీరియాడికల్ సోషియో ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కంగువ’. శివ దర్శకత్వంలో రూ΄÷ందిన ఈ సినిమాలో దిశా పటానీ, బాబీ డియోల్, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు. కేఈ జ్ఞానవేల్‌రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కానున్నట్లు చిత్రయూనిట్ స్పష్టం చేసింది. డిఫరెంట్ టైమ్‌లైన్స్‌లో జరిగే ఈ చిత్రంలో సూర్య నాలుగైదు గెటప్స్‌లో కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. తాజాగా ఈ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. విజిల్ పోడు విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి ఓ హీరోయిన్ గా నటిస్తున్నారు. విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘విజిల్ పోడు..’ అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. మదన్ కర్కే లిరిక్స్ అందించిన ఈ పాటను విజయ్, వెంకట్‌ప్రభు, యువన్ శంకర్ రాజా, ప్రేమ్గీ ఆలపించారు. ఏజీఎస్ ఎంటర్టైన్ మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబరు 5న విడుదల కానుంది. రాయన్ రెడీ ధనుష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రాయన్’. నార్త్ చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలో సందీప్ కిషన్, కాళిదాసు జయరాం లీడ్ రోల్స్ చేయగా, సెల్వరాఘవన్, ప్రకాష్‌రాజ్, దుషారా విజయన్, అపర్ణా బాలమురళి, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేసి, త్వరలోనే పాటలను రిలీజ్ చేయనున్నట్లుగా చిత్రయూనిట్ పేర్కొంది. సన్‌పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం ధనుష్ కెరీర్లో 50వ చిత్రం కావడం విశేషం. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ‘రాయన్’ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుందని కోలీవుడ్ సమాచారం. డబుల్ ధమాకా తమిళ కొత్త సంవత్సరంలో జోష్ పెంచారు రాఘవా లారెన్స్. ఆయన హీరోగా రెండు కొత్త సినిమాలను ప్రకటించారు. వాటిలో ఒక మూవీకి ‘హంటర్’ అనే టైటిల్ ఖరారైంది. రాఘవా లారెన్స్ కెరీర్లో 25వ సినిమాగా తెరకెక్కనున్న ఈ యాక్షన్ అడ్వెంచరస్ ఫిల్మ్‌కు వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తారు. గోల్డ్‌మైన్ టెలీ ఫిలింస్, మనీష్ షా, సత్యజ్యోతి ఫిలింస్ నిర్మించనున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. అలాగే ‘బెంజ్’ అనే కొత్త సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు లారెన్స్. దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ సినిమాకు కథ అందించారు. బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించనున్న ఈ మూవీని సుధన్ సుందరం, లోకేష్ కనగరాజ్, జగదీష్ పళనిస్వామి నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. తమిళ నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని మరికొన్ని సినిమాల అప్డేట్స్ కూడా వచ్చాయి. -
కథ మళ్లీ కలిపింది
ఒక హీరో–ఒక డైరెక్టర్ ఒక హిట్ సినిమా ఇస్తే.. వారిది ‘హిట్ కాంబో’ అవుతుంది. అందుకే ఆ కాంబినేషన్లో రెండో సినిమా రావాలని ఫ్యాన్స్ కోరుకుంటారు. తమ కాంబో రిపీట్ అవ్వాలని హీరో–డైరెక్టర్‌కి కూడా ఉంటుంది. కానీ కథ కుదరాలి. అలా కొందరు హీరో–దర్శకులను మళ్లీ కథ కలిపింది. రెండోసారి రిపీట్ అవుతున్న ఆ కాంబినేషన్ గురించి తెలుసుకుందాం. దశాబ్దాల తర్వాత హీరోగా కమల్‌హాసన్, దర్శకుడిగా మణి రత్నంలది ఇండస్ట్రీలో సుధీర్ఘ ప్రయాణం. కానీ కమల్‌హాసన్, మణిరత్నంల కాంబినేషన్లో ఇప్పటివరకూ వచ్చిన చిత్రం ఒక్కటే. అదే ‘నాయకన్’ (తెలుగులో ‘నాయకుడు’–1987). అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఇంతటి బ్లాక్బాస్టర్ సక్సెస్ అందుకున్నప్పటికీ కమల్, మణిరత్నంల కాంబినేషన్లో మరో సినిమా సెట్స్‌పైకి వెళ్లలేదు. ముప్పైఐదేళ్ల తర్వాత ఇప్పుడు కమల్, మణిరత్నంల కాంబో రిపీట్ కానుంది. మరోవైపు దర్శకుడు శంకర్‌తో ప్రస్తుతం ‘ఇండియన్ 2’ సినిమా చేస్తున్నారు కమల్‌హాసన్. శంకర్, కమల్ కాంబోలోనే 1996లో రిలీజైన బ్లాక్‌బస్టర్ హిట్ ఫిల్మ్ ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు సీక్వెల్ ఇది. సో.. కమల్–శంకర్ కాంబో మళ్లీ సెట్ అవ్వడానికి పాతికేళ్లు పైనే పట్టింది అన్నమాట. దేవర ఎన్టీఆర్ కెరీర్లో ఉన్న సూపర్ హిట్ చిత్రాల్లో ‘జనతా గ్యారేజ్’ ఒకటి. క్లాస్ టచ్‌తో మాస్ ఎలిమెంట్స్‌ను జోడించి దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించారు. కాగా ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ‘దేవర’ సినిమా సెట్స్‌పై ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్. విస్మరణకు గురైన భారతదేశ తీర ప్రాంతవాసుల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ‘దేవర’ విడుదల కానుంది. డబుల్ ఇస్మార్ట్ హీరో రామ్‌లోని పవర్ఫుల్ మాస్ యాంగిల్‌ని ‘ఇస్మార్ట్ శంకర్’ (2019)లో వెండితెరపైకి తెచ్చారు దర్శకుడు పూరి జగన్నాథ్. ఈ చిత్రం ఇటు రామ్, అటు పూరి జగన్నాథ్ కెరీర్లకు ఆ సమయంలో బాగా బూస్టప్ ఇచ్చింది. ఇప్పుడు ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ చేయనున్నారు రామ్ అండ్ పూరి. వచ్చే ఏడాది మార్చి 8న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఫ్యామిలీ స్టార్ ‘గీత గోవిందం’ (2018)తో రూ. వంద కోట్ల క్లబ్లో చేరారు హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమాకు పరశురామ్ దర్శకుడు. ఐదేళ్ల తర్వాత విజయ్, పరశురామ్ కాంబోలో సెకండ్ ఫిల్మ్‌గా రూపొందనున్న సినిమా ప్రారంభోత్సవం ఇటీవల జరిగింది. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. కాగా ఈ చిత్రానికి ‘ఫ్యామిలీ స్టార్’, ‘కుటుంబరావు’ అనే టైటిల్స్‌ని పరిశీలిస్తున్నారని సమాచారం. అడ్వంచరస్ డ్రామా రెండున్నరేళ్ల క్రితం కోవిడ్ సమయంలో విడుదలైన ‘భీష్మ’ చిత్రాన్ని ఆడియన్స్ ఆదరించారు. నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇది. ఇప్పుడు నితిన్–వెంకీ కుడుమల రెండోసారి మరో ఫిల్మ్ చేస్తున్నారు. ‘భీష్మ’ చిత్రంలో హీరోయిన్గా నటించిన రష్మికా మందన్నా ఈ చిత్రంలో కూడా హీరోయిన్ పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ ఇటీవల మొదలయ్యాయి. అడ్వెంచరస్ ఎంటర్టైనర్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. రాక్షస రాజు ‘నేనే రాజు నేనే మంత్రి’ (2017) చిత్రంలో జోగేంద్ర పాత్రలో హీరో రానా కాస్త నెగటివ్ షేడ్స్‌లో మెప్పించారు. అలాంటి కథతో ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు తేజ. అయితే రానా, తేజ కాంబోలో మరో సినిమా కన్ఫార్మ్ కావడానికి ఆరేళ్ల సమయం పట్టింది. రానా, తేజ కాంబినేషన్లోని సెకండ్ ఫిల్మ్ ‘రాక్షస రాజు’ (వర్కింగ్ టైటిల్) షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. భైరవ కోనలో... ‘టైగర్’ (2015) చిత్రం కోసం తొలిసారి చేతులు కలిపారు హీరో సందీప్ కిషన్, దర్శకుడు వీఐ ఆనంద్. ప్రస్తుతం వీరి కాంబినేషన్లో రూపొందిన సినిమా ‘ఊరిపేరు భైరవకోన’. సస్పెన్స్, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. వీరే కాదు.. మరికొందరు హీరోలు, దర్శకులు తమ కాంబోలో రెండో సినిమా ఇవ్వడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. -
పాన్ ఇండియా ని షేక్ చేస్తున్నారు
-
పాన్ఇండియా ని షాక్ చేస్తున్న కాంబినేషన్..!
-
మహేష్ బాబు ప్రభాస్ కి పోటిగా ఇండియన్ 2
-
విక్రమ్ వర్సెస్ బాషా?
-
కమల్‌హాసన్ చిత్రం ఆగిపోయిందా?
అగ్ర కథానాయకుడు కమల్‌హాసన్, మలయాళ దర్శకుడు మహేష్ నారాయణన్ కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రం ఆదిలోనే ఆగిపోయిందని ప్రచారం సాగుతోంది. విశ్వరపం సినిమా నుంచి వీరి మధ్య స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయి. మహేష్ నారాయణన్ మలయాళంలో టేక్ ఆఫ్, సీయూ సన్, మాలిక్ వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ నేపథ్యంలో కమల్‌హాసన్ కథానాయకుడిగా ఓ చిత్రం రూపొందనున్నట్లు అధికారిక ప్రకటన ఇటీవల వెలువడింది. అయితే విక్రమ్ సంచలన విజయం సాధించడంతో ప్రస్తుతం కమల్‌హాసన్ శంకర్ దర్శకత్వంలో ఇండియన్–2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. దర్శకులు హెచ్.వినోద్, మణిరత్నం దర్శకత్వంలో నటించడానికి కమల్ కమిట్ అయ్యారు. దీంతో మహేష్నారాయణన్ దర్శకత్వంలో నటించే చిత్రం ఆగిపోయిందనే ప్రచారం సాగుతోంది. ఇలాంటి వార్తలపై స్పందింన మహేష్ నారాయణన్.. తన దర్శకత్వంలో కమల్‌హాసన్ కథానాయకుడిగా నటించే చిత్రం డ్రాప్ కాలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం కమల్ ఇండియన్– 2 చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్నారని చెప్పారు. ఆ చిత్రం పూర్తి కాగానే తర్వాత కొత్త చిత్రంపై చర్చలు ఉంటాయని స్పష్టం చేశారు. -
కమల్ హాసన్ బర్త్‌డే స్పషల్.. ఇండియన్-2 పోస్టర్ అదుర్స్
విశ్వనటుడు కమల్‌హాసన్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘ఇండియన్ 2’. శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. 1996లో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీ యుడు’) సినిమాకు ఇది సీక్వెల్. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. సోమవారం కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా క్రేజీ అప్ డేట్‌తో ముందుకొచ్చింది చిత్రబృందం. ఈ మూవీలో కమల్ హాసన్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. (చదవండి: తిరుపతిలో 'ఇండియన్-2' షూటింగ్) కమల్ తాజా పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ పోస్టర్లో కమల్ వృద్ధుడి గెటప్ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇటీవలే తిరుపతిలో కొన్ని కీలకమైన సీన్లు కూడా తెరకెక్కించారు. ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్‌సింత్, బాబీ సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. To the one who’s versatility is beyond comparison, wishing the legend of Indian cinema a very happy birthday from team #Indian2#Ulaganayagan @ikamalhaasan #HBDKamalHaasan pic.twitter.com/rlwxnJmRbd — Red Giant Movies (@RedGiantMovies_) November 7, 2022 -
కమల్‌హాసన్ హెల్త్ బులెటిన్ విడుదల.. వైద్యులు ఏం చెప్పారంటే ?
Doctors Said Kamal Hasan Recovered From Corona: లోకనాయకుడు కమల్‌హాసన్ కరోనా నుంచి కోలుకున్నాడని చెన్నైలోని శ్రీ రామచంద్రా మెడికల్ సెంటర్ ప్రకటించింది. కమల్ ఆరోగ్యం ప్రస్తుతం నలకడగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు. అందుకే ఈ నెల 3న డిశ్చార్జ్ చేస్తామని హెల్త్ బులెటిన్‌లో వైద్యులు పేర్కొన్నారు. డిసెంబర్ 4 నుంచి కమల్ హాసన్ తన పనులను చేసుకోవచ్చని వైద్యులు తెలిపారు. అయితే ఇంతకుముందు అమెరికా పర్యటనను ముగించుకుని వచ్చిన ఆయన అస్వస్థతకు గురయ్యారు. వైద్యపరీక్షలు చేయించుకోగా కమల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో చికిత్స కోసం నవంబర్ 22న ఆస్పత్రిలో చేరారు. ఇదిలా ఉండగా కమల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కమల్‌హాసన్, ఫాహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రధారులుగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘విక్రమ్’. ఇందులో విక్రమ్ పాత్రలో కనిపిస్తారు కమల్. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకుంటున్నట్లు సమాచారం. అలాగే శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2లో కూడా నటిస్తున్నారు కమల్. ఇది చదవండి: కమల్ హాసన్‌ను పరామర్శించిన రజనీకాంత్ -
కమల్‌హాసన్, ఫాహద్, సేతుపతి.. భారీ మల్టిస్టారర్ షూటింగ్ షురు
చిన్న బ్రేక్ తర్వాత విక్రమ్ యాక్షన్ మళ్లీ షురూ అయ్యింది. కమల్‌హాసన్, ఫాహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రధారులుగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘విక్రమ్’. ఇందులో విక్రమ్ పాత్రలో కనిపిస్తారు కమల్. ఈ సినిమా తాజా షెడ్యూల్ కోయంబత్తూర్‌లో మొదలైంది. ఇప్పటివరకు జరిపిన షూటింగ్లో కమల్–విజయ్ సేతుపతి కాంబినేషన్ సీన్స్, ఫాహద్ సీన్స్‌ను విడి విడిగా తీశారు. తాజా షెడ్యూల్లో కమల్, విజయ్ సేతుపతి, ఫాహద్ కాంబినేషన్లో సీన్స్‌ను షురూ చేశారు లోకేష్. ఇవి యాక్షన్ సీక్వెన్స్ అని తెలిసింది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. -
కొత్తదనం కోసం తాపత్రయపడే నటతపస్వి.. కమల్ హాసన్
ఎన్ని ప్రయోగాలు చేసినా తీరని కళాదాహం. ఉప్పొంగే అద్భుత హావభావాల నటప్రవాహం. అంత తేలిగ్గా అంతుపట్టని మర్మయోగి. ఎంత అభివర్ణించినా పట్టుబడని ప్రజ్ఞాశాలి. అనుకున్నది సాధించి ఎవ్వరూ ఛేదించలేని శిఖరంలా ఎదిగాడు. అతి సామాన్యుడిలా ఒదిగాడు. అతనే భారతీయ సినిమా గర్వించదగ్గ నటుడు..కమల్ హాసన్. నవంబర్ 7 కమల్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రయాణాన్ని చూద్దాం. ఆరేళ్లకే నటప్రస్థానాన్ని ప్రారంభించాడు. వైవిధ్యమైన నటనతో సినీ అభిమానులు మనసు దోచుకున్నాడు. ఆయన్ని పొగడని విమర్శకుడు లేడు. ఆయన పొందని ప్రశంస లేదు. కమల్ హాసన్ వెండితెరపై అస్సలు కనిపించడు. అంతలా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తాడు. అందుకే ఆయన్ని చూస్తే కొత్తదనాన్ని చూసినట్టు ఉంటుంది. 1954, నవంబర్ 7న తమిళనాడుకు చెందిన, రామనాథపురం జిల్లా, పరమకుడిలో జన్మించారు కమల్ హాసన్. తన ఆరేళ్ల వయసులో ‘కలత్తూర్ కన్నమ్మ’ అనే సినిమాతో.. బాలనటుడిగా తెరంగేట్రం చేశాడు. మొదటి సినిమాతోనే జాతీయ స్థాయిలో ఉత్తమ బాలనటుడి అవార్డ్ సాధించారు. బాలనటుడిగా శివాజీగణేశన్, ఎంజీ రామచంద్రన్ వంటి తమిళ అగ్రనటులతో కలసి పనిచేశారు. యవ్వనంలో డాన్స్ డైరెక్టర్ కమ్ ఫైటర్ గా పనిచేశారు. 1974లో మలయాళంలో వచ్చిన ‘కన్యాకుమారీ’ కమల్ ను సక్సెస్ ఫుల్ హీరోను చేసింది. 1977లో వచ్చిన ‘పదనారు వయదినిలె’ కమల్ హాసన్ కెరీర్‌ను మలుపుతిప్పింది. 1978లో ‘మరో చరిత్ర’తో కమల్ చరిత్రే మారిపోయింది. ఇందులో కమల్, సరితలు చేసిన నటనకు.. తెలుగు ప్రేక్షకులు నీరాజనం పలికారు. కలర్ సినిమాల టైంలో వచ్చిన బ్లాక్ అండ్ వైట్ మూవీ ఇది. 1983లో కమల్, శ్రీదేవి జంటగా బాలుమహేంద్ర దర్శకత్వంలో ‘మూన్రాంపిరై ’బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపించింది. తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని దాన్ని ‘వసంత కోకిల’గా తెలుగులోకి డబ్ చేసి విడుదల చేశారు. ఈ చిత్రం హిందీలో ‘సద్మా’గా రీమేక్ అయింది. ఈ సినిమాలోని నటనకు జాతీయ స్థాయిలో ఉత్తమనటుడిగా ఎంపికయ్యాడు. మణిరత్నం దర్శకత్వంలో చేసిన ‘నాయకుడు’ మూవీలో నటనకుగాను రెండోసారి, శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘భారతీయుడు’ సినిమాతో మూడోసారి ఉత్తమ నటుడిగా అవార్డు దక్కించుకున్నాడు. ఆర్ట్ సినిమాలోని నాచురాలిటీ.. కమర్షియల్ సినిమాలోని సేలబులిటీ..రెండిటినీ మిక్స్ చేసి సరిహద్దు రేఖల్ని చెరిపేశాడు. సినిమా అంటే ఓ కళారూపం అన్న సత్యాన్ని తెలియజెప్పాడు. ప్రాంతాలు, భాషలు అనే అడ్డుగోడల్ని కూల్చేశాడు. సినిమా చుట్టూ అల్లిన లిల్లీపుట్ ఫార్మెట్ ను బద్ధలుకొట్టి..నిజమైన నాయకుడిగా నిలబడ్డాడు.. ఆ లోకనాయకుడు. నాయకుడుగా నటించినా.. బ్రహ్మచారిగా కనిపించినా.. తెనాలిగా మెప్పించినా.. ఇంద్రుడు చంద్రుడు అనిపించుకున్నా.. అది కమల్‌కే చెల్లింది. హీరోయిజానికి మించి నటుడిగా తన ఇమేజ్ తారాస్థాయికి వెళ్లింది. నిరంతరం కొత్తదనం కోసం తాపత్రయపడే నటతపస్వి.. కమల్ హాసన్. అన్నీ అద్భుతాలే సాధిస్తే ఏమవుతుంది? అవార్డులు..రివార్డులూ వద్దన్నా చెంతకు చేరతాయి. అభినందనలు...ప్రశంసలూ వెతుక్కుంటూ వచ్చి ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కమల్ హాసన్ తన అద్భుత నటనకుగాను 19 ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు 4 నేషనల్ అవార్డులను అందుకున్నారు. 1990లో పద్మశ్రీ, 2014లో పద్మభూషన్ వంటి ఎన్నో గొప్ప అవార్డులను సొంతం చేసుకున్నారు. కమల్ నట వారసులుగా ఆయన కూతుళ్లు శృతి హాసన్, అక్షరా హాసన్‌లు హీరోయిన్లుగా రాణిస్తున్నారు. త్వరలో ’విక్రమ్’తో పాటు ‘భారతీయుడు 2’ చిత్రాలతో త్వరలోప్రేక్షకులను పలకరించనున్నారు. -
ఆ ముగ్గురిలో నేనున్నా!
ఆ ముగ్గురిలో నేనున్నానంటూ సంబరపడిపోతోంది నటి ప్రియ భవానీశంకర్. బుల్లితెరపై నటనలో ఓనమాలు నేర్చుకున్న ఈ బ్యూటీ వెండితెరపై స్టార్ ఇమేజ్ కోసం ఎదురుచూస్తోంది. మేయాదమాన్ చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన నటి ప్రియా భవానీశంకర్‌పై ఆ చిత్ర హిట్ కావటంతో బిజీ అయ్యింది. ఇక ఆ తరువాత కార్తీ సరసన కడైకుట్టి సింగం, ఎస్జే.సూర్యతో జతకట్టిన మాన్స్టర్ చిత్రాలు ప్రియాభవానీశంకర్‌ను సక్సెస్ఫుల్ హీరోయిన్ల పట్టికలో చేర్చాయి. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడికి తాజా బంపర్ డ్రా తగిలినట్లయ్యింది. అవును ఏకంగా విశ్వనాయకుడితోనే నటించే లక్కీచాన్స్‌ను ఇండియన్–2లో కొట్టేసింది. స్టార్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. కాగా ఇందులో హీరోయిన్లగా నటి కాజల్ అగర్వాల్, ఐశ్వర్యారాజేశ్, ప్రియభవానీశంకర్ నటించనున్నట్లు తెలిపింది. త్వరలోనే ఇండియన్–2 చిత్రం సెట్‌పైకి వెళ్లనుంది. కాగా ఇండియన్–2 చిత్రంలో నటించే అవకాశం రావడం గురించి నటి ప్రియభవానీశంకర్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఇండియన్–2 చిత్రంలో తాను నటించనున్న మాట నిజమేనని చెప్పింది. ఈ చిత్రం కోసం తనను పిలిపించిన శంకర్ రెండు గంటల పాటు కథను వినిపించారని చెప్పింది. అందులో తన పాత్ర గురించి తెలిసిన తరువాత ఆశ్చర్యపోయానని అంది. కమలహాసన్ చిత్రంలో 10 నిమిషాల పాత్రలోనైనా నటిస్తే చాలని భావించానని అంది. అలాంటిది ఇండియన్–2 చిత్రంలో ముగ్గురు హీరోయిన్లలో తానూ ఒకరినని తెలిసి వెంటనే నటించడానికి అంగీకరించినట్లు చెప్పింది. శంకర్ దర్శకత్వంలో కమలహాసన్, సిద్ధార్థ్, కాజల్‌అగర్వాల్ వంటి వారితో కలిసి నటించడం భాగ్యంగా భావిస్తున్నానని చెప్పింది. ఇండియన్–2లో ఈ బ్యూటీ పాత్ర చిత్రంలో చివరి వరకూ ఉంటుందట. ఇకపోతే ఈ చిత్రంతో పాటు ప్రియభవానీశంకర్ను మరో భారీ చిత్రంలో నటించే అవకాశం వరించింది. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్‌కు జంటగా ఆయన 54వ చిత్రంలో నటించనుంది. ఇలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో నటించే అవకాశాలను దక్కించుకుంటోందీ అమ్మడు. -
‘ఇండియన్ 2’ ఇప్పట్లో రాదట!
లోకనాయకుడు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం ఇండియన్ 2. సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా పరిస్థితి ఒక్క అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతోంది. ఈ సినిమాను ముందుగా దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కించాలని భావించారు. కానీ బడ్జెట్ కారణంగా సినిమా లైకా ప్రొడక్షన్స్ చేతికి వెళ్లింది. అయితే లైకా సంస్థ కూడా బడ్జెట్ విషయంలో దర్శకుడు శంకర్‌కు ఆంక్షలు పెట్టడంతో దాదాపు ప్రాజెక్ట్ ఆగిపోయినట్టే అని భావించారు అంతా. లైకా పెట్టిన కండిషన్స్‌కు శంకర్ ఓకే చెప్పటంతో ఇండియన్ 2 పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. కమల్ కూడా ఎన్నికల హడావిడి ముగించుకొని షూటింగ్‌లకు సిద్ధం కావటంతో ఇండియన్ 2ను త్వరలోనే పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ సినిమా ఇప్పట్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. భారీ చిత్రం కావటంతో షూటింగ్‌కే ఎక్కువ రోజులు సమయం పడుతుందని భావిస్తున్నారు. అందుకే ఈ సినిమా రిలీజ్‌కు ఏడాదిన్నరకు పైగా సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. హడావిడి చేయకుండా పక్కాగా ఓకే అనుకున్న తరువాత 2021 మార్చిలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్, రకుల్ ప్రీత్ సింగ్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. -
ఆగిపోలేదు
శంకర్ – కమల్‌హాసన్ కాంబినేషన్లో ‘భారతీయుడు 2’ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఎన్నికల కారణంగా షూటింగ్‌కి కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత బడ్జెట్ ప్రాబ్లమ్‌తో సినిమాను ఆపేస్తున్నారని వార్తలు వినిపించాయి. తాజాగా ఈ సినిమా ఆగిపోలేదని కోలీవుడ్ సమాచారం. కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ని రూపొందిస్తున్నారు. కాజల్ కథానాయిక. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. బడ్జెట్ డిస్కషన్, ఇతర కారణాల వల్ల శంకర్ ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేశారనే ప్రచారం జరిగింది. తాజాగా ‘భారతీయుడు 2’ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయాని తెలిసింది. జూన్‌లో తిరిగి షూటింగ్ స్టార్ట్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారట. 2021 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అవుతుందట. -
కమల్ నాలుక కట్ చేయాలి: మంత్రి
సాక్షి, చెన్నై: మక్కల్ నీధి మయ్యమ్ అధినేత కమల్‌హాసన్ హిందూ ఉగ్రవాదంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. స్వతంత్ర భారత్ లో మొట్టమొదటి హిందూ ఉగ్రవాది నాథూరామ్ గాడ్సే అని వ్యాఖ్యలు చేసిన కమల్‌హాసన్ నాలుకను కత్తిరించాలని తమిళనాడు మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీల ఓట్ల కోసమే కమల్‌హాసన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఓ వ్యక్తి కారణంగా మొత్తం మతాన్ని నిందించలేమన్నారు. ఎన్నికల సంఘం కమల్‌హాసన్‌పై చర్యలు తీసుకుని, ఆయన పార్టీపై నిషేధం విధించాలని రాజేంద్ర బాలాజీ డిమాండ్ చేశారు. మహాత్మ గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సేను ప్రస్తావిస్తూ దేశంలో తొలి ఉగ్రవాది హిందువేనన్న మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై భగ్గుమన్న బీజేపీ కమల్‌పై చర్యలు తీసుకునే విధంగా ఈసీకి ఫిర్యాదు చేస్తామని ఇదివరకే ప్రకటించారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కూడా కమల్ కామెంట్స్‌ను తప్పుపట్టారు. -
లక్ కరెక్ట్ కాదు
సౌత్ కథానాయికలు ఎవరైనా బాలీవుడ్లో సత్తా చాటాలని ఆశపడుతుంటారు. ఆల్రెడీ జయప్రద, శ్రీదేవి, రేఖ వంటి ప్రముఖ కథానాయికలు దక్షిణాది నుంచి వెళ్లి అక్కడ హీరోయిన్లుగా అగ్రస్థాయికి ఎదిగారు. అయితే బాలీవుడ్ చాన్స్ అందరికీ వెంటనే రాదు. కానీ కమల్‌హాసన్ పెద్ద కుమార్తె శ్రుతీహాసన్ సినీ ప్రస్థానం ‘లక్’ (2009) అనే హిందీ చిత్రంతోనే ఆరంభం అయ్యింది. కానీ ఆమె అక్కడ పెద్ద ఫేమస్ కాలేదు. ‘లక్’ చిత్రం సరిగ్గా ఆడకపోవడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఆ సినిమాని శ్రుతి గుర్తు చేసుకుంటూ– ‘‘అప్పటికి సినిమాల గురించి నాకు పూర్తి అవగాహన లేదు. కథానాయికగా నటించడానికి సిద్ధంగా లేను. అకస్మాత్తుగా సంగీత ప్రపంచం నుంచి వచ్చి హీరోయిన్గా కెమెరా ముందుకు వచ్చాను. ‘లక్’ చిత్ర ప్రయాణంలో సినిమా అంటే ఏంటో నాకు అర్థం అయ్యింది. ఓ సినిమా వెనక ఉండే కష్టం, విలువ నాకు తెలిసొచ్చాయి. ‘లక్’కు మేము ఊహించిన స్పందన రాలేదు. సినిమా సక్సెస్ కావొచ్చు. ఫెయిల్ కావొచ్చు. నేను తీసుకున్న నిర్ణయం అది. వేరే వారిని కారణంగా చెప్పలేను. కానీ ఆ తర్వాత ఆ సమయంలో నేను తీసుకున్న నిర్ణయం సరైనది కాదనిపించింది. ఆ అనుభవాన్ని మాత్రం ఓ పాఠంలా అనుకుని కెరీర్లో ముందుకు వెళుతున్నాను’’ అని చెప్పుకొచ్చారు శ్రుతీహాసన్. ప్రస్తుతం శ్రుతి బాలీవుడ్లో మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. విద్యుత్ జమాల్ ఇందులో హీరో. -
కమల్ పార్టీ ప్రధాన ఎజెండా ఏంటంటే...
సాక్షి, చెన్నై : సీనియర్ నటుడు, కమల్ హాసన్ రాజకీయ పార్టీని ప్రకటించేందుకు సిద్ధమైపోయారు. వచ్చే బుధవారం పార్టీ పేరుతోపాటు పలు కీలక విషయాలను వెల్లడించే అవకాశం ఉంది. అయితే తన పార్టీ అసలు ఎజెండా ఏంటో ఇప్పుడు ఆయన వివరించే పనిలో నిమగ్నమయ్యారు. తమిళ వారపత్రిక ఆనంద వికటన్‌లో ఈ మేరకు ఆయన ఓ వ్యాసం రాశారు. ‘రైతన్నల సమస్యల పరిష్కారం- ఆ దిశగా పోరాటం’ తన పార్టీ ప్రధాన ఉద్దేశ్యమని కమల్ ప్రకటించేశాడు. ‘‘తమిళనాడులో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. అభివృద్ధి పేపర్ల మీద తప్ప ఆచరణలో కనిపించటం లేదు. ఇక్కడ అన్నాడీఎంకే ప్రభుత్వం, అక్కడ కేంద్ర ప్రభుత్వం కలిసి రైతాంగాన్ని మోసం చేస్తున్నాయి. ఢిల్లీ నడిబొడ్డున రైతులు దీక్షలు చేసినా.. దేశం మొత్తం చర్చించుకున్నా ప్రభుత్వాల్లో కదలికలు రాలేదు. అందుకే ఆ అంశాన్ని పార్టీ ప్రధాన ఎజెండాగా ఎత్తుకుని ముందుకు సాగాలని నిర్ణయించుకున్నా’’ అని కమల్ వివరించారు. ఇక అమెరికా పర్యటనలో భారత వ్యాపారవేత్తలతో భేటీ అయిన విషయాలను కూడా ఆయన వెల్లడించారు. ‘తమిళనాడు వ్యవసాయ రంగం గురించి భారత వ్యాపారవేత్తలతో చర్చించా. గ్రామాల అభివృద్ధికి వారంతా స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. అయితే పంట భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారంగానో, విద్యాలయాలకు కేంద్రంగానో భావించవద్దని విజ్ఞప్తి చేశా. అందుకు వారు సుముఖత వ్యక్తం చేశారు’ అని కమల్ వివరించారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాతను, వ్యవసాయాన్ని సజీవంగా సమాధి చేయాలని ప్రభుత్వాలు చూస్తున్నాయని... అందుకే తన పోరాటాన్ని(రాష్ట్ర పర్యటన) గ్రామాల నుంచే ప్రారంభిస్తున్నానని ఆయన తెలిపారు. తమిళనాడులోని గ్రామాలన్నింటిని స్వర్గధామంగా చూడటమే తన కల అని కమల్ ఆ వ్యాసంలో వెల్లడించారు. -
‘నో’ చెప్పలేని ఆఫర్
నో చెప్పలేని ఆఫర్ వస్తే వెనకా ముందూ ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు ఎవరైనా. నయనతార ముందు అలాంటి ఓ భారీ ఆఫర్ ఉందట. ఇంతకీ అంత పెద్ద అవకాశం ఏంటీ? అనే విషయానికొస్తే.. లోక నాయకుడు సరసన నటించే చాన్స్. లోక నాయకుడు ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి పాత్రని అయినా సునాయాసంగా చేసేసే కమల్‌హాసన్‌కి సినిమా లవర్స్ ఇచ్చిన బిరుదు అది. కమల్ సరసన ‘భారతీయుడు–2’లో నటించమని చిత్ర దర్శకుడు శంకర్ వర్గం నయనతారని సంప్రదించారని టాక్. 1996లో కమల్ హీరోగా శంకర్ తీసిన ‘భారతీయుడు’కి ఇది సీక్వెల్. ఇందులో కథానాయిక విప్లవ నాయిక అని సమాచారం. ఈ పాత్రకే నయనతారను అడుగుతున్నారట. కమల్‌తో జోడీ, శంకర్ లాంటి గొప్ప దర్శకుడు, సెన్సేషనల్ హిట్ మూవీ ‘భారతీయుడు’కి సీక్వెల్, దాదాపు 200 కోట్ల బడ్జెట్... ‘నో’ చెప్పలేని ఆఫర్ కదా. మరి.. నయనతారకు కూడా అలానే అనిపిస్తే ‘యస్’ చెప్పేయడం గ్యారంటీ. ఒకవేళ డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతే అప్పుడు నయనతార స్థానంలో శంకర్ బృందం వేరే తారను అనుకోవాలి. -
కుల శౌర్యానికి పతాకం ఎత్తిన క్షత్రియ పుత్రుడు
‘లేపు... నీలోని మృగాన్ని నిద్రలేపు’ అంటాడు నాజర్. అతడి చేతిలో కొడవలి ఉంటుంది. ఎదురుగా కమలహాసన్ నిరాయుధుడిగా ఉంటాడు. ఇద్దరూ దాయాదులు. అన్నదమ్ముల బిడ్డలు. ఊళ్లో ఆధిపత్యం కోసం నాజర్ ప్రయత్నిస్తుంటాడు. పెదనాన్న కొడుకైన కమలహాసన్ దానికి అడ్డం. ఆ అడ్డాన్ని తొలగించుకోవాలి. అందుకే చేతిలో కొడవలి. ‘మృగాన్ని నిద్ర లేపరా’ అని మళ్లీ అంటాడు నాజర్. కమలహాసన్ ఇప్పుడు కత్తి పట్టుకోవాలి. పట్టుకోవాల్సిందే. ఎవరో ఒకరు మిగలాలి. ఎవరో ఒకరు. దేశంలో సహస్ర కులాలు ఉన్నాయి. కలి పురుషుడి శిరస్సు నుంచి కొన్ని కులాలు పుట్టాయట. వక్షం నుంచి కొన్నట. ఊరువుల నుంచి కొన్ని... పాదాల నుంచి కొన్ని... వీటిలో కొన్ని ఎక్కువ. కొన్ని తక్కువ. మనిషికి తన ఆధిక్యాన్ని నిరూపించుకోవడం ఇన్స్టింక్ట్. ఆ ఆధిక్యం కోసం ప్రాణాలు పణంగా పెట్టడం ఇన్స్టింక్ట్. తమిళనాడు దక్షిణ జిల్లాలలో విరివిగా ఉండే దేవర్లు తమను తాము గొప్ప కులంగా క్షత్రియులుగా భావిస్తారు. మాటకు విలువివ్వడం, పరువు కోసం ఎంతకైనా తెగించడం వీరి నైజం. గ్రామాలలో కులమే ఒక ఉనికి అయినప్పుడు ఆ కులం ఆధారంగా పెత్తనం చెలాయించాలనుకున్నప్పుడు ఘర్షణలు తప్పవు. ఒకే కులంలోని ఒకే వంశంలో అధికారం అనువంశికం అయినప్పుడు దాయాది పోరు వస్తుంది. ఈ సినిమాలో ఊరి పెద్దగా, పెద్ద దేవర్‌గా శివాజీ గణేశన్ ఉంటాడు. ఆయన తమ్ముడు ఏనాడో అతడి నుంచి విడిపోయాడు. ఆస్తులు విడిపోయాయి. కాని పంతాలు పట్టింపులు ఉండిపోయాయి. శివాజీ గణేశన్ కొడుకు కమలహాసన్. తమ్ముడి కొడుకు నాజర్. ఈ రెండు కుటుంబాల కోసం ఊరు రెండుగా చీలిపోయి ఉంటుంది. ఇరు వర్గాల మధ్య నివురుగప్పిన నిప్పు. ఈ నిప్పు ఏ క్షణాన్నయినా ఊరిని దహించడానికి సిద్ధంగా ఉంటుంది. ఆ నిప్పును అనుకోకుండా రాజేసినవాడు పెద్ద దేవర్ కొడుకు కమలహాసనే. కమలహాసన్ లండన్‌లో చదువుకున్నాడు. అక్కడే తనకు పరిచయమైన గౌతమిని ప్రేమించాడు. ఆమెను పెళ్లి చేసుకుని పిజా, బర్గర్లు అమ్మే ఫుడ్ చెయిన్స్ ఎస్టాబ్లిష్ చేసి సెటిల్ అవ్వాలనేది కోరిక. ఆ మాట చెప్పిపోదామనే గౌతమితో కలిసి ఊరికి వస్తాడు. అతడి దృష్టిలో అతడు భవిష్యత్తును వెతుక్కుంటున్న యువకుడు. కాని ఊరి దృష్టిలో అతడు చిన్న దేవర్. తండ్రి దృష్టిలో తన అధికారానికి వారసుడు. అల్లరి చిల్లరిగా వచ్చిన కమల హాసన్ తన ప్రియురాలి మెచ్చుకోలు కోసం ఇరువర్గాలు పంతాలతో తాళాలు వేసి ఉన్న ఊరి గుడి తలుపులను తెరిపిస్తాడు. దీని కోసమే కాచుకుని ఉన్న నాజర్ వర్గం ఎవడైతే తాళాలు తీయడంలో కమలహాసన్‌కు సాయం చేస్తాడో అతడి చేయి నరికేస్తారు. అందుకు బదులుగా కమలహాసన్ వర్గం ఆ వ్యక్తి ఇంటిని తగలబెడుతుంది. దానికి బదులుగా నాజర్ వర్గం చెరువు కట్ట తెగ్గొట్టి ఊళ్లో బీదా బిక్కి జనాల చావుకు కారణమవుతుంది. ఒక పది రోజుల వ్యవధిలోనే ఊరు రణరంగం అవుతుంది. ఏదో చూసి పోదామని వచ్చినవాడు కమలహాసన్ తండ్రి హఠాన్మరణంతో ఊరికి పెద్ద దిక్కుగా మారాల్సి వస్తుంది. బరి ఒక్కోసారి ఎంతటి ప్రమాదకరమైనదంటే ప్రేక్షకుణ్ణి కూడా తనలోకి లాగి పోటీదారుణ్ణి చేస్తుంది. ఇప్పుడు కమలహాసన్ పోటీదారు. నాజర్ అతడి ప్రత్యర్థి. ఆట నియమం ప్రకారం ఒకరే మిగలాలి. ఒక మృగం ఇంకో మృగం మెడ కొరకాల్సిందే. ఎవరా మృగం? ఊరి బాగు కోసం కమలహాసన్ తన ప్రేమను త్యాగం చేసి రేవతిని చేసుకుంటాడు. తన భవిష్యత్తును వదిలేసి తండ్రిలా ఊరికే అంకితమవుతాడు. నాజర్ వర్గంతో సర్దుబాటు కోసమే అనుక్షణం పాకులాడతాడు. మనం ఏమనుకుంటామంటే చెడ్డవాడు ఏదో ఒకరోజు మారతాడు అని. కాని ఎప్పటికీ మారని చెడ్డవాళ్లు కూడా ఉంటారు. ఎందుకంటే అది వారికి జన్మలక్షణం. నాజర్ అలాంటి వాడు. ఊరి మీద పెత్తనం కోసం తనకు పోటీ లేకుండా ఉండటం కోసం ఆఖరికి అతడు అమ్మవారి ఉత్సవంలో రథాన్నే పేల్చేందుకు తెగిస్తాడు. కథ క్లయిమాక్స్‌కు వస్తుంది. రాక్షస సంహారం జరిగే తీరాలి. ఊరి శివార్లలో గ్రామ శక్తి చేతిలోని గండ్ర కొడవలిని తీసుకొని నాజర్‌తో కలబడతాడు కమలహాసన్. లోహాలు ఖణేల్మంటాయి. సచ్చీలుని చేతిలోని ఆయుధమే గెలుస్తుంది. నాజర్ తల మెడ నుంచి బంతి ఎగిరినట్టు ఎగిరి విడివడుతుంది. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు.చేసిన నేరానికి కమలహాసన్ జైలుకు పోవడంతో సినిమా ముగుస్తుంది. ఈ సినిమా ప్రాథమిక మానవోద్వేగాల విశ్వరూపం చూపిస్తుంది. మొదట తండ్రీ కొడుకుల మధ్య అనుబంధం చూపుతుంది. శివాజీ గణేశన్, కమలహాసన్‌ల మధ్య అనుబంధానికి ప్రేక్షకుడు అనుసంధానమవుతాడు. కమలహాసన్, గౌతమిల మధ్య ప్రేమను చూపుతుంది. వారి ఎడబాటును ప్రేక్షకుడు అనుభూతి చెందుతాడు. కమలహాసన్, రేవతిల మధ్య పెళ్లి బంధానికి విలువ ఇస్తుంది. దీనిని ప్రేక్షకుడు గౌరవిస్తాడు. కమలహాసన్, నాజర్‌ల మధ్య పగను తీవ్రంగా చూపిస్తుంది. దీనికి ప్రేక్షకుడు స్పందిస్తాడు. దేశంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక కులం ఉంటుంది. దానికి ఏదో ఒక శౌర్యం ఉంటుంది. దానిని నిరూపించుకోవాలనుకునే భావోద్వేగం కూడా ప్రేక్షకులను సినిమాతో ఐడెంటిఫై చేసేలా చేస్తుంది. క్షత్రియ పుత్రుడులో కులం గెలిచింది. కాని అదే సర్వస్వం అనుకున్నప్పుడు మనిషి ఓడిపోతాడని హెచ్చరించింది. ఈ హెచ్చరిక ఈ దేశంలో కులం ఉన్నంత కాలం ఉంటూనే ఉంటుంది. దేవర్ మగన్ కమలహాసన్ నిర్మాతగా భరతన్ దర్శకత్వంలో 1992లో వచ్చిన గొప్ప ట్రెండ్ సెట్టర్ ‘దేవర్ మగన్’. తెలుగులో ‘క్షత్రియ పుత్రుడు’గా విడుదలయ్యి ఘన విజయం సాధించింది. భారతీయ సినిమాలలో కులవర్గాల పోరును సమర్థంగా ప్రవేశపెట్టిన సినిమా ఇది. వేటకొడవళ్ల ఆనవాయితీని కూడా ఈ సినిమాయే ప్రవేశపెట్టింది. ఈ సినిమా నుంచి కనీసం ముప్పై నలభై సినిమాలు, కనీసం వంద సీన్లు పుట్టి ఉంటాయి. ఇది వచ్చిన మరో ఏడేళ్లకు ‘సమర సింహారెడ్డి’ వచ్చిందని మనం గుర్తు చేసుకోవాలి. ‘సీతారామరాజు’ నుంచి నిన్నమొన్నటి ‘దమ్ము’ వరకూ ఎన్నో సినిమాలకు క్షత్రియ పుత్రుడు మాతృక. ‘అతడు’లో కంచె నాటే సీను, ‘బాహుబలి’లో చేయి కురచగా ఉండే నాజర్ పాత్ర... ఇవన్నీ క్షత్రియ పుత్రుడు నుంచే వచ్చాయి. పక్షవాతం వచ్చిన వృద్ధ విలన్ ఉండటం ఈ సినిమాలో కొత్త. అది చూసి ‘చూడాలని ఉంది’, ‘అంతఃపురం’ సినిమాలలో కేరెక్టర్లు పుట్టించారు. తండ్రి వారసునిగా కమలహాసన్ తండ్రివలే గెటప్ మార్చుకునే ఇంటర్వెల్ బ్యాంగ్ గొప్ప ఇంటర్వెల్ బ్యాంగ్స్‌లో ఒకటిగా నిలిచింది. శివాజీ గణేశన్ ఇందులో సహజమైన గెటప్‌లో అద్భుతంగా నటించడం చూస్తాం. గౌతమికి ఈ సినిమాతో చాలా పేరు వచ్చింది. రేవతికి కూడా. ‘సన్నజాజి పడక’ పాటలో రేవతి నోటితో దరువు వేయడం ఆ పాత్ర అథెంటిసిటీని చూపి ఆకట్టుకుంటుంది. పి.సి.శ్రీరామ్ ఈ సినిమాకు ఒక ముతక గ్రామీణ శోభను తెచ్చాడు. తమిళంలో రెండొందల రోజులు ఆడిన ఈ సినిమా తెలుగువారికి కూడా అంతే ఇష్టమైంది. హిందీ రీమేక్ ‘విరాసత్’ కూడా పెద్ద హిట్టే. – కె -
సుందర తెలుంగు
అమ్మ పాట.. ప్రేమ పాట.. హీరోయిజమ్ పాట (టైటిల్ సాంగ్) మొత్తం మూడు పాటలు కమల్‌హాసన్ ‘విశ్వరూపం 2’ కోసం రామజోగయ్య శాస్త్రి రాశారు. వీటిలో ‘అమ్మ..’ పాటను స్వయంగా కమల్‌హాసన్ పాడటం విశేషం. పాడిన తర్వాత ఆయన ఏమన్నారో తెలుసా? ‘సుందర తెలుంగు’ అన్నారు. అంటే ‘అందమైన తెలుగు’ అని అర్థం. ‘‘అమ్మ మీద వచ్చే పాట పాడిన తర్వాత కమల్‌గారు ‘తెలుగు సౌండింగ్ బాగుంటుంది. నాకు చాలా ఇష్టం. వినే కొద్దీ వినాలనిపిస్తుంది. అందుకే భారతియార్ తను రాసిన పాటలో ‘సుందర తెలుంగు’ అని రాశారు’’ అంటూ కమల్ మన భాషను కొనియాడారు అని రామజోగయ్య శాస్త్రి అన్నారు. ‘‘మన మాతృభాష మీద మనకు చాలా అభిమానం ఉంటుంది. వేరే భాషవాళ్లు మన భాష గొప్పతనం గురించి చెబుతున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది’’ అని కూడా రామజోగయ్య అన్నారు. ఇక, భారతియార్ గురించి చెప్పాలంటే.. ప్రముఖ తమిళ కవి ఆయన. పూర్తి పేరు సుబ్రమణ్య భారతియార్. 1882లో పుట్టిన ఆయన 1921లో చనిపోయారు. ఆయన బతికున్నప్పుడు రాసిన ‘సింధు నదియిన్ మీసై నిలవినిలే’.. అనే పాటలో ‘సుందర తెలుంగిల్ పాట్టిసైత్తు...’ అనే వాక్యం రాశారు. అంటే.. ‘సుందర తెలుగులో పాట రాసి’ అని అర్థం. దాదాపు వందేళ్ల క్రితమే తెలుగు భాష గొప్పదనం చెబుతూ పాట వచ్చిందన్న మాట. ‘అమ్మ’ పాట పాడాక కమల్ ఆ పాటను గుర్తు చేసుకోవడం విశేషం. ప్రస్తుతం కమల్ యూఎస్‌లో ఉన్నారు. ‘విశ్వరూపం 2’ ఫైనల్ మిక్సింగ్ పనులు అక్కడ చేయిస్తున్నారు. కమల్ నటించి, స్వీయదర్శకత్వంలో ‘విశ్వరూపం’కి సీక్వెల్‌గా చేసిన ఈ సినిమా వచ్చే ఏడాదిలో విడుదల కానుంది. -
రజనీ వెనుకడుగు.. కమల్ రెడీ..!
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం 2.ఓ. గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 450 కోట్ల బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రతి నాయక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను 2018 జనవరి 26న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే ఆలోగా నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి కావనే ఉద్దేశంతో సినిమాను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట. ముందుగా అనుకున్నట్టుగా జనవరి 26న కాకుండా ఏప్రిల్ 13న 2.ఓ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. అయితే రజనీ వదిలేసిన డేట్ కు కమల్ రావాలని నిర్ణయించుకున్నాడన్న టాక్ వినిపిస్తోంది. దాదాపు మూడేళ్లుగా ల్యాబ్ కే పరిమితమైన విశ్వరూపం 2 సినిమాను జనవరి 26న రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారట. మరో వారం రోజుల షూటింగ్ తో పాటు కొంత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ ఉండటంతో ఆ పనులన్నీ పూర్తి చేసి వీలైనంత త్వరగా సినిమాను రిలీజ్ కు రెడీ చేసే ప్లాన్ లో ఉన్నారు కమల్ టీం. -
కమల్‌పై కేసు నమోదు
సాక్షి,న్యూఢిల్లీ: హిందూ తీవ్రవాదంపై వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు కమల్ హాసన్‌పై కేసు నమోదైంది. ఆయనపై ఐపీసీ సెక్షన్లు 511, 298, 295(ఏ), 505(సీ) కింద అభియోగాలు నమోదు చేశారు. కమల్ ఇటీవల రాసిన ఓ వ్యాసంలో దేశంలో హిందూ తీవ్రవాదం పెచ్చరిల్లిందని, హిందూ తీవ్రవాదం లేదని ఎవరూ ప్రశ్నించలేరని, హిందువుల్లోనూ తీవ్రవాదం ప్రబలిందని కమల్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపిన విషయం తెలిసిందే.త్వరలో రాజకీయ పార్టీని ప్రారంభించనున్న కమల్‌పై నమోదైన అభియోగాలపై శనివారం విచారణ నిర్వహిస్తారు. కమల్ హాసన్‌పై నమోదైన ఆరోపణలకు, నమోదైన సెక్షన్లను పరిశీలిస్తే..సెక్షన్ 500 కింద కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు శిక్ష విధిస్తారు. 511 కింద నేరాలకు పూనుకోవడం, సెక్షన్ 298 కింద పరుష వ్యాఖ్యలతో ఏ వ్యక్తి మతపరమైన భావాలు దెబ్బతినేలా వ్యవహరించడం, సెక్షన్ 295(ఏ) కింద మత విశ్వాసాలాను, మతాన్ని కించపరచడం ద్వారా ఏ వర్గంవారి మత భావాలను దెబ్బతీయడం, సెక్షన్ 505(సీ) కింద ఒక వర్గం, మతాన్ని ఇతర మతం, వర్గంపై దాడులకు పురికొల్చేలా వ్యవహరించడం వంటి అభియోగాలను కమల్ హాసన్‌పై నమోదు చేశారు. -
నాన్నకు తెలుసు
తమిళసినిమా: తమిళ రాజకీయాలిప్పుడు కోలీవుడ్‌లోని ఇద్దరి చుట్టూ తిరుగుతున్నాయని చెప్పవచ్చు. వారెవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్‌స్టార్ రజనీకాంత్ విషయం పక్కన పెడితే విశ్వనటుడు కమలహాసన్ మాత్రం దూకుడును ప్రదర్శిస్తున్నారనే చెప్పవచ్చు. చాలా కాలంగా ప్రజల సమస్యలను ఎత్తి చూపుతూ రాజకీయ నాయకుల అవినీతిని ప్రశ్నిస్తున్నారు. పార్టీ స్థాపనకు సన్నాహాలు చేస్తున్నారు. కమల్ పుట్టిన రోజు సందర్భంగా నవంబరు ఏడవ తేదీన పార్టీ పేరును ప్రకటిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈయన రాజకీయరంగ ప్రవేశంపై ప్రజల్లో మాత్రం మిశ్రమ స్పందనే వస్తోందని చెప్పవచ్చు. ఈ విషయంలో కమలహాసన్ సోదరుడు చారుహాసనే నిరుత్సాహపరచే విధంగా సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కమల్ రాజకీయాల్లోకొస్తే 10 శాతం ఓట్లు కూడా సాధించలేరని పేర్కొన్నారు. ప్రజలు రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నారు గానీ, కమల్‌ను కోరుకోవడం లేదని అన్నారు. కాగా కమలహాసన్ రాజకీయరంగ ప్రవేశం గురించి ఆయన కూతురు, నటి శ్రుతీహాసన్ స్పందిస్తూ తన తండ్రి రాజకీయరంగ ప్రవేశాన్ని తాను స్వాగతిస్తానన్నారు. ఆయన మనఃసాక్షి కలిగిన దేశ పౌరుడని పేర్కొన్నారు. తన తండ్రికి రాజకీయాలు తెలుసో, తెలియవో గానీ, ప్రజలకు ఏం అవసరమో, ఏం చేయాలో తెలుసన్నారు. అందుకే నాన్నకు తానెప్పుడూ అండగా ఉంటానని నటి శ్రుతీహాసన్ పేర్కొన్నారు. -
ఆ సినిమాపై బీజేపీ ఆగ్రహం
సాక్షి, చెన్నై : ఇప్పటికే వివాదాలు ఎదుర్కొంటున్న తమిళ హీరో విజయ్ తాజా చిత్రం మెర్శల్‌పై బీజేపీ కన్నెర చేస్తోంది. విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మెర్శల్. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ తేనాండాళ్ ఫిలింస్ సంస్థ నిర్మించింది. పలు ఆటంకాలను ఎదురొడ్డి ఇటీవల తెరపైకి వచ్చిన ఈ చిత్రం ప్రజాదరణ అందుకుంటున్నా, మరోపక్క రాజకీయవాదుల ఆగ్రహానికి గురవుతోంది. ముఖ్యంగా బీజేపీ నాయకులు మెర్శల్ చిత్రంపై దండెత్తుతున్నారు. ప్రభుత్వ ఉచిత వైద్యంపై ఒత్తిడి తెచ్చే విధంగా మెర్శల్ చిత్ర తుది ఘట్ట సన్నివేశాల్లో ఆ చిత్ర కథానాయకుడు విజయ్ సింగపూర్ లాంటి దేశాల్లో 7 శాతం జీఎస్టీ విధించి ప్రభుత్వం ఉచిత వైద్యాన్ని అందిస్తోందని, మన దేశంలో 28 శాతం జీఎస్టీ పన్ను విధానాన్ని అమలు పరచి ఉచిత వైద్యాన్ని అందించలేకపోతోందని ఆవేశంగా చెప్పే సంభాషణలకు ప్రేక్షకులనుంచి విశేష ఆదరణ లభిస్తోంది.అదే విధంగా పెద్ద నోట్ల రద్దు విధానాన్ని ప్రస్తావించారు. దీంతో మెర్శల్ చిత్రంలో జీఎసీ, పెద్ద నోట్ల రద్దు విధానాలను వ్యతిరేకించేలా సన్నివేశాలు చోటు చేసుకోవడం బీజీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సౌందర్‌రాజన్ మెర్శల్ చిత్రంలోని జీఎస్టీ పన్ను, పెద్దనోట్ల రద్దుకు సంబంధించిన సన్నివేశాన్ని తొలగించాలని డిమండ్ చేశారు. తాజాగా కేంద్రమంత్రి పొన్‌రాధాకృష్ణన్ మెర్శల్ చిత్రంపై తీవ్రంగా ఖండన తెలిపారు. మెర్శల్ చిత్రంలో ఆ సన్నివేశాలను వెంటనే తొలగించాలన్నది తన అభిప్రాయం అని పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రజల మధ్య తప్పుడు సమాచారాన్ని తీసుకెళ్లడం శ్రేయస్కరం కాదని హితవు పలికారు. అలాగే ప్రముఖ నటుడు కమలహాసన్‌పైనా విమర్శలు సంధించారు. పెద్ద నోట్ల రద్దును మొదట స్వాగతించిన కమలహాసన్ ఇప్పుడు అందుకు బహిరంగ క్షమాపణ కోరుతున్నట్లు పేర్కొనట్లు తెలిసిందని, ఆయన ఏ విషయాన్నైనా పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. ముందు అనాలోచనతో వ్యాఖ్యలు చేసి ఆ తరువాత రాజకీయ కోణంలో వెనక్కు తీసుకోవడం నాగరికత కాదన్నారు. మెర్శల్ చిత్ర నిర్మాత వివాదాస్పదమైన ఆ సన్నివేశాలను చిత్రం నుంచి తొలగించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. -
నోట్లరద్దును సమర్థించడం తప్పే... క్షమించండి
తమిళసినిమా: ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకున్న నోట్లరద్దు నిర్ణయాన్ని సమర్థించడం తన తొందరపాటు, తప్పేనంటూ నటుడు కమల్‌హాసన్ ప్రజలను క్షమాపణలు కోరారు. మోదీ కూడా మొండిపట్టు పట్టకుండా తన తప్పును ఒప్పుకోవాలని ఆయన అన్నారు. పాత రూ.500, రూ.1,000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు గత నవంబర్ 8 రాత్రి మోదీ ప్రకటన చేయడం తెలిసిందే. ఆనంద వికటన్ అనే తమిళ వారపత్రికలో కమల్ తాజాగా ఓ వ్యాసం రాస్తూ ‘తొందరపాటుతో అప్పట్లో నోట్లరద్దును సమర్థించాను. ఆర్థిక వ్యవస్థపై అవగాహన ఉన్న నా మిత్రులు కూడా అప్పుడే నన్ను తప్పుబట్టారు. తప్పులు ఒప్పుకోవడం, సరిదిద్దుకోవడం గొప్ప నేతల లక్షణాలు. మోదీ తన తప్పును ఒప్పుకుంటారేమో వేచిచూద్దాం’ అని పేర్కొన్నారు.