ఆ టైం ఇంకా రాలేదు
సినిమానే శ్వాసగా జీవిస్తున్న కుటుంబానికి చెం దిన నటి అక్షరహాసన్. ఈ బ్యూటీఫుల్ వర్ధమానతార గురించి పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. పులి కడుపున పిల్లి పుడుతుందా? అన్న సామెతను నిజం చేస్తూ తొలి చిత్రం తోనే నటిగా తానేమిటో నిరూపించుకున్నారు అక్షరహాసన్. నటననే నడకలు నే ర్పే విశ్వనాయకుడు కమలహాసన్, సారికల రెండవ కూతురు అక్షర. పెద్ద కూతురు శ్రుతిహాసన్ అనతికాలంలో నే భారతీయ సినిమాలో తన కంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పుడు అక్షర ఆ ప్రయత్నంలో ఉన్నారు. సోదరీమణులలోనే వీరిద్దరి మధ్య సామిప్యం ఏమిటంటే శ్రుతి మొదట సంగీ త రంగంలో రాణించాలని భావించారు. అటుగా తొలి అడుగులు వేశారు కూడా.
ఉన్పైల్ ఒరువన్ చిత్రం ద్వారా సంగీత దర్శకురాలని ముద్ర వేసుకున్నారు. తండ్రి నటించిన చిత్రానికి తనయ సంగీతం అందించడం అరుదైన విషయమే. ఆ తరువాత శ్రుతి నటనపై దృష్టి సారించి నేడు ప్రముఖ హీరోయిన్‌గా విరాజిల్లుతున్నారు. ఇక అక్షరహాసన్ విషయానికొస్తే ఈమె తొలుత తెరవెనుక రాణించాలని కోరుకున్నారు. అలా దర్శకత్వ శాఖలో ఓనమాలు దిద్దారు కూడా. అయితే అనూహ్యంగా అక్క శ్రుతి మాదిరిగానే అక్షర కూడా కెమెరా ముందు కొచ్చేశారు. హిందీ చిత్రం షమితాబ్‌లో బాలీవుడ్ బిగ్ బీ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌ల మధ్య నటించి శభాష్ అనిపించుకున్నారు. దీంతో ఇటు దక్షిణాదిలోను అటు ఉత్తరాదిలోను అవకాశాలు తలుపుతడుతున్నాయి.
తమిళంలో ధనుష్‌కు జంటగా నటింప చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నటి అక్షరహాసన్ ఎలా స్పం దించారో చూద్ధాం. నాకు తమిళం, తెలుగు చిత్రాల్లో నటించాలని ఆశగానే ఉంది. అయితే అందుకు తగిన సమయం ఇంకా రాలేదని భావిస్తున్నాను. మొదట హిందీ చిత్ర సీమలో నటిగా స్థిరపడాలన్నదే నా లక్ష్యం అక్కడ సాధించిన తరువాత ఖచ్చితంగా తమిళం, తెలుగు భాషలలో నటిస్తాను. నా తల్లిదండ్రులు కమలహాసన్, సారిక గొప్ప నటులని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సొంత నిర్ణయాలు తీసుకోవడానికి వారు స్వేచ్ఛ నిచ్చారు. నన్ను నేను మం చి నటిగా తీర్చిదిద్దుకోవడానికి కృషి చేస్తున్నాను. ప్రస్తుతం నూతన చి త్రాలేమీ అంగీకరించలేదు. కథలు వింటున్నాను.